BigTV English
Advertisement

OTT Movie : అమ్మాయిలను చంపి ఆ పార్ట్స్ కట్ చేసే సైకో … ముగ్గుర్ని కలిపి ఒకే మనిషిగా … ఏందయ్యా సామి ఈ అరాచకం

OTT Movie : అమ్మాయిలను చంపి ఆ పార్ట్స్ కట్ చేసే సైకో … ముగ్గుర్ని కలిపి ఒకే మనిషిగా … ఏందయ్యా సామి ఈ అరాచకం

OTT Movie : సైకో సినిమాలు ఎన్నో రకాలుగా థియేటర్లలోకి వచ్చి భయపెట్టాయి. ఈ సినిమాలలో చూపించే హింస, నరకంలో కూడా చేయరేమో అన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో,  ముగ్గురు అమ్మాయిలను కత్తిరించి ఒకే మనిషిగా తయారుచేస్తారు కొంతమంది సైకోలు. ఆ తర్వాత ఆ బాడీ ఎదుర్కొనే సమస్యలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇది ఒక కామెడీ రివెంజ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


ప్లెక్స్ (Plex) లో

ఈ అమెరికన్ హారర్ కామెడీ మూవీ పేరు ‘ప్యాచ్‌వర్క్’ (Patch Work). 2015 లో వచ్చిన ఈ మూవీకి టైలర్ మాక్‌ఇంటైర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ముగ్గురు యువతుల చుట్టూ తిరుగుతుంది. వారు ఒక రాత్రి పార్టీ లో పాల్గొన్న తరువాత, ఒక వింత పరిస్థితిని ఎదుర్కుంటారు. ఇందులో రక్తపాతం సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఒంటరిగా ఈ మూవీని చూడటం మంచిది. ఈ హారర్ కామెడీ మూవీ ప్లెక్స్ (Plex) ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జెన్నిఫర్, ఎల్లీ, మడలీన్ అనే ముగ్గురు విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన యువతులు, ఒకే బార్‌లో ఒక రాత్రి గడుపుతారు. కానీ వారు మేల్కొనే సరికి, వారి శరీరాలు కత్తిరించబడి, ఒకే శరీరంగా కుట్టివేయబడి ఉంటాయి. దీనిని ఒక్కో శరీరం నుంచి కొన్ని బాగాలు తీసుకుని, ఒకే రూపం గా తయ్యారు చేస్తారు కొంతమంది సైకోలు. ఆ శరీరంలో ముగ్గురి వ్యక్తిత్వాలు ఉంటాయి. వారు ఈ కొత్త శరీరాన్ని నియంత్రించడానికి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ బాడి ఆ సైకోలనుంచి తప్పించుకుని, బయటకు వెళ్ళిపోతుంది. వారు తమకు ఈ దారుణం ఎవరు చేశారో తెలుసుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక రక్తపాత యాత్రను మొదలు పెడతారు. ఈ క్రమంలో వారు తమ గత జీవితాలను, బలాలను, బలహీనతలను గుర్తుకు తెచ్చుకుంటారు.

ఈ కథలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఇది వారి ప్రతీకారానికి మరింత ఆజ్యం పోస్తుంది. గారెట్ అనే ఒక వైద్య విద్యార్థి వారికి సహాయం చేస్తాడు. చివరికి ఈ ముగ్గురూ కలసి, ఆ సైకో లపై రివేంజ్ తీర్చుకుంటారా ? తమ బాడిని ఎలా కంట్రోల్ చేస్తారు ? తిరిగి మళ్ళీ వీళ్ళు మునుపటిలా మారుతారా ? ఆ సైకోలు ఎందుకు అలా చేస్తున్నారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ హారర్ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ 1 గంట 26 నిమిషాల నిడివి కలిగి ఉంది. దాని రక్తపాత దృశ్యాల కారణంగా R-రేటింగ్ పొందింది. ఇది స్క్రీమ్‌ఫెస్ట్, టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లలో అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. మొత్తంగా ‘ప్యాచ్‌వర్క్’ అనేది ఒక వినోదాత్మక, రక్తపాత, హారర్ కామెడీ గా తెరకెక్కింది.

Read Also : యాజమానికే పంగనామాలు … గోల్డ్ స్మగ్లింగ్ లో అదిరిపోయే ట్విస్ట్లు … ఊహించని క్లైమాక్స్ తో మలయాళం యాక్షన్ థ్రిల్లర్

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×