E-Paper
Advertisement

Periodic Action Movie : బందిపోటు రాణిగా మారే గృహిణి… తెల్ల దొరలకు చుక్కలు… క్రేజీ బెంగాలీ మూవీ

Periodic Action Movie : బందిపోటు రాణిగా మారే గృహిణి… తెల్ల దొరలకు చుక్కలు… క్రేజీ బెంగాలీ మూవీ
Advertisement

Periodic Action Movie : బాహుబలి, పద్మావత్ లాంటి ఎపిక్ హిస్టారికల్స్ ని ఒక బెంగాలీ మూవీ గుర్తుచేస్తోంది. ఇది బ్రిటిష్ రూల్ సమయంలో భారతదేశంలో మొదటి మహిళా ఫ్రీడమ్ ఫైటర్‌గా పేరుపొందిన బందిట్ క్వీన్ గురించిన కథ. చాలా మంది దీన్ని బెంగాలీ సినిమాలో అతిపెద్ద స్కేల్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా చెబుతున్నారు. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

‘దేవి చౌధురాని’ (Devi Chowdhurani) సుభ్రాజిత్ మిత్రా దర్శకత్వం వహించిన బెంగాలీ పిరియాడిక్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. భారతదేశానికి జాతీయగేయం అందించిన బంకిమ్ చంద్ర ఛటర్జీ నవల ‘దేవి చౌదరిణి’ ఆధారంగా, ఈ చిత్రాన్ని అనిరుధ్ దాస్‌గుప్తా, అపర్ణ దాస్‌గుప్తా ఎడిటెడ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. స్టన్నింగ్ విజువల్స్ , అద్భుతమైన సినిమాటోగ్రఫీ, పవర్‌ఫుల్ యాక్షన్ తో ఈ సినిమా కేక పెట్టిస్తోంది. హిస్టారికల్ ఎపిక్ లవర్స్‌కి ఇది మస్త్ వాచ్ వాచ్ మూవీ. 2025 సెప్టెంబర్ 26న దుర్గా పూజా స్పెషల్‌గా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. డిసెంబర్ 12 నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్‌లో ఉంది.

Advertisement

Read Also :  మల్టీవర్స్ ప్రపంచంలో విలన్ తుక్కురేగ్గొట్టే కామన్ వుమెన్… ఇది కదా కావాల్సింది

స్టోరీ ఏమిటంటే 

ఈ కథ ప్రఫుల్ల అనే గ్రామీణ యువతి చుట్టూ తిరుగుతుంది. దురదృష్టవశాత్తు, పెళ్లయిన వెంటనే ఆమె అత్తవారింటి నుండి బయటకి రావాల్సి వస్తుంది. సమాజం, కుటుంబం ఆమెను ఒంటరిని చేయడంతో, ఆమె అడవుల పాలవుతుంది. అడవిలో ఆమెకు భవానీ పాఠక్ (ప్రసేన్‌జిత్ ఛటర్జీ) అనే సన్యాసి పరిచయమవుతారు. ఆయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతుంటారు. భవానీ పాఠక్ ప్రఫుల్లకు యుద్ధ విద్యలు, వ్యూహాలు నేర్పిస్తాడు. అలా ఒక మామూలు మహిళ ‘దేవి చౌధురాణి’ అనే శక్తివంతమైన బందిపోటు రాణిగా మారుతుంది. ఇక దేవి చౌధురాణి తన సైన్యంతో కలిసి బ్రిటిష్ వారిని ఎదిరిస్తుంది. సంపన్నులను దోచుకుని, ఆ సంపదను పేదలకు పంచుతూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందుతుంది. ఆమెను ఎందుకు కుటుంబ సభ్యులు బహిష్కరించారు ? బందిపోటు రాణిగా ఎలా మారింది ? బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడింది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తలుసుకోండి. ఇక ఈ సినిమాని ఎవరయినా చూడకపోతే ఓ లుక్ వేయండి. ఒక మంచి మూవీ చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×