E-Paper
Advertisement

పలుచగా ఉన్న పాలల్లో గట్టి మీగడ కావాలా? ఈ ఒక్క చిట్కా పాటించండి చాలు

పలుచగా ఉన్న పాలల్లో గట్టి మీగడ కావాలా? ఈ ఒక్క చిట్కా పాటించండి చాలు
Advertisement

చాలా మంది ప్యాకెట్ పాలు పలచగా ఉండటం వల్ల గట్టి మీగడ రావడం లేదని బాధపడుతుంటారు. పాలుపై మీగడ లేకుంటే నెయ్యి, వెన్న లాంటివి ఇంట్లో తయారు చేయడం కష్టమవుతుంది. కానీ ఒక చిన్న కిచెన్ ట్రిక్‌తో పలచటి పాల నుంచి కూడా గట్టి, క్రీమ్ లాంటి మీగడ సులభంగా తీసుకోవచ్చు. ఇందుకు కేవలం ఒక అదనపు పదార్థం మాత్రమే అవసరం.

పలచటి పాలపై గట్టి మీగడ ఎందుకు ఏర్పడదు?

ప్యాకెట్ పాల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. కొన్ని పాలల్లో నీళ్లు కలిపి ఉండటం వల్ల కూడా మీగడ సరిగా ఏర్పడదు. ఎక్కువ ఫ్లేమ్‌పై త్వరగా మరిగించడం కూడా ఒక కారణం. సరైన విధానంలో మరగించకపోతే మంచి మీగడ రాదు.

పాలను మీడియం ఫ్లేమ్‌పై మరగించండి

Advertisement

చాలా మంది పాలను ఎక్కువ వేడితో త్వరగా మరిగిస్తారు. ఇలా చేయడం వల్ల మలై గట్టిగా ఏర్పడదు. పాలను చిన్న లేదా మీడియం మంటపై నెమ్మదిగా మరగించాలి. నెమ్మదిగా మరగించడం వల్ల పాలలోని సహజ కొవ్వులు బాగా విడుదలై గట్టి మలై ఏర్పడుతుంది. ఓపికగా ఉండటం ఇక్కడ చాలా ముఖ్యం.

మరగుతున్నప్పుడు మిల్క్ పౌడర్ వేయండి

ఈ ట్రిక్‌లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిల్క్ పౌడర్. పాలు మొదటి సారి మరగించగానే ఒక టీ స్పూన్ మిల్క్ పౌడర్ వేసి బాగా కలపండి. ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా మరగించండి. మిల్క్ పౌడర్ వల్ల పాలలో కొవ్వు, సాలిడ్స్ పెరిగి గట్టి మలై ఏర్పడుతుంది. పాల రుచి కూడా మారదు.

పాలను సరిగ్గా చల్లార్చండి

Advertisement

పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గది ఉష్ణోగ్రతలో సహజంగా చల్లార్చండి. మధ్యలో బాగా కదిలించకండి. కదిలిస్తే మలై లేయర్ సరిగా ఏర్పడదు. చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి కొన్ని గంటలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గట్టి మీగడ లేయర్ పైన కనిపిస్తుంది.

ఈ ట్రిక్ ఎందుకు పని చేస్తుంది?

మిల్క్ పౌడర్‌లో అదనపు కొవ్వు, మిల్క్ సాలిడ్స్ ఉంటాయి. అవి పాలను గట్టిగా చేసి మంచి మలై ఏర్పడేలా సహాయపడతాయి. పలచటి పాలు ఉన్నవారికి ఈ ట్రిక్ చాలా ఉపయోగకరం. ఇంట్లో నెయ్యి, వెన్న తయారు చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది.

Also Read: ఉద్యోగం, బిజినెస్‌లో తరుచూ నష్టం వస్తోందా?వాస్తు ప్రకారం చెడు అలవాట్లే కారణం

మీగడ మరింత బాగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి

  • వెడల్పైన పాత్రలో పాలు మరగించండి.
  • పాలను ఎక్కువసేపు అధిక వేడిమితో ఉంచకండి.
  • తాజా పాలు వాడండి.
  • ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత పాత్రను కదిలించకండి.

ఈ సింపుల్ ట్రిక్‌తో పలచటి పాల నుంచి కూడా గట్టి, క్రీమీ మలై సులభంగా తీసుకోవచ్చు. డబ్బు ఆదా అవుతుంది. ఇంట్లో తయారు చేసుకునే ఆహారాలు మరింత రుచికరంగా ఉంటాయి.

Related News

విచిత్ర వేడుక.. జీవితాంతం పెళ్లి వద్దంటూ ప్రేమికుల గ్రాండ్ సెలబ్రేషన్

టేస్టీ అండ్ స్పైసీ క్యాప్సికమ్ రైస్..నిమిషాల్లో తయారయ్యే రెసిపీ!

బంగాళాదుంపలతో కాదు.. అవకాడోతో ఇలా ఫ్రైస్ చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది!

ఎప్పుడూ పకోడీలేనా? ఈసారి పచ్చి అరటికాయతో ఇలా షామీ కబాబ్ చేసి చూడండి!

దిష్టి ఎలా తీయాలో తెలుసా? వేటితో తీస్తే వెంటనే ఫలితం ఉంటుంది?

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

Big Stories

Advertisement
×