E-Paper
Advertisement

Ind vs SA Super 8: డేవిడ్ మిల్ల‌ర్‌, సుంద‌ర్ మ‌ధ్య గొడ‌వ‌..టీమిండియా ముందు కొండంత టార్గెట్‌

Ind vs SA Super 8: డేవిడ్ మిల్ల‌ర్‌, సుంద‌ర్ మ‌ధ్య గొడ‌వ‌..టీమిండియా ముందు కొండంత టార్గెట్‌

Ind vs SA Super 8: టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament)  నేపథ్యంలో దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ సూపర్ 8 మ్యాచ్ ( Super 8 match) జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా, నిర్ణీత 20 ఓవర్లు ఆడేసింది. ఈ తరుణంలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది దక్షిణాఫ్రికా. డేవిడ్ మిల్ల‌ర్‌, స్ట‌బ్స్, బ్రెవిస్ ముగ్గురు క్రికెట‌ర్లు అద‌ర‌గొట్టారు. ఈ త‌రుణంలో టీమిండియా ముందు భారీ ల‌క్ష్యాన్ని పెట్టింది ద‌క్షిణాఫ్రికా. ఇక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 188 ప‌రుగులు సాధిస్తే, టీమిండియా సాధించనుంది. లేక‌పోతే దక్షిణాఫ్రికాదే విజ‌యం.

Also Read: NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

డేవిడ్ మిల్ల‌ర్‌, సుంద‌ర్ మ‌ధ్య గొడ‌వ‌..

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ( India vs South Africa ) మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ 8 మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు కూల్ గా ఉండే ఇద్దరు ప్లేయర్లు గొడవ పెట్టుకున్నారు. వాషింగ్టన్ సుందర్ అలాగే దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఇద్దరు డ్రింక్స్ సమయంలో వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు బండ బూతులు తిట్టుకున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్ ( Washington sunder) బౌలింగ్ చేసే క్రమంలో డేవిడ్ మిల్లర్ ( David Miller) కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అందుకే డ్రింక్స్ సమయంలో వాషింగ్టన్ సుందర్, డేవిడ్ మిల్లర్ ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

టీమిండియా ముందు కొండంత టార్గెట్‌

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లు ఆడింది దక్షిణాఫ్రికా. ఈ సందర్భంగా ఏడు వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా ఏకంగా 187 పరుగులు సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే ఏడు బౌండరీలు ఉన్నాయి. ఆ తర్వాత బ్రెవిస్ 29 బంతుల్లో 45 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఆ తర్వాత వచ్చిన స్ట‌బ్స్‌ 24 బంతుల్లో 44 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఇందులో మూడు సిక్సులు, ఒక బౌండరీ కూడా ఉంది. దీంతో దక్షిణాఫ్రికా 187 పరుగులు సాధించగలిగింది. టీమిండియా బౌల‌ర్ల‌లో బుమ్రా మూడు వికెట్లు తీయగా అర్ష‌దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. అటు వరుణ్ చక్రవర్తి అలాగే శివమ్ దుబేకు తలో వికెట్ పడింది.

Also Read: Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

 

 

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×