BigTV English

Police Police OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన థ్రిల్లర్ కామెడీ సీరీస్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Police Police OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన థ్రిల్లర్ కామెడీ సీరీస్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Advertisement

Police Police OTT:ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే అలా థియేటర్లలో విడుదలైన నెలలోపే ఇటు ఓటీటీలలోకి కూడా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటీలలో విడుదలవుతున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అలా సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. కాలం మారేకొద్ది ప్రేక్షకుడిలో అభిరుచులు కూడా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో థ్రిల్లర్, హార్రర్, రొమాంటిక్, సైకో ఇలా ఎన్నో జోనర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే పలు ఓటిటి ప్లాట్ఫామ్స్ కూడా తమ రేటింగ్ ను పెంచుకోవడానికి, ఆదాయం పొందడానికి భిన్న విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కూడిన కామెడీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జియో హాట్ స్టార్. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? ఏ భాషలో స్ట్రీమింగ్ కానుంది? నటీనటులు ఎవరు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


స్ట్రీమింగ్ కి సిద్ధమైన థ్రిల్లర్ కామెడీ వెబ్ సిరీస్..

అదేదో కాదు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన కామెడీ సిరీస్ ‘పోలీస్ పోలీస్’. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ వివరాలను ప్రకటిస్తూ తమిళ్ ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం జరిగింది.


పోలీస్ పోలీస్ స్టోరీ..

స్టోరీ విషయానికి వస్తే.. కేసు దర్యాప్తులో భాగంగా మఫ్టీ లో ఉన్న ఒక పోలీస్ అధికారి.. ప్లానింగ్ ప్రకారం ఒక వ్యక్తి ఫోన్ చోరీ చేస్తాడు. దానిని చూసిన మహిళ న్యాయవాది అతడు దొంగ అనుకొని.. నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అధికారులకు ఫిర్యాదు చేస్తుంది. పై అధికారికి అసలు విషయం చెప్పిన సదరు పోలీసు లాయర్ తో పరిచయం పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. ఇక అలా వీరిద్దరి మధ్య ప్రయాణం ఎక్కడి వరకు సాగింది ? ఏ కేసు సాల్వ్ చేసేందుకు మఫ్టీలో ఉన్నాడు? అనే విషయాలు తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సిరీస్ లో మిర్చి సెంథిల్, షబానా, జై శీలన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక ప్రస్తుతం తమిళ్లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా? లేదా? అన్నది ఇంకా తెలియలేదు.

దీనికి పోటీగా కాజోల్ మూవీ..

ఈ చిత్రానికి పోటీగా అదే రోజు కాజోల్ నటిస్తున్న ‘ది ట్రయల్ సీజన్ 2’ కూడా జియో హాట్ స్టార్ వేదికగా ప్రసారం కాబోతోంది. కాజోల్ ప్రధాన పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం కూడా లాయర్ కాన్సెప్ట్ తో రాబోతున్న విషయం తెలిసిందే మరి ఈ రెండు సిరీస్ లలో ఏ సిరీస్ మంచి విజయం అందుకుంటుందో చూడాలి.

ALSO READ:Actress Poorna: మరో గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ.. త్వరలో!

Related News

K-Ramp: ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : టీనేజ్ వయసులో ఇదేం పని? అన్నాచెల్లెళ్ల మధ్య అలాంటి బంధం… పెద్దలకు మాత్రమే

OTT Movie : ఏం సినిమా గురూ… ఆ సీన్లే హైలెట్… సింగిల్స్ కు పండగే

OTT Movie : భార్యను లేపేసి మరో అమ్మాయితో గుట్టుగా… ఆటకట్టించే ఆడపులి… చివరి వరకూ ట్విస్టులే

OTT Movie : పోలీసులే ఈ కిల్లర్ టార్గెట్… ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపే సైకో… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : శవాలుగా తేలే అమ్మాయిలు… కార్టూనిస్ట్ కన్నింగ్ భర్తపైనే అనుమానం… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : క్యాబ్ డ్రైవర్ తో రిచ్ పాప యవ్వారం… అర్దరాత్రి అడ్డంగా బుక్కయ్యే జంట… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ భయ్యా

Big Stories

×