Romantic Comedy OTT : ఈ కాలంలో పెళ్లి పెద్ద సమస్యగా మారిపోయింది. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కానే కాదు. మరికొంత మంది ఈ పెళ్ళిళ్ళు అంతా ఒక డ్రామా అంటూ చేసుకోవడమే మానేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఈ నేపథ్యంలో తెరకెక్కింది. 20 ఏళ్ల కుర్రాళ్లు, అమ్మాయిలు చేసుకునే సైకిల్ తొక్కే ప్రేమ కాకుండా, 40 ఏళ్లలో ఒకరికొకరు తోడు కావాలనుకునే మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమా చూసిన వల్లకి 40 ప్లస్ వయసులో ఉండే లైఫ్ స్టైల్, రిలేషన్ షిప్స్ మీద ఒక కొత్త అవగాహన వస్తుందని చెప్పవచ్చు. ఇద్దరు వ్యక్తులు కూర్చొని వాళ్ల మనసులో మాటలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా సాగుతుంది ఈ సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే, టీ తాగుతూ ప్రశాంతంగా చూసే ఫీల్ గుడ్ సినిమా ఇది. లైఫ్ బోర్ కొడుతున్నప్పుడు, మనసు బాలేనప్పుడు చూస్తే ఒక మంచి రిలీఫ్ ఇస్తుంది.
2024లో విడుదలైన ఈ మరాఠీ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘హ్యాష్‌ట్యాగ్ తదేవ్ లగ్నం’ (Hashtag Tadev Lagnam). ఈ సినిమాను ఆనంద్ దిలీప్ గోఖలే దర్శకత్వంలో శుభం ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శేఖర్ విఠల్ మేతే నిర్మించారు. ఇందులో సుబోధ్ భావే, తేజశ్రీ ప్రధాన్‌ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా పంకజ్ పద్ఘన్ అందించిన సంగీతం, అందులోని ‘జీవా పాడ్’, ‘నకర్‌ఘంట’ వంటి పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 40 ఏళ్ల వయసులో ఉండే ఎమోషన్స్, పెళ్లి చూపుల చుట్టూ ఉండే సరదా సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ విజయ్ మిశ్రా తన కెమెరాతో చాలా క్లాస్ గా చూపించారు. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియో (Prime Video)లో అందుబాటులో ఉంది.
అతశ్రీ అనే ఒక ప్రొఫెసర్ కి నలభై ఏళ్లొచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. చూసిన సంబంధాలన్నీ ఏదో ఒక కారణంతో చెడిపోతుంటే, నాకు అసలు పెళ్లి యోగమే లేదేమో అని మనిషి లోపల తెగ ఫీలవుతుంటాడు. దాదాపు 35 సంబంధాలు చూసినా, ఏ ఒక్కటి సెట్ అవ్వదు. మళ్లీ పెళ్లి చూపులకి రెడీ అవుతున్న సమయంలో గాయత్రి అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. గాయత్రి అసలు సిసలు ఫ్రీ బర్డ్. తనకి తన లైఫ్, తన ఇష్టాలే ముఖ్యం. పెళ్లి అంటేనే ఒక పెద్ద తలనొప్పి అని, దానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయిన మొండి ఘటం ఆమె. కానీ ఫ్యామిలీ కోసం బలవంతంగా అతశ్రీని కలవడానికి ఒప్పుకుంటుంది. ఈ ఇద్దరూ కలిసినప్పుడు, మనకి పెళ్లి సెట్ అవ్వదని ముందే ఒక క్లారిటీకి వచ్చేస్తారు. పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయిన ఈ ఇద్దరి మధ్య మెల్లగా స్నేహం మొదలవుతుంది. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ దగ్గరవుతారు. చివరికి వీళ్ళు పెళ్లి చేసుకుంటారా ? అలాగే ఉండిపోతారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : పుట్టినరోజునే చావు కేకలు… ప్రతిరోజు చచ్చి బతికే అమ్మాయి… బుర్ర హీటెక్కించే టైమ్ లూప్ కాన్సెప్ట్