E-Paper
Advertisement

OTT Release This Week : ప్రేమ కథల నుంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ వరకు… ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు సిరీసులు

OTT Release This Week : ప్రేమ కథల నుంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ వరకు… ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు సిరీసులు
Advertisement

OTT Release This Week : ఫిబ్రవరి రెండవ వారంలో ఓటీటీ ప్రియులకు సినిమాల విందుతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. ఈ వారమంతా కొత్త కంటెంట్‌ తో వచ్చిన కొత్త సినిమాలు, సిరీస్‌ లు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈ లిస్ట్ లో హై-ఆక్టేన్ భారీ సినిమాల నుంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ వరకు కొన్ని మోస్ట్ అవైటింగ్ సిరీస్‌లు రాబోతున్నాయి. వీటిలో సూపర్‌స్టార్‌లు నటించిన యాక్షన్ షోలు, ఎపిక్ క్లైమాక్స్‌లతో కూడిన సూపర్‌ నేచురల్ థ్రిల్లర్‌లు, రియల్ ఇన్సిడెంట్స్ తో రూపొందిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే కొత్త సిరీస్ లు, సినిమాల పూర్తి జాబితాను చూసేద్దాం పదండి.

కోహ్రా సీజన్ 2

మోస్ట్ అవైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ”కోహ్రా సీజన్ 2′. ఫిబ్రవరి 11న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ హిందీ వెబ్ సిరీస్‌లో బరున్ సోబ్తి గరుండిగా తిరిగి రాబోతున్నారు. అలగే ప్రముఖ నటి మోనా సింగ్ తారాగణంలో చేరడం ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్‌ ను సుదీప్ శర్మ, గుంజిత్ చోప్రా, డిగ్గి సిసోడియా రూపొందించారు. దీనికి ఫైజల్ రెహమాన్ దర్శకత్వం వహించారు. సుదీప్ శర్మ నిర్మించారు. తెలుగు ఆడియో వెర్షన్ కూడా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది.

అమర్ విశ్వాస్

Advertisement

రాజీవ్ ఖండేల్వాల్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ‘అమర్ విశ్వాస్’తో ఓటీటీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సిరీస్ లో రాజీవ్ ఒక ఉన్నత స్థాయి హత్య కేసును స్వీకరించే న్యాయవాదిగా కన్పించబోతున్నాడు. ఇందులో వరుస ట్విస్టులు ఉంటాయి. ‘అమర్ విశ్వాస్’ ఫిబ్రవరి 11 నుండి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ప్రసారం అవుతుంది.

బేబీ గర్ల్

హైటెన్షన్ మలయాళ మెడికల్ థ్రిల్లర్ ‘బేబీ గర్ల్’. క్రిస్మస్ నాడు తిరువనంతపురం ఆసుపత్రి నుండి నవజాత శిశువు అదృశ్యం కథను చెబుతుంది. అరుణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాబీ-సంజయ్ ద్వయం రచయితలుగా వ్యవహరించారు. ఆ రోజు పనికి ఆలస్యంగా రావడం వల్ల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా మారిన ఆసుపత్రి అటెండర్ సనల్ మాథ్యూ (నివిన్ పౌలీ) ప్రపంచం తలకిందులవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అనేది స్టోరీ. ఫిబ్రవరి 12 నుండి ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌ SonyLIVలో ప్రసారం కానుంది.

భానుప్రియ భూటర్ హోటల్

Advertisement

అరిజిత్ ముఖర్జీ రూపొందించిన బెంగాలీ హర్రర్-కామెడీ ‘భానుప్రియ భూటర్ హోటల్’. ఉత్తర బెంగాల్‌ లోని ఫైవ్ స్టార్ రీసార్ట్‌ లో శీతాకాల సెలవుల్లో అనుమానాస్పద న్యాయవాది (సోహమ్ మజుందార్), అతని పార్ట్నర్ (మిమి చక్రవర్తి) మధ్య ఏం జరిగింది ? అన్నది స్టోరీ. యజమాని భానుప్రియ పేరు మీద ఉన్న ఆ రహస్య హోటల్, దుష్ట శక్తులకు నిలయంగా మారుతుంది. వాస్తవానికి ఈ హోటల్‌ను పాత స్మశానవాటిక పైన అక్రమంగా నిర్మించి ఉంటారు. ఈ చిత్రం ఫిబ్రవరి 13 నుండి ZEE5లో అందుబాటులోకి రానుంది.

మాయాబింబం

ఇదొక తమిళ ప్రేమకథ. మెడికల్ విద్యార్థి జీవా (ఆకాష్ నాగరాజన్) చుట్టూ తిరుగుతుంది. నర్సు సుమతి (జానకి శ్రీనివాసన్)తో అనుకోకుండా జరిగిన పరిచయం తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది కథ. కె. జె. సురేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కళాశాల స్నేహితుల తొందరపాటు సలహా, ఆ తరువాత జరిగిన అనర్థాల గురించి ఉంటుంది. జీవితాన్ని మార్చే కోర్టు యుద్ధంతో ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫిబ్రవరి 13 నుండి SunNxtలో స్ట్రీమింగ్ కానుంది.

క్రాస్ సీజన్ 2

క్రాస్ సీజన్ 2 అనేది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్. ఈ థ్రిల్లర్‌లో ఆల్డిస్ హాడ్జ్ అలెక్స్ క్రాస్ పాత్రలో నటించారు, అతను బిలియనీర్లను లక్ష్యంగా చేసుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తూ కొత్త కేసును తీసుకుంటాడు. కొత్త సీజన్‌లో మాథ్యూ లిల్లార్డ్‌తో సహా అదనపు తారాగణం సభ్యులు కూడా ఉన్నారు. ఫిబ్రవరి 11 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

తలైవర్ తంబి తలైమయిల్

నటుడు జీవా నటించిన తమిళ కంట్రీ కామెడీ డ్రామా ‘తలైవర్ తంబి తలైమయిల్’. థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారు, ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు. ఫిబ్రవరి 12న గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రిడేటర్: బాడ్ ల్యాండ్స్

ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా థియేటర్లలో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు జియో హాట్‌స్టార్ ఫిబ్రవరి 12న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 12న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

ది కంజురింగ్: లాస్ట్

‘ది కంజురింగ్’ ఫ్రాంచైజీలో చివరి భాగం గత సంవత్సరం థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 13 నుండి జియో హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.

Also Read : దోపిడీ దొంగలకు షాక్ ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి… ఆకట్టుకుంటున్న యాక్షన్ కామెడి

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×