OTT Movie : మలయాళం సినిమాలకు మన ప్రేక్షకులు బాగా దగ్గర అయిపోయారు. రీసెంట్ గా వస్తున్న ఈ సినిమాలను మిస్ కాకుండా చూస్తున్నారు. స్టోరీని సుత్తి లేకుండా తెరకెక్కించే విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలో తన నటనతో మెప్పించాడు. ఇందులో స్టోరీ గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. చివరి వరకు ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే …
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కసరగోల్డ్’ (Kasargold). 2023 లో విడుదలైన ఈ మూవీకి మృదుల్ నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అసిఫ్ అలీ, సన్నీ వేన్, వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్, నిరంజ్ సురేష్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ను జెబిన్ జాకబ్, మనోజ్ కన్నోత్ హ్యాండిల్ చేశారు. ఈ కథ ఉత్తర కేరళలోని గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఆల్బీ అనే యువకుడు తన స్నేహితురాలు నాన్సీ తో కలిసి, జ్యువెలరీ యజమాని మూసా హాజీ కోసం కణ్ణూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాడు. కానీ వారు గోల్డ్‌ను కాసరగోడ్‌కు తీసుకెళ్తుండగా, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. దీనిలో ఫైసల్ అనే వ్యక్తితో వారికి గొడవ జరుగుతుంది. నాన్సీ ఈ గొడవను ఆపిన తర్వాత, వారు గోల్డ్‌ను డెలివరీ చేయడానికి బయలుదేరతారు. ఆ తరువాత ఆల్బీ, నాన్సీకి గోల్డ్ మిస్సింగ్ అయినట్లు తెలుస్తుంది. ఆల్బీ ఈ విషయాన్ని మూసాకు తెలియజేస్తాడు. మూసా తన మనుషులతో ఆల్బీని ఫైసల్‌ను వెతకడానికి పంపిస్తాడు. ఫైసల్ ఆ గోల్డ్‌ను తన సహచరులతో కలిసి దొంగిలించి, దానిని సుల్లియాలో విక్రయించాలని ప్లాన్ చేస్తాడు. అయితే బస్సులు అందుబాటులో లేకపోవడంతో, అతను కాసరగోడ్‌లో ఒక లాడ్జ్‌లో ఉంటాడు. అక్కడ ఆల్బీ ,ఫైసల్ కలుస్తాడు. ఈ గోల్డ్ దొంగతనం వెనుక ఆల్బీ స్వయంగా ఉన్నాడని తెలుస్తుంది. ఇది పక్కా ప్లాన్‌లో భాగంగా జరుగుతుంది.
మూసా ఈ దొంగతనం గురించి తెలుసుకుని సీఐ అలెక్స్ ను ఆల్బీ, ఫైసల్‌ను పట్టుకోవడానికి పంపిస్తాడు. ఆల్బీ, ఫైసల్ గోల్డ్‌ను కాసరగోడ్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తారు. కానీ పట్టుబడే ప్రమాదం నుండి తప్పించుకుని గోవాకు పారిపోతారు. అక్కడ వారు విష్ణు అనే వ్యక్తితో పాటు అతని స్నేహితులతో కలుస్తారు. ఆల్బీ తనను తాను జేమ్స్‌గా, ఫైసల్‌ను మునీర్‌గా పరిచయం చేసుకుంటాడు. వారు విష్ణు తండ్రికి గోల్డ్ విక్రయించే ప్రయత్నం చేస్తారు. కానీ విష్ణు ఆ ఆలోచనను తిరస్కరిస్తాడు. అలెక్స్ వారిని గోవాలో ట్రాక్ చేసి, వారి రూమ్‌లోకి చొరబడి దాడి చేస్తాడు కానీ వారు తప్పించుకుంటారు. తర్వాత వారు ఒక హోటల్‌లో కొంతమంది గుండాలతో గొడవ పడతారు. ఈ గొడవలో విష్ణు స్నేహితుడు విజయన్ గాయపడతాడు. ఈ సమయంలో సినిమా అనేక ట్విస్ట్‌లు, టర్న్‌లతో ముగుస్తుంది. చివరికి వీళ్ళంతా పోలీసులకు చిక్కుతారా ? బంగారాన్ని అమ్మి లైఫ్లో సెట్టిల్ అవుతారా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిలను బ్రూటల్ గా చంపే సైకోగాడు … వీడు చంపే తీరుకు వణుకు పుట్టాల్సిందే