Brahmamudi serial today Episode: అపర్ణ పేరు చెప్పి చాలా సంతోషిస్తున్నాడు ఎవరీ అపర్ణ అని యామినిని అడుగుతుంది వైదేహి. ఆమె బావ కన్నతల్లి అని చెప్తుంది యామిని దీంతో వైదేహి వాళ్లు షాక్ అవుతారు. ఈరోజు ఆవిడ పుట్టినరోజు అని చెప్తుంది. రాజ్ గతం మర్చిపోయాడు కదా ఆవిడ పుట్టినరోజు ఎలా గుర్తు పెట్టుకున్నాడని అడుగుతుంది. దీంతో యామిని గుర్తు పెట్టుకోలేదు. బావ చెప్పినట్టుగా కో ఇన్సిడెంటల్‌గా గుడిలో కలిశారు. అని చెప్తుంది. దీంతో వైదేహి అంటే నిజంగానే రామ్ వాళ్లను గుర్తు పట్టలేదా..? అని అడుగుతుంది. గుర్తు పట్టలేదు కానీ నేను వాళ్లను ఎంత దూరం పెడదామని ట్రై చేసినా వాళ్లు దగ్గరవుతూనే ఉన్నారు అంటుంది యామిని.
దీంతో వాళ్ల డాడీ.. ఒకరు దూరం చేస్తే దూరం అవ్వడానికి అది తెలిసి తెలియని వయసులో పుట్టే ప్రేమ కాదమ్మా…? తొమ్మిది నెలలు కడుపులో మోసిన కన్నప్రేమ, ఆ తల్లి పేగు తెంచుకుని పుట్టిన ప్రేమ, పాతికేళ్లు ఆ తల్లి తన కొడుక్కి ప్రతి రోజు పెంచిన ప్రేమ. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి దూరం చేస్తే దూరం అయిపోతుందా..? తప్పు చేస్తున్నావు యామిని. తన ఫ్యామిలీకి తనను దూరం చేస్తూ.. తప్పు చేస్తున్నావు. అని చెప్పగానే.. తన ఫ్యామిలీని తనకు దూరం చేయడం నాకు మాత్రం ఇష్టమా డాడీ అంటూ యామిని ప్రశ్నిస్తుంది. బావను నేను పెళ్లి చేసుకుంటే ఆ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ అవుతుంది కదా..? అప్పుడు నేను ఉండాల్సింది ఆ ఫ్యామిలీతోనే కదా అంటుంది. దీంతో వాళ్ల డాడీ మరి కావ్య పరిస్థితి ఏం చేస్తావు అని అడుగుతాడు. దీంతో నాకు కావాల్సింది నా బావ. నా జీవితం తనతోనే నేను ఇంకెవరి గురించి పట్టించుకోను అంటూ కోపంగా చెప్తుంది.
ఇంట్లో అందరూ ఆలోచిస్తుంటే.. అపర్ణ, కావ్య గుడి నుంచి వస్తారు. అపర్ణ హ్యాపీగా అందరినీ ప్రసాదం పంచుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అది దేవుడి ప్రసాద్ తినండి అని చెప్తుంది. ఇంతలో ఇందిరాదేవి అన్నదానం ఎలా జరిగింది అపర్ణ అని అడుగుతుంది. దీంతో అపర్ణ చాలా బాగా జరిగింది అత్తయ్య గారు అని చెప్తుంది. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు జరగనంత గొప్పగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అని చెప్తుంటే.. రుద్రాణి చూశారా..? సంతోషంగా ఉందట.. నేను చెప్పింది ఇప్పటికైనా నమ్ముతారా అంటుంది. దీంతో అపర్ణ కోపంగా ఏం నేను సంతోషంగా ఉండకూడదా..? అయినా నువ్వేం చెప్పావు వీళ్లేం నమ్మాలి..? అని అడుగుతుంది. దీంతో రుద్రాణి నిజం చెప్పాను వదిన. ఇన్ని రోజులు కావ్య ఒక్కతే పిచ్చెక్కి ప్రవర్తిస్తుంది అనుకుంటే ఇప్పుడు తనకు నువ్వు కూడా తోడయ్యావు కదా..? ఇంకా ఏం జరగాలి వదిన అంటుంది.
దీంతో అపర్ణ చూడు రుద్రాణి నీలాగే నేను కూడా ఇన్ని రోజులు రాజ్ లేడనే అనుకున్నాను. కావ్య మాటలు నమ్మకుండా తప్పు చేశా.. కానీ ఎప్పుడైతే గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్నానో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. నా రాజ్ తప్పకుండా తిరిగి వస్తాడని నన్ను నమ్మండి నాలో వచ్చిన ఈ మార్పే నా నమ్మకానికి సాక్ష్యం. నిజం అండి మన రాజ్ త్వరలో మన ఇంటికి రాబోతున్నాడు అని చెప్తుంది. దీంతో సుభాష్ ఏంటి అపర్ణ నువ్వు చెప్పేది. అనగానే.. అపర్ణ అవునండి ఆ దేవుడే మన దగ్గరకు రాజ్‌ను పంపిస్తున్నాడు. నేను చెప్తున్నాను కదా..? నన్ను నమ్మండి.. ఇక మనం ఎవ్వరం బాధపడాల్సిన అవసరం లేదు అంటూ అపర్ణ హ్యాపీగా లోపలికి వెళ్లిపోతుంది. సుభాష్ ఆశ్చర్యంగా ఏంటమ్మా మీ అత్తయ్య చెప్పేది నిజమా..? రాజ్ తిరిగి వస్తాడని అంత నమ్మకంగా చెప్తుంది అని అడగ్గానే.. కావ్య నేను ముందు నుంచి చెప్తున్న మాటే ఇప్పుడు చెప్తున్నాను మామయ్య. ఆయన బతికే ఉన్నారు. కానీ ఈ ఇంటికి ఎందుకు రాలేదు అన్న ప్రశ్నకు ఆయన తిరిగొచ్చిన రోజే సమాధానం దొరుకుతుంది అని చెప్పి వెళ్లిపోతుంది. రుద్రాణి కోపంగా ఏంటి కావ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరూ మాట్లాడరేంటి..? గట్టిగా నిలదీయరేంటి..? అంటుంది. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు.
మరోవైపు రాజ్, కావ్య ఆలోచిస్తుంటాడు. మా ఇద్దరి మధ్య గతంలో ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. అని ఆలోచిస్తుంటాడు. ఆవిడ చెప్పకపోయినా నేనే తెలుసుకుంటాను అనుకుంటూ ఆలోచిస్తుంటాడు. ఇంతలో కావ్య పంపిచిన కొరియర్ చూస్తూ ఏదైనా క్లూ దొరుకుతుందని కవర్ తీసుకుని ఫ్రమ్ అడ్రస్ చూస్తాడు. అడ్రస్ లేదని కొరియర్ ఆఫీసుకు ఫోన్ చేసి కనుక్కుంటే ఎవరో పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి పంపించారు అని చెప్పగానే.. కళావతికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఏదో సంబంధం ఉంది అంటూ ఆలోచిస్తుంటాడు.
రూంలోకి వెళ్లిన అపర్ణ రాజ్ ఫోటో చూసుకుంటూ ఏడుస్తుంది. ఇంతలో కావ్య వచ్చి ఆకలేస్తుంది భోజనం చేద్దాం రండి అత్తయ్యా అని పిలుస్తుంది. దీంతో అపర్ణ ఆకలి సంగతి అటు ఉంచు అసలు రాజ్‌ను ఎలా తీసుకొస్తున్నావో అది చెప్పు అని అడుగుతుంది. దీంతో కావ్య నారు పోసిన దేవుడు నీరు పోయడా అంటుంది. అది కాదే ఆ యామిని ఏమో పెళ్లంటూ నా కాళ్లకు దండం పెట్టి నన్నే ఆశీర్వదించమంటుంటే.. నువ్వేమీ పట్టనట్టు ఇలా ఎలా ఉంటున్నావు అని అడుగుతుంది అపర్ణ. దీంతో కావ్య అత్తయ్య మనది అనుకున్నది ఎప్పటికైనా మనల్ని చేరుతుంది. అది నేను గట్టిగా నమ్ముతాను అని చెప్తుంది. అయితే ఈలోపే యామిని ఏమైనా చేస్తుందేమోనే అంటుంది అపర్ణ. అంత అవకాశం ఆయన ఇవ్వరు. ఆ నమ్మకం నాకుంది అని చెప్తుంది కావ్య. దీంతో నా కొడుకుకి నువ్వు భార్యగా దొరకడం వాడి అదృష్టం అంటుంది అపర్ణ. దీంతో అంతకన్నా ముందు ఆకలేస్తుంది భోజనం చేద్దాం పద అత్తయ్యా అనగానే ఇద్దరూ కలిసి భోజనం దగ్గరకు వెళ్తారు. భోజనం చేయబోతుంటే రుద్రాణి వచ్చి రెండు నిమిషాలు ఆగండి అని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?