E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాజును ఫాలో అయిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today January 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాజును ఫాలో అయిన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

 ఆశ్రమంలో పిల్లలకు భోజనం పెడుతుంటుంది మిస్సమ్మ. పిల్లలు అందరూ కడుపునిండా తినాలి.  అన్నం మిగల్చకుండా మొత్తం తినాలి  వేస్ట్ చేయోద్దు అని చెప్తుంది మిస్సమ్మ. పిల్లుల సరే మేడం అంటూ ఒక్కోక్కరుగా వెళ్లి భోజనం పెట్టించుకుంటారు. ఇంతలో ఒక పాప మేడం బుజ్జమ్మ ఇంకా రాలేదేంటి మేడం ఎప్పుడొస్తుంది మేడం అని అడగ్గానే.. తను వాళ్ల ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లింది కాసేపట్లో వస్తుంది. మీరు తృప్తిగా భోజనం చేయసేయండి అని మిస్సమ్మ చెప్పగానే.. పిల్లలు అందరూ అలాగే మేడం అని చెప్తారు. మరోవైపు అమర్‌ ఇంట్లో కూడా అందరూ భోజనం చేస్తుంటారు. అంజు, బుజ్జమ్మ మా యాదమ్మ చేసే వంటలు ఆంత బాగోవు ఏమీ అనుకోకు మీ టీచర్‌ చేసిన వంట టేస్టీగా ఉంది. అచ్చం మా మిస్సమ్మ చేసిన వంటలాగా ఉంది. అని చెప్పగానే.. మనోహరి, చంభా షాక్‌ అవుతారు.

మరోవైపు మిస్సమ్మ పిల్లలకు అన్నం వడ్డిస్తుంటే.. రాజు.. బుజ్జమ్మ ఇంకా రాలేదేంటని కంగారుగా ఎదురుచూస్తుంటాడు. చీకటి పడింది బుజ్జమేమో ఇంకా రాలేదు. ఇప్పుడు భాగీ గారు అడిగితే ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటుంటాడు. ఇంతలో మిస్సమ్మ రాజు దగ్గరకు వెళ్లి బాబాయ్‌ బుజ్జమ్మ ఇంకా రాలేదు ఏంటి..? అని అడగ్గానే.. రాజు.. వచ్చేస్తుందమ్మా ఇందాకే ఫోన్‌ చేశాను కాసేపట్లో బయలుదేరుతుంది అన్నారు అని చెప్పగానే.. ఏంటి బాబాయ్‌ ఇది సాయంత్రమే వచ్చేస్తుంది అన్నారు. చీకటి పడిపోయింది ఇంకా రాలేదు. అసలు తను ఎవరి ఇంటికి వెళ్లింది అని మిస్సమ్మ అడగ్గానే.. వాళ్ల ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లింది అని చెప్పాను కదమ్మా..? అదే తన క్లాస్‌మేట్ అని చెప్పగానే.. మిస్సమ్మ ఇరిటేటింగ్‌గా అదే ఎవరా ఫ్రెండ్‌ ఒకసారి వాళ్లకు ఫోన్‌ చేయండి అని చెప్పగానే.. రాజు నేను ఇందాకే చేశానమ్మా అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ మళ్లీ చేయండి బాబాయ్‌ నేను మాట్లాడతాను అని అడుగుతుంది. దీంతో రాజు ఎందుకమ్మా నేను మాట్లాడాను కదా..? అని చెప్పగానే.. ఫ్లీజ్‌ బాబాయ్‌ నేను ఈ టెన్షన్‌ పడలేను ఫోన్‌ చేస్తారా..? లేదా..? అని మిస్సమ్మ చెప్పగానే..

Advertisement

రాజు అలాగేనమ్మా అని ఫోన్‌ తీసుకుని  అంజు  వాళ్లకు ఫోన్‌ చేస్తాడు. భోజనం చేస్తున్న అంజు.. రాథోడ్‌ మా ఫోన్‌ రింగ్‌ అవుతుంది చూడు అని చెప్పగానే.. రాథోడ్‌ వెళ్లి ఫోన్‌ చూస్తాడు.. ఆనంద్ ఎవరు చేశారు అని అడగ్గానే.. ఎవరో తాతయ్య అని వస్తుంది అని  రాథోడ్‌ చెప్పగానే.. రామ్మూర్తి తాతయ్య చేస్తున్నారా..? అని అంటాడు ఆనంద్‌ లేదు ఎవరో తాతయ్య అని వస్తుంది అంటూ రాథోడ్ చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. ఒన్లీ తాతయ్యనా..? ఎవరూ అని ఆకాస్‌ అడుగుతాడు. ఇంతలో మిస్సమ్మ ఫోన్‌ ఇటివ్వండి బాబాయ్‌ అంటూ రాజు చేతుల్లోంచి లాక్కుంటుంది.. అయ్యో బుజ్జమ్మ వెళ్లింది ది తన ఇంటింకేనని భాగీ గారికి తెలిసిపోతుందేమో..? ఇపపుడు ఏం చేయాలి రా భగవంతుడా..? అని మనసులోనే భయపడుతుంటాడు. మరోవైపు అంజు అనాథ శరణాలయం తాతయ్య బుజ్జమ్మ కోసం కాల్ చేసి ఉండొచ్చు ఇటివ్వు అని ఫోన్‌ తీసుకుంటుంది అంజు.. బుజ్జమ్మ తాతయ్య కాల్‌ చేశారు మాట్లాడు అంటూ అంజు ఫోన్‌ బుజ్జమ్మకు ఇస్తుంది.

ఫోన్‌ తీసుకుని బుజ్జమ్మ హలో తాతయ్య అనగానే.. అటువైపు నుంచి మిస్సమ్మ,  బుజ్జమ్మ నేను అమ్మని అని చెప్పగానే.. ఏంటమ్మా ఫోన్‌ చేశావు అంటూ బుజ్జమ్మ అడుగుతుంది. మనోహరి మరింత టెన్షన్‌ పడుతుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది మిస్సమ్మ. మా ఫ్రెండు వాళ్ల ఇంట్లో అని బుజ్జమ్మ చెప్తుంది. కోపంగా మిస్సమ్మ.. ఎవరా ఫ్రెండ్‌ అని కోపంగా అడుగుతుంది. స్కూల్‌ లో ఒక అక్క పరిచయం అయింది అని చెప్పాను కదా..? ఆ అక్క వాళ్ల ఇంటికి వచ్చాను అని చెప్పగానే.. మిస్సమ్మ మరింత కోపంగా ఇంకా అక్కడే ఉన్నావా..? ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. బుజ్జమ్మ  మాత్రం కూల్‌గా భోం చేస్తున్నాను అమ్మా.. తినగానే వచ్చేస్తాను అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ బాధగా అదేంటి నేను లేకుండా ఎప్పుడూ తినవు కదా..? అక్కడెలా తింటున్నావు.. అని మిస్సమ్మ అడగ్గానే.. బుజ్జమ్మ సారీ అమ్మా ఇక్కడ అందరూ ఫోర్స్‌ చేశారు అందుకే తింటుంన్నాను.. ఇక్కడే కొంచమే తింటాను అక్కడికి వచ్చాక నీతో కలిసి ఇంకొంచెం తింటాను అని చెప్పగానే.. మిస్సమ్మ అదేం వద్దు అక్కడే కడుపు నిండా తిను.. ఇక్కడ పిల్లలు కూడా తింటున్నారు అని చెప్పగానే..

Advertisement

సరే నేను రాకుండా నువ్వు తినవు కదా..? అని బుజ్జమ్మ అడిగితే నువ్వు వచ్చాక తింటాను కానీఫోన్‌ ఒకసారి నీ ఫ్రెండ్‌ కు ఇవ్వు అని మిస్సమ్మ చెప్పగానే.. రాజు షాక్‌ అవుతాడు. బుజ్జమ్మ మాత్రం అక్కా అమ్మ నీతో మాట్లాడుతుందట అని ఫోన్‌ ఇస్తూ చెప్పగానే.. మనోహరి, చంభా షాక్‌ అవుతారు.. అంజు ఫోన్‌ తీసుకుని హలో మేడం అనగానే.. అవతల ఉన్న రాజు ఫోన్‌ లాక్కుని మాట్లాడతాడు. అంజు వెంటనే తాతయ్య మీరా..? అంటుంది ఇవతల మనోహరి, చంభా ఊపిరి పీల్చుకుంటారు. రాజు టెన్షన్‌ పడుతూ మీరు భోజనం చేయండి నేను వచ్చి బుజ్జమ్మను తీసుకొస్తాను అని చెప్పగానే.. అంజు సరే అంటుంది. రాజు కాల్‌ కట్‌ చేసి అమ్మా నేను వెళ్లి బుజ్జమ్మను తీసుకొస్తాను అంటూ వెళ్లిపోతాడు. బాబయ్‌ ఏదో దాస్తున్నారు అని అనుమానంతో రాజును ఫాలో అవుతుంది మిస్సమ్మ.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×