E-Paper
Advertisement

సూర్యరశ్మి పడితే వీళ్ళకి చావే… శృతి హాసన్ ఫేవరెట్ హర్రర్ మూవీ

సూర్యరశ్మి పడితే వీళ్ళకి చావే… శృతి హాసన్ ఫేవరెట్ హర్రర్ మూవీ
Advertisement

Supernatural horror movie: టాలీవుడ్ హీరోయిన్లలో శృతి హాసన్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి స్టార్ హీరోయిన్ కు ఎలాంటి సినిమా అంటే ఇష్టం అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా తనకు ఇష్టమని చెప్పిన మూవీ ‘ది అదర్స్’ (The Others). హాలీవుడ్ హారర్ సినిమాల చరిత్రలో రక్తపాతం అన్నదే లేకుండా, సస్పెన్స్, భయంకరమైన ట్విస్ట్‌ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ఇది. చాలా కాలం క్రితమే విడుదలైన ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1945లో నడుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. గ్రేస్ స్టెవార్ట్ కు ఇద్దరు చిన్న పిల్లలు ఆన్, నికోలస్‌ ఉంటారు. ఈ ఫ్యామిలీ ఇంగ్లాండ్‌ లోని ఒక పాత కోట లాంటి భవనంలో నివసిస్తుంది. ఆమె భర్త యుద్ధానికి వెళ్లి తిరిగిరాడు. ఆ పిల్లలిద్దరికీ ‘ఫొటోసెన్సిటివిటీ’ అనే అరుదైన వ్యాధి ఉంటుంది. సూర్యరశ్మి వాళ్ళ చర్మంపై పడితే ప్రాణాలు పోతాయి. అందుకే ఆ ఇల్లు ఎప్పుడూ చీకటిగా, కిటికీలు భారీ తెరలతో మూసేసి ఉంటాయి.

Advertisement

అందుకే గ్రేస్ ఇంట్లో కఠినమైన రూల్స్ పెడుతుంది. ఒక గది నుండి మరొక గదికి వెళ్లేటప్పుడు ముందు తలుపు లాక్ చేసి, తర్వాత మరో తలుపు తీయాలి అన్నది మెయిన్ రూల్. ఈ నియమాలు పిల్లలను రక్షిస్తాయి అని ఆమె నమ్ముతుంది. ఒకరోజు ఇంటి పాత పని మనుషులు అకస్మాత్తుగా మాయమవుతారు. ముగ్గురు కొత్త పని మనుషులు వస్తారు. మిల్స్ అనే వృద్ధురాలు, చార్లెస్ అనే తోటమాలి, లిడియా అనే మూగ అమ్మాయి ఆ పని మనుషులు. వారు అడుగు పెట్టిన క్షణం నుంచి ఇంట్లో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

పియానో దానంతట అదే మోగుతుంది. పై అంతస్తులో ఎవరో నడుస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు శబ్దాలు వస్తాయి. లాక్ చేసిన తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. గ్రేస్ కూతురు ఆన్ తనకు ఇంట్లో ‘విక్టర్’ అనే చిన్న అబ్బాయి, అతని తల్లిదండ్రులు కనిపిస్తున్నారని చెబుతుంది. మొదట్లో గ్రేస్ ఇదంతా పిల్లల ఊహ అని కొట్టి పారేస్తుంది. కానీ రోజురోజుకూ అలాంటి శబ్దాలు పెరగడంతో, ఇంట్లో తాము కాకుండా ఎవరో ‘అదర్స్’ ఉన్నారని ఆమె నమ్ముతూ ఉంటుంది.

Advertisement

గ్రేస్ ఆ దెయ్యాలను వెళ్లగొట్టడానికి చర్చి ఫాదర్‌ను పిలవాలని అనుకుంటుంది. కానీ దారిలో అనూహ్యంగా యుద్ధం నుండి తిరిగి వస్తున్న తన భర్తను చూస్తుంది. ఆనందంతో అతన్ని ఇంటికి తీసుకొస్తుంది. కానీ భర్త యుద్ధంలో చూసిన సీన్స్ వల్ల తీవ్ర డిప్రెషన్‌లో ఉంటాడు. కొద్ది రోజులకే అతను మళ్లీ మిస్ అవుతాడు. అలాంటి టైమ్ లోనే ఒకరోజు ఇంట్లోని అన్ని కిటికీ స్క్రీన్లు మాయమవుతాయి. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ? అసలు ఇంటి దగ్గర ఉన్న సమాధులు ఎవరివి ? ఆ కొత్త పని మనుషులు ఎవరు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

సినిమా చివరి ట్విస్ట్ ఉంటుంది భయ్యా…. ఒక్కసారి చూస్తే మళ్లీ మర్చిపోలేరు. 2001లో విడుదలైన ఈ సినిమా Plexలో ఉచితంగా అందుబాటులో ఉంది. నికోల్ కిడ్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ చిత్రం చూస్తే ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే వణికిపోతారు. ఈ సినిమా ప్రస్తుతం తెలుగు ఆడియోతో లేదు. ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

Tags

Related News

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

Big Stories

Advertisement
×