E-Paper
Advertisement

Psycho Thriller OTT : ఏం సినిమా గురూ… క్షణక్షణం ఉత్కంఠ… అమ్మాయిలని వాడుకుని బ్రూటల్ మర్డర్స్… సైకోకి చెమటలు పట్టించే హీరో

Psycho Thriller OTT : ఏం సినిమా గురూ… క్షణక్షణం ఉత్కంఠ… అమ్మాయిలని వాడుకుని బ్రూటల్ మర్డర్స్… సైకోకి చెమటలు పట్టించే హీరో
Advertisement

Psycho Thriller OTT : కొన్ని సైకో థ్రిల్లర్ సినిమాలు ఎంత బ్రూటల్ గా ఉంటాయంటే చూడడం కష్టమే. అయినప్పటికే సైకో థ్రిల్లర్ సినిమాలు అంటే క్రేజీగా ఫీల్ అవుతారు చాలామంది. హార్రిఫిక్ సీన్స్ తో, సినిమాను చూస్తున్నంత సేపూ చెమటలు పట్టించేలా ఉండే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఓటీటీలో లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ వాటన్నింటి కంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మంచి సాటిస్ఫ్యాక్షన్ ఇస్తుంది. మరి ఈ మూవీ ఏంటి? ఓటీటీ డీటైల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2010లో వచ్చిన సౌత్ కొరియన్ సినిమా ‘ఐ సా ది డెవిల్’ (I Saw The Devil). ఇది ఇంటెన్స్ రివెంజ్ థ్రిల్లర్. కిమ్ జీ-వూన్ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాకు పార్క్ హూన్-జంగ్ స్క్రిప్ట్ రాశాడు. డైరెక్టర్ కిమ్ జీ-వూన్ ఇంతకు ముందు ‘ఎ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్’లాంటి హిట్స్ ఇచ్చాడు. సాధారణ థ్రిల్లర్ మూవీల్లా కాకుండా, ఇక్కడ హీరో-విలన్ మధ్య ఒక రకమైన టామ్ అండ్ జెర్రీ గేమ్ జరుగుతుంది. అన్ని సినిమాలలో సైకోనే చుక్కలు చూపిస్తాడు. కానీ ఇందులో మాత్రం సైకో కిల్లర్ కే చెమటలు పట్టిస్తాడు మన హీరో. 2 గంటల 24 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి. ఇందులో లీ బ్యుంగ్-హన్ (సీక్రెట్ ఏజెంట్ పాత్రలో), చోయ్ మిన్-సిక్ (సీరియల్ కిల్లర్‌గా) లీడ్స్ గా నటించారు. వీళ్లిద్దరి నటనే మూవీకి ప్రాణం. జియాన్ గుక్-హ్వాన్, చున్ హో-జిన్ వంటి వాళ్లు ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

భయంకరమైన హత్యతో కథ మొదలవుతుంది. ఒక సీరియల్ కిల్లర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేస్తాడు. ఆ అమ్మాయి భర్త సూయ్-హ్యున్ ఒక స్పెషల్ ఏజెంట్. ఈ విషయం తెలీక హత్య చేసిన కిల్లర్ కు ఇక్కడితో మూడింది. ప్రెగ్నెంట్ భార్యను చంపిన వాడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని హీరో డిసైడ్ అవుతాడు. కానీ సాధారణంగా చంపేసి ముగించకుండా, కిల్లర్‌ని పట్టుకుని టార్చర్ చేసి వదిలేస్తాడు. మళ్లీ పట్టుకుంటాడు, చావు దెబ్బలు కొడతాడు, వదిలేస్తాడు. ఇలా ఇద్దరి మధ్య ఒక డెడ్లీ డెత్ గేమ్ స్టార్ట్ అవుతుంది. కిల్లర్ కూడా స్మార్ట్ కాబట్టి, అతని సైడ్ నుండి కూడా కౌంటర్ అటాక్స్ వస్తాయి. మధ్యలో పోలీస్ ఇన్వాల్వ్‌మెంట్, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి. చివరికి ఈ ప్రతీకారం ఎలా ముగుస్తుంది ? అనేది క్లైమాక్స్. హింసాత్మక సీన్స్ చాలా ఉన్నాయి. గుండె బలంగా ఉన్నవాళ్లకే ఈ మూవీ సూట్ అవుతుంది. ఈ సినిమా రివెంజ్ థీమ్‌ని కొత్తగా చూపించింది. థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఐ ఫీస్ట్ అనుకోండి అంతే.

Read Also :  33 ఏళ్లు దాటిన పెళ్లికాని అమ్మాయి… ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సైలెంట్ స్ట్రీమింగ్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×