E-Paper
Advertisement

సూర్యుడు అంతమైతే భూమి క్లోజ్!.. హాలీవుడ్ క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ..

సూర్యుడు అంతమైతే భూమి క్లోజ్!.. హాలీవుడ్ క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ..
Advertisement

Project Hail: హాలీవుడ్ స్టార్ హీరో రియాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘Project Hail Mary’. ప్రముఖ రచయిత ఆండీ వియర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా, ‘ది మార్షియన్’ తరహాలోనే ఒక ఉత్కంఠభరితమైన అంతరిక్ష ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Read also-సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. ఈ డిటైల్స్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..

ఆకట్టుకునే కథాంశం

Advertisement

రైలాండ్ గ్రేస్ (రియాన్ గోస్లింగ్) అనే ఒక హైస్కూల్ సైన్స్ టీచర్ ఒక అంతరిక్ష నౌకలో ఒంటరిగా కళ్ళు తెరుస్తాడు. ఆ సమయంలో అతనికి తన పేరేంటో, తను ఎక్కడున్నాడో అస్సలు గుర్తుండదు. క్రమంగా జ్ఞాపకాలు తిరిగి వచ్చే కొద్దీ.. తనపై ఎంతటి గురుతర బాధ్యత ఉందో అతనికి అర్థమవుతుంది. సూర్యుడి శక్తిని హరించి వేస్తూ, భూమిని అంతం చేయడానికి కారణమవుతున్న ఒక రహస్యమైన పదార్థం గురించిన చిక్కుముడిని విప్పడమే తన మిషన్ అని గ్రహిస్తాడు. ఒకవేళ తను విఫలమైతే భూమిపై మానవాళి మొత్తం అంతరించిపోతుంది. ఈ క్రమంలో విశ్వాంతరాళంలో అతనికి ఒక ఊహించని వింత స్నేహితుడు (Alien) తోడవుతాడు. వారిద్దరూ కలిసి భూమిని ఎలా కాపాడారు అనేదే అసలు కథ.

Read also-యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ రూమర్లపై ఆర్జే మహ్వాష్ షాకింగ్ కామెంట్స్!

ఆడియన్స్‌ను కట్టిపడేసే ప్రధానాంశాలు

Advertisement

సినిమా ప్రారంభంలోనే హీరోకు మెమరీ లాస్ అవ్వడం, చుట్టూ ఉన్న మిగిలిన క్రూ మెంబర్స్ చనిపోయి ఉండటం ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. “అసలు ఏం జరిగింది?” అనే సస్పెన్స్ ప్రేక్షకుడిని కథలోకి లాగుతుంది. సూర్యుడిని, భూమిని కాపాడేందుకు హీరో తనకున్న సైన్స్ పరిజ్ఞానంతో చేసే వినూత్నమైన ప్రయోగాలు, ప్లాన్స్ సైన్స్ ఫిక్షన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటాయి. కథలో అత్యంత కీలకమైన మలుపు.. అంతరిక్షంలో హీరోకి లభించే ఆ వింత తోడు. ఒక మనిషికి, వేరే గ్రహానికి చెందిన జీవికి మధ్య ఏర్పడే ఎమోషనల్ బాండ్, వారిద్దరి మధ్య సాగే సంభాషణలు వెబ్ వీక్షకులను ఎంతగానో కనెక్ట్ చేస్తాయి. రియాన్ గోస్లింగ్ వన్-మ్యాన్ షో: ఒక ఒంటరి సైంటిస్ట్‌గా, భూమిని కాపాడే రక్షకుడిగా రియాన్ గోస్లింగ్ పండించే నటన, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు లార్డ్ అండ్ మిల్లర్ రూపొందిస్తున్న ఈ చిత్రం, విజువల్స్ పరంగాను, ఎమోషన్స్ పరంగాను ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను అందించడం ఖాయం.

Related News

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

అడవి నేపథ్యంలో ఊపిరి బిగబట్టించే వేట… రక్తం ఉడికించే మలయాళం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్

ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ… 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×