ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ స్మార్ట్ ఫోన్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేస్తుంది. షావోమీ ఆటో పేరుతో అదిరిపోయే కార్లను తయారు చేస్తుంది. రీసెంట్ గా ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ లగ్జరీ క్రాస్‌ఓవర్ SUVని లాంచ్ చేసింది. SU7 సెడాన్ తర్వాత కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చి రెండో EV మోడల్. Tesla Model Yని తలదన్నేలా దీనిని రూపొందించింది. స్పోర్టీ పెర్ఫార్మెన్స్, అధునాతన టెక్ ఇంటిగ్రేషన్ తో చైనా ప్రీమియం EV SUV సెగ్మెంట్ లో హాట్ ఫేవరెట్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ కారు బుకింగ్స్ మొదలైన తొలి మూడు నిమిషాల్లోనే 200,000కి పైగా ప్రీ ఆర్డర్లు సాధించింది. డెలివరీలు 2025 జూలైలో ప్రారంభమయ్యాయి. ఎక్కుడ డిమాండ్ కారణంగా డెలివరీలను మరికొంత కాలం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
YU7 షావోమీ మోడెనా ప్లాట్ ఫామ్ మీద రూపొందించారు. 5-డోర్, 5 సీటర్ వెహికల్ గా తయారు చేశారు. దీని బరువు 2,140 నుంచి 2,460 కిలోల మధ్యలో ఉంటుంది. 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ తో ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. షావోమీ హైపర్ ఇంజిన్ V6s Plus ఎలక్ట్రిక్ మోటర్లతో అమర్చబడింది.
YU7 కారు మూడు వేరియంట్లో అందుబాటులో ఉంది. ఇంతకీ అవేంటంటే..
⦿ YU7 స్టాండర్డ్: దీని బ్యాటరీ కెపాసిటీ 96.3 kWh ఉంటుంది. దీని రేంజ్ 835 కిలో మీటర్ల రేంజ్ ను కలిగి ఉంటుంది. మోటార్ పవర్ 325 hpని కలిగి ఉంటుంది. 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని 5.8 సెకెన్లలో అందుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 240 కిలో మీటర్లుగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
⦿ YU7 ప్రో: ఈ కారు బ్యాటర్ 96.3 kWhగా ఉంటుంది. రేంజ్ 770 కిలో మీటర్లుగా ఉంటుంది. మోటార్ పవర్ 489hp ఉంటుంది. టాప్ స్పీడ్ 240 కిలో మీటర్లుగా కంపెనీ నిర్ణయించింది. 0-100 కిలో మీటర్ల వేగాన్ని 4.27 సెకెన్లలో అందుకుంటుంది.
⦿ YU7 మ్యాక్స్: ఈ కారు 101.7 kWh బ్యాటరీ ప్యాకప్ తో వస్తుంది. 760 రేంజ్ ను కలిగి ఉంది. మోటార్ పవర్ 681 hpగా నిర్ణయించింది. 3.23 సెకెన్లలో కారు వేగం 0-100 కిలో మీటర్లు అందుకుంటుంది.
Ferrari Purosangue, Aston Martin DBX లాంటి హై ఎండ్ పెర్ఫార్మెన్స్ SUVల బేస్ చేసుకుని రూపొందించారు. స్లీక్, అగ్రెసివ్ కూపే లైక్ ప్రొఫైల్ తో వస్తుంది. లాంగ్ హుడ్, వైడ్ ఫెండర్లు, 19, 21 ఇంచ్ వీల్స్, లగ్జరీ ఇంటీరియర్ ను కలిగి ఉంది.
⦿ డిస్ ప్లే: 16.1-ఇంచ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఆపిల్ కార్ ప్లే సపోర్టుతో వస్తుంది. 7.1-ఇంచ్ డ్రైవర్ డిస్ ప్లే, ఆప్షనల్ హెడ్స్ అప్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
⦿ ఆడియో: స్టాండర్డ్ 14 స్పీకర్ సిస్టమ్, ఆప్షనల్ 25 స్పీకర్ డాల్బీ అట్మాస్, యాక్టివ్ నాయిజ్ క్యాన్సలేషన్ ను కలిగి ఉంటుంది.
⦿ కంఫర్ట్: ఫ్రంట్ సీట్లు 10 పాయింట్ మసాజ్, వన్ టచ్ రీక్లైన్‌తో వస్తుంది. రియర్ సీట్లు 135 డిగ్రీల వరకు రీక్లైన్ లౌంజ్ మోడ్ కు సపోర్ట్ చేస్తుంది. హీటెడ్, కూల్డ్ కప్ హోల్డర్లు, డ్యూయల్ 80 W వైర్ లెస్ చార్జర్లు, 1.7 m² పానోరమిక్ సన్ రూఫ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది.
⦿ టెక్ ఇంటిగ్రేషన్: 4 ఇన్-1 కంప్యూటింగ్ మాడ్యూల్ ECUలను 75% తగ్గిస్తుంది. ADAS, ఇన్ఫోటైన్‌మెంట్, 5G కనెక్టివిటీని కలిగి ఉంటుంది. షావోమీ ఎకోసిస్టమ్ పెయిరింగ్ సపోర్ట్.
⦿ YU7 స్టాండర్డ్: 253,500 యువాన్లు (సుమారు రూ.28.5 లక్షలు)
⦿ YU7 ప్రో: 279,900 యువాన్లు (సుమారు రూ.31.5 లక్షలు)
⦿ YU7 మ్యాక్స్: 329,900 యువాన్లు (సుమారు రూ.37.2 లక్షలు)
ఈ కారు భారత్ లో ఇంకా లాంచ్ లేదు. 2026లో వచ్చే అవకాశం ఉంది. భారత్ లో దీని ధర రూ. 50-55 లక్షల వరకు ఉంటుందని అంచనా.
Read Also: బజాజ్ నుంచి సరికొత్త ఈ-రిక్షాలు,వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా