E-Paper
Advertisement

Kissik Talks show: శ్రీవాణి యూట్యూబ్ నుంచి వచ్చిన సంపాదన ఎంత..? ప్రస్తుతం ఎన్ని లక్షలంటే..?

Kissik Talks show: శ్రీవాణి యూట్యూబ్ నుంచి వచ్చిన సంపాదన ఎంత..? ప్రస్తుతం ఎన్ని లక్షలంటే..?
Advertisement

Kissik talks show : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ ప్రేక్షకులను అలరించేందుకు నిత్యం కొత్త షోలను పరిచయం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ప్రోగ్రాం లను ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చింది. ప్రతి ప్రోగ్రాం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ మధ్య వచ్చిన కొత్త షో కిస్సిక్ టాక్స్ ( Kissiks Talks Show) పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. బుల్లితెర షో జబర్దస్త్ ఫేమ్ వర్ష ఈ షోకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ప్రతివారం బుల్లితెర సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది విచ్చేసి తమ పర్సనల్ విషయాలను బయటపెట్టారు. తాజాగా ఈ కార్యక్రమానికి బుల్లి తెర యాక్టర్ శ్రీవాణి గెస్టుగా వచ్చారు. తన కెరీర్ లో ఎదుర్కొన్న పరిస్థితులు, యూట్యూబ్ వల్ల ఆమె సంపాదన ఎలా ఉంది.. ఫస్ట్ టైం ఎందుకు సంపాదించింది.? ఇప్పుడు ఎంత వస్తుంది అనే విషయాలను పంచుకుంది.. ఆ విశేషాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం..

శ్రీవాణి యూట్యూబ్ సంపాదన ఎంత..?

బుల్లితెర పై యాక్టర్స్ గా సక్సెస్ అయిన చాలా మంది సెలెబ్రేటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటుగా, సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు.. ఇండస్ట్రీలోని చాలామంది యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. సీరియల్ యాక్టర్ శ్రీవాణి కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తుంది.. ఒకప్పుడు ఆమె సంపాదన అంతంత మాత్రంగానే ఉండడంతో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన విషయాన్ని చెప్పింది. తాజాగా ఈమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ షోలో పాల్గొన్నారు. ఆ షోలో మాట్లాడుతూ.. ఒకప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. అప్పుడే యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసినట్లు బయట పెట్టింది. అయితే అప్పట్లో ఆ ఛానల్ కి నెలకు పదివేలు వచ్చిందని ఆమె అంది. ఆ తర్వాత కంటెంట్ను బట్టి 30 లక్షలు వరకు నెలకు సంపాదించినట్లు శ్రీవాణి అన్నారు.. ఇప్పటికీ కూడా ఆమె యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.

Advertisement

Also Read: తెలుగు సినిమాలకు బుజ్జితల్లి గుడ్ బై.. ఏడాదికి ఒక్కటి కూడా లేదు..!

శ్రీవాణి పర్సనల్ లైఫ్.. 

నటి శ్రీవాణి ఆగష్టు 2, 1989న హైదరాబాద్‌లో జన్మించారు.. చదువు అంతా కూడా హైదరాబాదులోనే పూర్తి చేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో బుల్లితెర యాంకర్ గా అవకాశాన్ని అందుకుంది. అప్పట్లో ఆమె వరసగా షోలు చేస్తూ బిజీగా ఉండేది. ఆ తర్వాత సీరియల్స్ లోకి అడుగు పెట్టింది.. ఈమె సీరియల్ నటి శ్రీవాణి పలు హిట్ సీరియల్స్‌లో నటించారు. వీటిలో చంద్రముఖి, కలవారి కోడళ్లు, కాంచనగంగ, మావిచిగురు, మనసు మమత వంటి సీరియల్స్ లలో నటించి బుల్లితెర ఆడియన్స్ ను తన నటనతో ఆకట్టుకుంది.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షాలలో సందడి చెయ్యడంతో పాటుగా సీరియస్లలో కీలక పాత్రలో నటిస్తుంది. అంతేకాదు ఈ మా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది శ్రీవాణి. ఫ్యామిలీతో ట్రిప్పులకు వెళుతూ.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది..

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×