E-Paper
Advertisement

Dies Irae OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Dies Irae OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Advertisement

Dies Irae OTT : సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.. ఆయన తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇటీవలే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. తాజాగా ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డీయస్ ఈరే’.. అక్టోబర్ 31న మలయాళంలో రిలీజైన వారం రోజుల తర్వాత తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో పాటుగా మంచి కలెక్షన్స్ ని కూడా అందుకుంది.. కేవలం వారం రోజులలోనే 50 కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు.. అలాంటి హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్లోకి వస్తుంది..? స్ట్రీమింగ్ ఎప్పుడు అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘డీయస్ ఈరే’ ఓటీటీ అప్డేట్..

ఈమధ్య సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమాలకు జనాలు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.. ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలైనా సరే చూడాలని ఆసక్తి కనపరుస్తుంటారు.. ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు హారర్ జోనర్లో ఉన్న సినిమాలను ఎక్కువగా స్ట్రీమింగ్ కి తీసుకొని వస్తుంటారు.. అలాంటి భయంకరమైన కథతో వచ్చిన మూవీనే ఇది.. థియేటర్లలో పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో హాట్ స్టార్’ డిజిటల్ హక్కుల భారీ ధరకు సొంతం చేసుకుంది.. డిసెంబర్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అయితే, మలయాళం వెర్షన్ రిలీజ్ కన్ఫర్మ్ కాగా తెలుగు వెర్షన్ కూడా అదే రోజున వస్తుందో, రాదో క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు..

Advertisement

Also Read :శ్రీవాణి యూట్యూబ్ నుంచి వచ్చిన సంపాదన ఎంత..? ప్రస్తుతం ఎన్ని లక్షలంటే..?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ప్రణవ్ మోహన్ లాల్‌తో పాటు సుస్మితా భట్, జిబిన్ గోపీనాథ్, అరుణ్ అజికుమార్, జయ కురుప్ వంటి వాళ్లు నటించారు.. ‘భూతకాలం’ వంటి హిట్ మూవీస్ తీసిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సినిమాను నిర్మించారు. ఈ చిత్ర స్టోరీ విషయానికొస్తే.. రోహన్ అనే కుర్రాడు ఆర్కిటేక్.. తండ్రి ఓ పెద్ద వ్యాపారవేత్త. ఇద్దరు పేరెంట్స్ అమెరికాలో ఉంటే ఫ్రెండ్స్‌తో పార్టీలు, సరదాలతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు.. ఒకరోజు తన ఫ్రెండు సూసైడ్ చేసుకుందని తన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్తాడు. ఆ తర్వాత నుంచి అతని ఇంట్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి.. తన ఫ్రెండ్ ఆత్మ ఎందుకు తనని ఇబ్బంది పెడుతుందో అన్నది తెలుసుకునేందుకు రోహన్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎన్నో ట్విస్టులు ఎదురవుతాయి. రోహన్ ను ఆ ఆత్మ ఎందుకు ఇబ్బంది పెడుతుంది అన్నది సినిమా లో చూడాలి. భయపెట్టే సీన్లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×