E-Paper
Advertisement

Feel Good Web series OTT: ఆకట్టుకుంటున్న ముగ్గురు స్నేహితుల మాస్ లవ్ స్టోరీ… చూసే కొద్దీ చూడాలనిపించే కథ

Feel Good Web series OTT: ఆకట్టుకుంటున్న ముగ్గురు స్నేహితుల మాస్ లవ్ స్టోరీ… చూసే కొద్దీ చూడాలనిపించే కథ
Advertisement

Feel Good Web series OTT: ఫ్యామిలీతో కలసి ఒక మంచి వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైనీస్ వెబ్ సిరీస్ పై ఓ లుక్ వేయండి. ఈ సినిమా ఒక ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతుంది. ఆ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో కలిసి పెరిగిన కొందరు స్నేహితుల ప్రయాణమే ఈ సిరీస్. ఇది 90స్ జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది కూడా. ఆ కాలం నాటి వాతావరణం, సైకిళ్ల మీద తిరిగే జనం, ఆ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగే పిల్లల అల్లరి మనకు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఈ చైనా సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో చూడచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ చైనీస్ వెబ్ సిరీస్ పేరు ‘అవర్ డాజ్లింగ్ డేస్’ (Our Dazzling Days). మొత్తం 30 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ 2026 ఫిబ్రవరి 20న iQIYI ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నిమిషాల నిడివి ఉంటుంది. ఇందులో జానీ హువాంగ్, గువాన్ జియావోటాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు హువాంగ్ వీ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో ‘లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్’ ‘వైట్ డీర్ ప్లెయిన్’ వంటి హిట్ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ పాన్ యిజీ రాసిన నవల ఆధారంగా రూపొందింది

స్టోరీ ఏమిటంటే

Advertisement

1990ల కాలంలో చైనాలోని ఒక ఫ్యాక్టరీ కాలనీలో మొదలవుతుంది ఈ కథ. ప్రారంభంలోనే మనకు ఒక మిలిటరీ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో నివసించే మనుషులను చూపిస్తారు. అక్కడ కలిసి పెరిగిన కొందరు చిన్న పిల్లలు అల్లరితో సరదాగా సాగిపోతుంది స్టోరీ. కానీ కాలం గడిచేకొద్దీ పరిస్థితులు మారిపోతాయి. ఆ ఫ్యాక్టరీలు కూడా మూతపడతాయి. దాంతో బతుకుదెరువు కోసం ఆ స్నేహితులంతా విడిపోయి వేర్వేరు నగరాలకు, దేశాలకు వెళ్ళిపోతారు. ఒకరు జపాన్ వెళ్లి పోతే, మరొకరు షాంఘై వంటి నగరాల్లో ఉద్యోగాల కోసం కష్టపడుతూ ఉంటారు.

అయితే ఎన్నాళ్లు బయట తిరిగినా వాళ్లకు తమ సొంత ఊరి మీద ఉన్న మక్కువ తగ్గదు. దాదాపు పదేళ్ల తర్వాత వాళ్లంతా మళ్ళీ తమ పాత ఊరికి తిరిగి వస్తారు. అక్కడ లోకల్ రౌడీల చేతుల్లో ఉన్న ఆ పాత ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి, దాన్ని మళ్ళీ కొత్తగా డెవలప్ చేయడానికి అందరూ కలిసి పోరాడతారు. మరి చివరికి ఆ ఫ్యాక్టరీ మళ్లీ తెరుచుకుంటుందా ? విడిపోయిన స్నేహితులు మళ్ళీ ఎలా కలిశారు ? అనే విషయాలను మాత్రం ఈ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : చీకటి పడితే రెచ్చిపోయే దెయ్యం… ఆ ఊర్లో అడుగు పెడితే చావు మూడినట్టే

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×