E-Paper
Advertisement

డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైన ఉస్తాద్.. వచ్చేది ఎప్పుడంటే?

డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైన ఉస్తాద్.. వచ్చేది ఎప్పుడంటే?
Advertisement

Ustaad Bhagat Singh:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు రాజకీయంగా.. మరొకవైపు సినిమా జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కెరియర్లో ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అటు కుటుంబం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడానికి హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. మళ్లీ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఉస్తాద్..

వాస్తవానికి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మ్యాజిక్ ను ఉస్తాద్ రిపీట్ చేస్తుందని అభిమానులు కూడా ఆశాభవం వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా సమయంలో అటు బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న ధురంధర్ సినిమా సీక్వెల్ ధురంధర్2: ది రివేంజ్ విడుదల అయ్యి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా కారణంగానే ఉస్తాద్ సినిమాపై పెద్దగా ప్రేక్షకులు ఆసక్తి కనబరచలేకపోయారు. ఇక దీంతో నిర్మాతకు నష్టం వాటిల్లింది అనే వార్తలు కూడా ఒక వైపు సినీ వర్గాలలో వినిపిస్తున్నాయి.

అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడే..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఏప్రిల్ 17 లేదా 24వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై నెట్ ఫ్లిక్స్ నుంచీ అధికారిక ప్రకటన వెలువడనుంది. థియేటర్లలో పెద్దగా కలెక్షన్లను రాబట్ట లేకపోయిన ఈ సినిమా అటు ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

also read:బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

100 కోట్లు కష్టమేనా?

Advertisement

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ లీల, రాశిఖన్నా హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు మార్చి 19వ తేదీన ఈ సినిమా వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మొదటి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రానికి 122.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.123 కోట్ల షేర్ ను రాబటాల్సి ఉంటుంది. ఈ సినిమా కేవలం 53.73 కోట్లు మాత్రమే రాబట్టి గ్రాస్ పరంగా రూ.91.5 కోట్లు కొల్లగొట్టింది . మరో 69. 27 కోట్ల షేర్ ఇంకా రాబట్టాల్సి ఉంటుంది. ఇక 10 రోజులైనా వంద కోట్లు కష్టంగా మారిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి ఆ కలెక్షన్స్ రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×