E-Paper
Advertisement

Horror Movie OTT: తండ్రి కూతుర్లకు నరకం చూపించే రాక్షసి… సైలెంట్ సినిమా వైలెంట్ థ్రిల్లర్

Horror Movie OTT: తండ్రి కూతుర్లకు నరకం చూపించే రాక్షసి… సైలెంట్ సినిమా వైలెంట్ థ్రిల్లర్
Advertisement

Horror Movie OTT : ఓటీటీలో ఒక డిఫరెంట్ సైకలాజికల్ హారర్ మూవీ స్ట్రీమింగ్ లో ఉంది. ఈ ఫిలిప్పీన్ మూవీ గత ఏడాది థియేటర్లలో విడుదలై ఆడియన్స్ ని బాగానే బయపెట్టింది. ఇది ఒక ఫిల్మ్ ఎడిటర్, అతని కుమార్తె కలిసి ఒక పాత సైలెంట్ హారర్ సినిమాను సరి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వీళ్ళు ఒక భయాంకరమైన రాక్షసిని నిద్ర లేపుతారు. ఆ తరువాత అసలు హారర్ మొదలవుతుంది. ఒక్కో సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ ఫిలిప్పీన్ సైకలాజికల్ హారర్ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ ఫిలిప్పీన్ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘పోస్ట్‌హౌస్’ (Posthouse). ఇది 2025 ఆగస్టు 20న థియేటర్లలో విడుదలైంది. నికోలస్ రెడ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది 1927లో వచ్చిన ఫిలిప్పీన్స్ మొట్టమొదటి హారర్ చిత్రం ‘అంగ్ మననం గల్’ (Ang Manananggal) ఆధారంగా రూపొందింది. సిడ్ లూసెరో, బీ బినేనే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సిరిల్ అనే ఒక ఫిల్మ్ ఎడిటర్, చాలా కాలంగా దూరంగా ఉంటున్న తన కూతురు రియాతో కలిసి ఒక పాత కాలపు పూర్తికాని ‘సైలెంట్ హారర్’ సినిమాను బాగు చేసే పని మొదలుపెడతాడు. అది వారి తాత ముత్తాతల కాలం నాటి పాత ఫిల్మ్ రీల్స్. ఆ రీల్స్‌ని ఒక్కొక్కటిగా సెట్ చేస్తున్న కొద్దీ, ఆ సినిమాలో ఉన్న భయంకరమైన పాత్రలు నిజ జీవితంలోకి రావడం మొదలవుతాయి. తెలియకుండానే వాళ్ళు ఒక పురాతన రాక్షసిని మేల్కొల్పుతారు.

ఇక ఆ పాత సినిమాలో జరుగుతున్న దారుణాలు వీరిద్దరి జీవితాల్లో కూడా రిపీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ గది నుండి బయటపడాలన్నా, ఆ రాక్షసి బారి నుండి తప్పించుకోవాలన్నా ఆ సినిమాను ఎలాగైనా పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరికి ఆ రాక్షసి నుంచి వీళ్ళు బయటపడతారా ? తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న పాత గొడవలు ఏమిటి ? అనే విషయాలను, ఈ ఫిలిప్పీన్ సైకలాజికల్ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ఆస్కార్ వేడుకలో మమ్ముట్టి హర్రర్ మూవీ హవా… ఇండియాలో ఒక్క హీరో కూడా సాధించలేని రికార్డు మావా… మీరు ఎక్కడ చూడొచ్చంటే ?

Tags

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×