UP Crime News: మా కాపురంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. రోజురోజుకూ వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. అమ్మనాన్న నన్ను క్షమించండి. తాను పోయిన తర్వాత న్యాయం జరగపోతే.. బూడిదను కాలువలో కలపాలని మొరపెట్టుకున్నాడు కన్న కొడుకు. చివరకు హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలో ఓ ఇంజనీర్ ఆత్మహత్య వెనుక అసలు కథ. ఇంకా ఏం జరిగింది అనే డీటేల్స్ లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
అసలేం జరిగింది?
సరైన అల్లుడు దొరకలేదని కొందరు బాధపడతారు. ఒకవేళ అల్లుడు దొరికినా తాగుబోతు అనేవారు కొందరు. మంచి అల్లుడు లభిస్తే ఇలాంటి టార్చర్. తాజాగా యూపీలోని ఎటావాలో 33 ఏళ్ల ఫీల్డ్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్య వెనుక కారణాలు అన్నీ ఇన్నీకావు.
ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన మోహిత్ యాదవ్, ఓ సిమెంట్ కంపెనీలో ఫీల్డ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఏడేళ్లగా ప్రియ అనే యువతిని ప్రేమించాడు. కొడుకు ఇష్టపడ్డాడని తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు. చివరకు రెండేళ్ల కింద వివాహం జరిగింది. భార్య ప్రియ రెండు నెలల కిందట ఓ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది.
ప్రేమించి, ఆపై పెళ్లి
మొదట్లో మోహిత్-ప్రియ దంపతుల మధ్య కాపురం బాగానే సాగింది. మోహిత్‌కు ఆస్తులు బాగానే ఉన్నాయి. సజావుగా సాగుతున్న వీరి కాపురంలోని ప్రియ తల్లి ఎంటరైంది. దాని తర్వాత ఒకొక్కరుగా కూతురు జీవితంలోకి దిగారు. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంలేక మరేంటో తెలీదు. ఏడాది కిందట ప్రియ గర్భవతి అయ్యింది. కూతురికి అబార్షన్ చేయించింది అత్త.
ALSO READ: మాజీ డీజీపీని దారుణంగా చంపిన భార్య, ఆ తర్వాత వీడియో కాల్ చేసి
ఆ తర్వాత కష్టపడి కూడబెట్టిన బంగారాన్ని తీసుకెళ్లడం మొదలుపెట్టింది. కనీసం ప్రియ కూడా ఆలోచన చేయలేదు. తల్లిదండ్రులు ఏం చెబితే అదే చేయడం మొదలుపెట్టింది. కష్టపడి ఇల్లు సంపాదించుకున్నాడు మెహిత్ యాదవ్. అది కూడా తన పేరున రాయించాలని నిత్యం వేధింపులకు గురయ్యేది. ప్రియ, ఆమె తల్లి ఇంటికి వచ్చిన నుంచి ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉండేవి.
మరింత టార్చర్
సింపుల్ గా చెప్పాలంటే పెళ్లయి రెండేళ్ల కంటే, లవ్ ట్రాక్ సమయంలో హ్యాపీగా ఉండేవాడు మోహిత్. రోజురోజుకూ ఓ వైపు భార్య, మరోవైపు అత్త, ఇంకోవైపు బావమరిది టార్చర్ పెరిగిపోయింది. ఒకానొక దశలో మోహిత్ పేరెంట్స్‌పై వరకట్నం కింద కేసు పెట్టింది భార్య. బావమరిది వీలు కుదిరినప్పుడల్లా చంపుతానని పదే పదే బెదిరించేవాడు.
భార్య ఇంట్లో పెట్టిన గొడవకు ఆమెకు పేరెంట్స్ సపోర్టు చేయడం మొదలైంది. లవ్ మ్యారేజ్ అంటే ఇలా ఉంటుందా? అని ఆలస్యంగా తెలుసుకున్నాడు మోహిత్. ఈ టార్చర్ తట్టుకోలేక చివరకు తనకు జరిగిన అన్యాయం గురించి పై మేటర్ అంతా వీడియోలో పూసగుచ్చి వివరించాడు. చివరకు నొయిడాలోని ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అత్తింటి వైపు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.
వీడియోలో అసలు గుట్టు
ఈ వీడియోలో తల్లిదండ్రుల గురించి వివరించాడు. పెళ్లయిన మొదట్లో ఆరునెలలు కాపురం సజావుగా సాగింది. అక్కడి నుంచి కలతలు మొదలయ్యాయి. అమ్మ..నాన్నా నన్ను క్షమించండి. తాను పోయిన తర్వాత న్యాయం జరగపోతే అస్తికలను కాలువలో కలపాలంటూ కన్నీరు పెట్టుకుని వీడియో ముగించాడు.
మోహిత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.