E-Paper
Advertisement

ప్రేమించిన అమ్మాయిని చేజేతులా చంపే హీరో… సందీప్ రెడ్డి వంగా మెచ్చిన మూవీ

ప్రేమించిన అమ్మాయిని చేజేతులా చంపే హీరో… సందీప్ రెడ్డి వంగా మెచ్చిన మూవీ
Advertisement

Paruthiveeran Movie: ఓటీటీలో థ్రిల్లర్, యాక్షన్ సినిమాలను చూసి విసిగపోయారా ? ఒక మంచి మనసుకు హత్తుకునే సినిమా కోసం వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్పెషాలిటీ ఏంటంటే… సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్ డైరెక్టర్ మెచ్చిన సినిమా ఇది. ‘పరుత్తివీరన్’ (Paruthiveeran) అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? సినిమా కథ ఏంటి ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మదురైలోని ఒక ఊర్లో కథ మొదలవుతుంది. అక్కడ పరుత్తివీరన్ అనే అబ్బాయి ఉంటాడు. అతనే మన హీరో. మొరటు స్వభావంతో అతను ఊరంతా ఒక్కటి చేస్తాడు. ఎవరికీ లొంగడు, చట్టం గురించి పట్టించుకోడు. జైలుకు వెళ్లడమే తన టార్గెట్ అని చెప్పుకుంటాడు. అతనిని ప్రేమగా పెంచుకున్న మేనమామ చేవ్వాళై మాత్రమే అతని బలం. అతని దగ్గర మాత్రమే పరుత్తివీరన్ తగ్గి ఉంటాడు. ఊరి పెద్దలు, రౌడీలు, కుల వ్యవస్థ… ఇలా ఎవ్వరన్నా అతనికి భయం ఉండదు.

Advertisement

కానీ ఈ మొరటు కుర్రాడి హృదయంలోనే మన హీరోయిన్ ఉంటుంది. అదే ఊరిలో ఉండే అమ్మాయి ముత్తళగు అనే అమ్మాయి మన హీరోయిన్. ఈ పల్లెటూరి అమ్మాయి చిన్నప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉండగా, పరుత్తివీరన్ ఆమెను కాపాడతాడు. అంతే అప్పటి నుంచి ఆమె మనసును పూర్తిగా అతనికే అంకితం చేస్తుంది. ఆమె తండ్రికి మాత్రం పరుత్తివీరన్ అంటే అస్సలు నచ్చడు.

నిజానికి పరుత్తివీరన్ మొదట్లో ముత్తళగు ప్రేమను పట్టించుకోడు. ఆమె పట్ల కఠినంగా, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు. కానీ ఆమె చూపించే నిజాయితీ, పిచ్చి ప్రేమ, ధైర్యం చూసి అతని గుండె కరిగిపోతుంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ ముత్తళగు తండ్రి వీళ్ళ ప్రేమను ఒప్పుకోడు. తక్కువ కులం అంటూ హీరోను పక్కన పెట్టి, ఆమెకు వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి నిశ్చయిస్తాడు.

Advertisement

పరిస్థితి చేయి దాటడంతో ముత్తళగు ఊరు వదిలి పారిపోదామని పరుత్తివీరన్‌ను ఒప్పిస్తుంది. ఇద్దరూ కలిసి ఓరోజు రాత్రి ఊర్లో నుంచి జంప్ అవుతారు. కానీ ముత్తళగు తండ్రి మనుషులు వారిని వెంబడిస్తారు. ఈ పారిపోతున్న క్రమంలో పరుత్తివీరన్ కొద్దిసేపు ముత్తళగును ఒంటరిగా వదిలి వెళ్తాడు. మరి ఆ తరువాత ఏమైంది ? పరుత్తివీరన్ కు షాక్ ఇచ్చిన ఆ సీన్ ఏంటి ? హార్ట్ బ్రేకింగ్ క్లైమాక్స్ ఏమై ఉంటుంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

‘పరుత్తివీరన్’ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లేదు. ఇది తమిళ సినిమా కాబట్టి తమిళ్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ మరిచిపోలేరు ఈ సినిమాను. ప్రియమణి ముత్తళగు పాత్రలో జీవించింది. అందుకే ఆమెను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. 2007లో విడుదలైన ఈ తమిళ చిత్రం ఇప్పటికీ క్లాసిక్‌గా నిలిచిపోయింది. కార్తీని హీరోగా పరిచయం చేసిన ఈ సినిమాకు అమీర్ దర్శకత్వం వహించారు.

Read : సూర్యరశ్మి పడితే వీళ్ళకి చావే… శృతి హాసన్ ఫేవరెట్ హర్రర్ మూవీ

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×