E-Paper
Advertisement

Top 20 News: నాకు ఒక్కరే భార్య: బాలకృష్ణ….మలక్‌పేటలో మాస్‌ కాపీయింగ్‌

Top 20 News: నాకు ఒక్కరే భార్య: బాలకృష్ణ….మలక్‌పేటలో మాస్‌ కాపీయింగ్‌

1. వరంగల్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను దగ్గరుండి పరిశీలించారు. రైల్వే స్టేషన్ క్యాంటీన్‌లో ఆగి చర్చ నిర్వహించారు. అంతేకాకుండా చాయ్ బిల్లును ఫోన్ పే ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేశారు.

2. శబరిమల ప్రమాణాలకు భంగం కలగకుండా ఏర్పాట్లు

శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు శుభవార్త చెప్పారు. భక్తుల సౌలభ్యం కోసం ఇరుముడిని వారితోపాటు నేరుగా విమానంలోకి వారి చేతి సామానుగా తీసుకెళ్లడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. తమ శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నానని అన్నారు.

3. మలక్‌పేటలో మాస్‌ కాపీయింగ్‌

హైదరాబాద్‌ మలక్‌పేటలో మాస్‌ కాపీయింగ్‌ బయటపడింది. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మలక్‌పేట్ ఎం.ఎస్ కాలేజ్‌లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షా కేంద్రంలోనే పుస్తకాలు, సెల్‌ఫోన్లు ముందుపెట్టి పరీక్ష రాశారు విద్యార్థులు.
మాస్‌ కాపీయింగ్‌

4. యువకుడు అనుమానస్పదంగా ఉరి

బతుకుదెరువు కోసం వచ్చి ఓ యువకుడు అనుమానస్పదంగా ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన షేక్ అంజూమ్ బతుకుదెరువు కోసం వలస వచ్చి మేడ్చల్ జిల్లా మజీద్‌పూర్‌లోని డైమండ్ బావార్చి రెస్టారెంట్ వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ అయిపోయిన తర్వాత.. రెస్టారెంట్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

5. ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీపై వివాదం

తెలంగాణలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీపై తీవ్ర వివాదం రేగుతోంది. పాలసీపై బహిరంగ చర్చకు మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డికి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్‌ విసిరారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఏలేటి తెలిపారు.

6. సంధ్యారాణి కొడుకు, మంత్రి పీఏ సతీష్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్

మంత్రి సంధ్యారాణి కొడుకు, మంత్రి పీఏ సతీష్ వేధింపుల కేసులో.. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో అత్యాచారయత్నం కేసు కూడా పెట్టడంతో.. బాధితురాలిని మెడికల్ టెస్టుల కోసం సాలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఇవాళ కూడా మరికొన్ని మెడికల్ టెస్టులు చేసే అవకాశం ఉంది.

7. భార్య ఆత్మహత్యకు భర్తే కారణం

అనంతపురంలో డిప్యూటీ తహశీల్దార్‌ రవి భార్య అమూల్య ఆత్మహత్యకు.. ఆమె భర్త రవి కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కట్నం కోసం తమ కూతురును మానసికంగా, శారీరకంగా వేధించడం వల్లే సూసైడ్‌ చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమూల్య మృతికి భర్త, అత్తమామలు వేధింపులే కారణమని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

8. భార్యపై కోపం భర్త ఎం చేసాడంటే

ఏలూరు జిల్లా మఠంగూడెంలో జూన్ 26న తుర్లపాటి రవికి చెందిన మూడు పాడి గేదెల తలలు నరికిన కేసులో ఐదు నెలల తర్వాత పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు లారీ డ్రైవర్ అయిన దాసరి రంగారావు(43)ను పోలీసులు అరెస్టు చేశారు. భార్య బంధువులపై ప్రతీకారంగానే రంగారావు ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. మహారాష్ట్రకు పారిపోయిన నిందితుడిని ధర్మాజీగూడెం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

9. పవన్ కళ్యాణ్ టూర్‌లో అపరిచితుడు హల్‌చల్

అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్‌లో అపరిచితుడు హల్‌చల్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరనే దానిపై వీడియోలు, ఫొటోలతో జనసేన కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. అయితే.. జనసేన సభ్యత్వం కలిగి ఉన్న ఆ వ్యక్తి ఐడీ కార్డును పరిశీలించిన పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

10. పోలీసులపై కత్తితో దాడి

నెల్లూరు జిల్లా కోవూరులో పోలీసులపై కత్తితో దాడికి దిగారు నిందితులు. పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద తలదాచుకున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు యత్నించడంతో కత్తులతో దాడికి దిగారు. నిందితులు దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్‌కు గాయాలు కాగా.. నిందితులలో ఒకరికి గాయాలయ్యాయి.

11. వాచ్‌ కొట్టేసిన కానిస్టేబుల్

హైదరాబాద్‌ నకిలీ IPS ఆఫీసర్ రోలెక్స్ వాచ్‌ కొట్టేసిన.. కానిస్టేబుల్ శ్రీరాములు శరణ్ కుమార్‌ని అరెస్ట్ చేశారు ఫిల్మ్ నగర్ పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రోలెక్స్ వాచ్‌ను శరణ్ కుమార్ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు.

12. మంగాపురం గ్రామంలో మహిళపై దాడి

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం మంగాపురం గ్రామంలో ఇంద్రజ అనే మహిళపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. విష్ణు అనే వ్యక్తి వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినందుకు.. దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారని వాపోయింది.

13. దుబాయ్ లో మోసపోయిన పెనుగోండ మహిళా

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన వీరంశెట్టి మంజులను దుబాయ్ ఏజెంట్ పెచ్చేటి శ్రీనివాస్ మోసం చేశాడు. నెలకు 75 వేల జీతం ఆశ చూపడంతో, ఆమె లక్షా 50 వేలు చెల్లించింది. ఆరు నెలలు గడిచినా జీతం ఇవ్వడం లేదని, ప్రతిరోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వాపోయింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని తనను పెనుగొండకు తీసుకురావాలని వేడుకుంటోంది.

14. సోలార్ రేడియేషన్ కారణంగా విమానాల అంతరాయం

ఎయిర్ బస్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో భారత సహా ప్రపంచవ్యాప్తంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ బస్ హెచ్చరికల గురించి యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) ఓ ప్రకటనలో తెలిపింది. సోలార్ రేడియేషన్ కారణంగా ఈ విమానాల నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిన్నట్లు పేర్కొంది. దీంతో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది.

15. వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ గృహం, కార్యాలయాలను అధికారులు సోదా చేశారు

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఆంద్రీ యెర్మాక్‌ గృహం, కార్యాలయాలను అవినీతి నిరోధక సంస్థల అధికారులు సోదా చేశారు. చమురు రంగంలో 10 కోట్ల డాలర్ల అవినీతి జరిగిందనే ఆరోపణలను పురస్కరించుకుని ఈ దాడులు జరిగాయి.

16. పేద దేశాల జనాలు మాకు వద్దు: డోనాల్డ్ ట్రంప్

తృతీయ ప్రపంచ దేశాల నుంచి తమ దేశంలోకి వలసలకు శాశ్వత విరామం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే విదేశీయుల్ని వెనక్కి పంపించేస్తామని చెప్పారు. గ్రీన్‌కార్డులు పొందినవారిలో ప్రతిఒక్కరినీ క్షుణ్నంగా పరిశీలిస్తామని తెలిపారు. శ్వేతసౌధం సమీపాన భద్రత బలగాలపై అఫ్గాన్‌ పౌరుడు జరిపిన కాల్పుల నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువరించారు.

17. వెన్ను గాయంతో జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌

వెన్ను గాయంతో కొన్ని నెలలుగా ఆస్ట్రేలియా జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌.. యాషెస్‌ సిరీస్‌లో రెండో టెస్టుకూ అందుబాటులో లేకుండా పోయాడు. సిరీస్‌ మొదలయ్యే సమయానికి అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని భావించినా అలా జరగలేదు. బ్రిస్బేన్‌లో జరిగే మూడో టెస్టులో మాత్రం కమిన్స్‌ కచ్చితంగా ఆడతాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. కమిన్స్‌ దూరం కావడంతో రెండో టెస్టుకూ స్టీవ్‌ స్మిత్‌యే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

18. నాకు ఒక్కరే భార్య: బాలకృష్ణ

అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినీ నటుడు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు చాలా పనులు ఉన్నాయి కానీ.. ఒక్కరే భార్య అంటూ కామెంట్స్ చేశారు బాలకృష్ణ. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు..? అసలు భార్య ప్రస్తావన ఎందుకు తెచ్చారనే చర్చ సినీ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్‌గా మారింది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×