Crime Thriller Web Series : మంచి క్రైమ్ థ్రిల్లర్ కోసం చూస్తున్నట్లైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ పై ఓ లుక్ వేయండి. ఎందుకంటే చివరి వరకు కట్టిపడేసే కథతో ఒక సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఏడు ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ క్రైమ్ సిరీస్‌లో ప్రతి ఒక్కటి ఉత్కంఠభరితంగా ఉంటుంది. స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపులతో మతిపోయేలా చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఇయండిబిలో 7.5 రేటింగ్‌ను కూడా పొందింది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..
ఇది ఇమ్రాన్ హష్మీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘తస్కరీ’ సిరీస్. జనవరి 14 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ప్రస్తుతం టాప్ 1 ట్రెండింగ్ సిరీస్‌గా మారింది. ఈ సిరీస్‌లో ఇమ్రాన్ హష్మీ, శరద్ కేల్కర్, నందీష్ సంధు, అనురాగ్ సిన్హా, అమృత ఖాన్విల్కర్, జోయా అఫ్రోజ్ నటించారు. నీరజ్ పాండే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ ఏడు ఎపిసోడ్ల సిరీస్ ని ఫ్రైడే స్టోరీటెల్లర్స్ నిర్మించింది. ఇది హిందీ తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. ముంబైతో పాటు మిలన్, బ్యాంకాక్, అబూ ధాబీ వంటి ప్రదేశాలలో ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంది.
Read Also : పదేళ్ళ తరువాత ట్రెండింగ్ లో 113 నిమిషాల నిడివి ఉన్న డార్క్ థ్రిల్లర్… నరాలు తెగే ఉత్కంఠ
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగే స్మగ్లింగ్ చుట్టూ కథ తిరుగుతుంది. వేల కోట్ల రూపాయల విలువైన బంగారం, మాదకద్రవ్యాలు, ఖరీదైన వస్తువులు విమానాశ్రయం ద్వారా దేశంలోకి ఎలా అక్రమంగా చేరుతున్నాయో ఈ సిరీస్ కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. ఇక కథలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ కుమార్ (అనురాగ్ సిన్హా) పెరిగిపోతున్న స్మగ్లింగ్‌ను అరికట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం గతంలో సస్పెండ్ అయిన సమర్థులైన అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకుంటాడు. ఈ స్పెషల్ టీమ్ కి అర్జున్ మీనా (ఇమ్రాన్ హష్మీ) నాయకత్వం వహిస్తాడు. అతనితో పాటు మిథాలీ కామత్ (అమృత ఖాన్విల్కర్), రవీందర్ గుజ్జర్ (నందీష్ సంధు) వంటి అధికారులు కలిసి పనిచేస్తారు.
విదేశాల్లో ఉంటూ భారతదేశంలో స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న బడా చౌదరి (శరద్ కేల్కర్) ఈ టీమ్‌కు ప్రధాన సవాలుగా మారుతాడు. అతని నెట్‌వర్క్ ఎంత బలంగా ఉంటుందంటే, కస్టమ్స్ అధికారుల కదలికలను ముందే పసిగట్టి ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటాడు. చివరికి కస్టమ్స్ అధికారులు బడా చౌదరిని పట్టు కుంటారా ?స్మగ్లింగ్ ని అరికడతారా ? అనేది ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.