E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 30: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వ్యాపారంలో విపరీతమైన లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 30: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వ్యాపారంలో విపరీతమైన లాభాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 30వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. 

వృషభం

Advertisement

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో భాగస్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. 

మిథునం

ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పొందుతారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. 

కర్కాటకం

Advertisement

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహనం నడిపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శారీరక శ్రమ పెరుగుతుంది.

సింహం

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన భూ లాభాలు కలుగుతాయి. పాత బాకీలు వసూలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. 

కన్య

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. సమయానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చల్లో కొంత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

వృశ్చికం

వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. నూతన వాహన సౌఖ్యం ఉన్నది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

ధనుస్సు

గృహమున కొద్దిపాటి ఒత్తిడులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. నూతన ఋణాలు చేస్తారు. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.  

మకరం

విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. 

కుంభం

ఇంటా బయట ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

మీనం

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.  విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×