E-Paper
Advertisement

Made in Korea on OTT : ప్రియాంక మోహన్ వెబ్ ఫిల్మ్ అప్డేట్… స్ట్రీమింగ్ డేట్ మాత్రం కాదండోయ్

Made in Korea on OTT : ప్రియాంక మోహన్ వెబ్ ఫిల్మ్ అప్డేట్… స్ట్రీమింగ్ డేట్ మాత్రం కాదండోయ్
Advertisement

Made in Korea on OTT : నటి ప్రియాంక అరుల్ మోహన్ ‘మేడ్ ఇన్ కొరియా’ వెబ్ ఫిల్మ్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 1 గంట 51 నిమిషాలుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సియోల్ లోని అందమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ కూడా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దక్షిణ కొరియాకి వెళ్ళిన ఒక తమిళ అమ్మాయి చుట్టూ ఈ కథ ఉంటుంది. ఇదొక ఫీల్ గుడ్ అండ్ ఇన్‌స్పైరింగ్ జర్నీ. మరి ఇది ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో అంటే

ప్రియాంక మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ (Made in Korea) వెబ్ ఫిల్మ్ Netflixలో డైరెక్ట్‌గా స్ట్రీమ్ అవుతుంది. కానీ స్ట్రీమింగ్ డేట్ ఇంకా అధికారికంగా అనౌన్స్ కాలేదు. నెట్ ఫ్లిక్స్ నుంచి ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయాలి. ఇది 2026లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అయింది. త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. ఈ ఇండో-కొరియన్ ప్రాజెక్ట్ లో సౌత్ కొరియన్ యాక్ట్రెస్ హై-జిన్ కూడా కీ రోల్‌లో నటించింది. ఈ సినిమాకి ‘నితం ఒరు వానమ్’ (తెలుగులో ‘ఆకాశం’) ఫేమ్ రా కార్తీక్ దర్శకత్వం వహించారు. ఒరిజినల్‌గా తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

కథలోకి వెళ్తే

Advertisement

కన్యాకుమారికి చెందిన శెంబ (ప్రియాంక మోహన్) అనే అమ్మాయికి చిన్నప్పటి నుండి కొరియన్ డ్రామాలు అంటే పిచ్చి. ఎలాగైనా ఒకసారి దక్షిణ కొరియా వెళ్లాలని కలలు కంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ సహాయంతో ఫైనల్‌గా ఆమె సియోల్ చేరుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక కథ అడ్డం తిరుగుతుంది. నమ్మిన బాయ్‌ఫ్రెండే ఆమెను మోసం చేసి, ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు, అస్సలు అర్థం కాని భాష.. ఇలాంటి కష్టాల్లో ఉన్న శెంబకు అక్కడ ఒక కొరియన్ స్నేహితురాలు (పార్క్ హై-జిన్) పరిచయం అవుతుంది. భాష తెలియకపోయినా ఆమె పరాయి దేశంలో తన కాళ్ల మీద తాను ఎలా నిలబడింది? తన కష్టాలను ఎలా ఎదుర్కొంది? అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్.

Read Also : మార్చురీలో మతిపోగొట్టే పనులు… గుండెలదిరే సీన్స్… హర్రర్ మూవీ అంటే ఇలా ఉండాలి మావా

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×