Sreesanth wife : తొలి ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బౌలర్ శ్రీశాంత్ ను ముంబై ఇండియన్స్ బౌలర్ హర్భజన్ సింగ్ చెంప దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 18 సంవత్సరాల తరువాత ఈ Raw Footage ని ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ రిలీజ్ చేశారు. బియాండ్23 క్రికెట్ పోడ్ కాస్ట్ లో ఆయన ఈ విషయం చెప్పారు. ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఫుటేజీ ఎవరి వద్దా లేదని.. ఇది తన సెక్యూరిటీ కెమెరాలో రికార్డు అయినట్టు తెలిపారు. శ్రీశాంత్ ను కొట్టడం పై హర్భజన్ చాలా సార్లు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన పై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ పై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ఫైర్ అయ్యారు. వాస్తవానికి 2008లో చెంపదెబ్బ ఘటనకు సంబంధించి గతంలో కనిపించని వీడియో ఫుటేజీని విడుదల చేయాలని లలిత్ మోడీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ఖండించారు.
లలిత్ మోడీని కడిగిపారేసిన శ్రీశాంత్ భార్య..
ముఖ్యంగా మీకు కొంచెం కూడా సిగ్గులేదని లలిత్ మోడీని భువనేశ్వరి కడిగి పారేశారు. ” మీకు అసలు మానవత్వం ఉందా..?” అంటూ ఐపీఎల్ తొలి చైర్మన్ లలిత్ మోడీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా భువనేశ్వరి సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. “లలిత్ మోడీ, మైకేల్ క్లార్క్.. మీరు చేసిన ఈ పనికి సిగ్గు పడండి. 2008లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రదర్శిస్తూ వ్యూస్ కోసం చీప్ గా ప్రవర్తించారు. దీని కారణంగా మీరు కేవలం ఇద్దరూ వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసినట్టు కాదు.. వారి కుటుంబాలు, పిల్లలపై కూడా దీని ప్రభావం ఉంటుందని గుర్తు పెట్టుకోండి. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఇద్దరూ ఎప్పుడో ఆ సంఘటన గురించి మరిచిపోయారు.
ఛీ..ఛీ.. ఇదేం పద్దతి
వారిప్పుడు కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు.. తండ్రులు అయ్యారు. వారికి స్కూల్స్ కి వెళ్లే వయస్సు పిల్లలు ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆ పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. ఛీ ఇదేం పద్దతి.. మీకు అస్సలు హృదయం ఉందా..? మానవత్వం అన్నది మచ్చుకైనా మీలో ఉందా..? శ్రీశాంత్ ఎంతగానో శ్రమించి మళ్లీ తన కెరీర్ ను నిర్మించుకున్నాడు. చేదు అనుభవాలను అధిగమించి తనను తాను నిరూపించుకున్నాడు. అతడి భార్యగా.. అతడి పిల్లల తల్లిగా.. ఈ పాత వీడియో చూడటం ద్వారా నా మనస్సు ఎంత బాధపడుతుందో మీరు కాస్తైనా ఊహించగలరా..? ఇరు కుటుంబాలను ట్రామాలోకి నెట్టేసిన ఆ ఘటన గురించి మళ్లీ ఇప్పుడెందుక..? మీకు వ్యూస్ మాత్రమే ముఖ్యమా..? చిన్నారి పిల్లల మనస్సులపై గతం తాలుకూ మచ్చలు పడేలా చేయాలనుకుంటున్నారా..? మీకు కాస్త అయినా సిగ్గుందా..? చేయని తప్పులకు వారు శిక్ష అనువించాలా..? అని ప్రశ్నించారు. ఇలాంటి చెత్త, మానవత్వం లేని పనులను చేసినందుకు మీపై దావా వేయాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు భువనేవ్వరి కుమారి.
?utm_source=ig_embed&ig_rid=5c39a0e1-deb8-4678-8025-cf9191747dcf