E-Paper
Advertisement

Single Salma OTT : 33 ఏళ్లు దాటిన పెళ్లికాని అమ్మాయి… ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సైలెంట్ స్ట్రీమింగ్

Single Salma OTT : 33 ఏళ్లు దాటిన పెళ్లికాని అమ్మాయి… ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సైలెంట్ స్ట్రీమింగ్
Advertisement

Single Salma OTT : రీసెంట్ గా థియేటర్లలో సందడి చేసిన ఓ రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

హ్యూమా కురేషీ హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ కామెడీ ‘సింగిల్ సల్మా’ సైలెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్స్‌లో అక్టోబర్ 31న రిలీజ్ అయింది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 లాంటి భారీ అంచనాలు ఉన్న రిలీజ్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్ హాలిడే కంటెంట్ ప్యాకేజ్‌లో భాగంగా తాజాగా డిసెంబర్ 26 నుంచి ఓటీటీలోకి అడుగు పెట్టింది. నచికేత్ సమంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మహిళల స్వాతంత్ర్యం, ట్రెడిషన్ vs ఇండిపెండెన్స్ అనే థీమ్స్ చుట్టూ సాగుతుంది. సల్మా ఫాదర్ నవాబ్ సాబ్‌గా కన్వల్‌జిత్ సింగ్, సీనియర్ కో-వర్కర్ మిసెస్ శ్రీవాస్తవ్‌గా నవ్ని పరిహార్, రత్నాగా నిధి సింగ్ నటించారు. లారెన్ గాట్‌లీబ్, ఆసిఫ్ ఖాన్ కీ రోల్స్ పోషించారు. సినిమా థియేటర్స్‌లో మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. 139 రన్ టైమ్ తో ఉన్న ఈ మూవీని ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూడొచ్చు.

Advertisement

Read Also :  కొత్తగా పెళ్ళైన జంటను టార్గెట్ చేసి చంపే సైకో… హనీమూన్ కు వెళ్ళే వాళ్ళు మిస్ అవ్వకుండా చూడాల్సిన సైకో థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

లక్నోకి చెందిన 33 ఏళ్ల ఇంజినీర్ సల్మా రిజ్వీ (హ్యూమా కురేషీ) చుట్టూ సాగుతుంది కథ. ఫ్యామిలీకి ఈ అమ్మాయే కొండంత అండ. పేరెంట్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మాత్రమే కాదు, చెల్లెళ్ల పెళ్లిళ్లు కూడా తనే చూసుకుంటుంది. అందుకోసం తన సంతోషాన్ని పక్కన పెట్టేస్తుంది. కుటుంబం కోసం ఇంతా చేస్తే… సమాజం మాత్రం ఆమెను “సింగిల్” అని జడ్జ్ చేస్తుంది. మ్యారేజ్ చేసుకోమని ప్రెజర్ చేస్తారు. ఇలాంటి సిచుయేషన్‌లో పేరెంట్స్ ఆమెకు సికందర్ ఖాన్ (శ్రేయాస్ తల్పాడే) అనే సింపుల్ బట్టల స్టోర్ ఓనర్‌ సంబంధాన్ని తీసుకొస్తారు. సికందర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్ సల్మాకు నచ్చుతుంది. కానీ అదే టైమ్ లో ఆమె లైఫ్‌లో మరో ట్విస్ట్ వస్తుంది.

Advertisement

2 మంత్స్ అసైన్‌మెంట్ కోసం ఆమె ఆఫీస్ వర్క్ మీద లండన్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక మీట్ సింగ్ (సన్నీ సింగ్) అనే అడ్వెంచరస్ అర్బన్ ప్లానర్ అండ్ DJను కలుస్తుంది. సింగ్ ఆమెకు ఇండిపెండెంట్ లైఫ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. దీంతో సల్మా ఆలోచనలో పడుతుంది. మరి ఆ తరువాత హీరోయిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇండిపెండెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకుందా ? లేదంటే తల్లిదండ్రులు చూపించిన సంబంధాన్ని చేసుకుందా ? అనేది మూవీలో చూడాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది. మరి ఓటీటీలో దీనికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×