E-Paper
Advertisement

Tata-Ernakulam train fire broke out: ఎర్నాకుళం రైలులో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం, ఒకరు మృతి

Tata-Ernakulam train fire broke out: ఎర్నాకుళం రైలులో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం, ఒకరు మృతి
Advertisement

Tata-Ernakulam train fire broke out: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి.దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఒకరు మృతి చెందారు. ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిప్రమాదం ఎలా జరిగింది?

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం

Advertisement

విశాఖ మీదుగా టాటా నుంచి ఎర్నాకుళం వెళ్లే ఎక్స్‌ప్రెస్ -18189 రైలులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సరిగ్గా ఒంటి గంటన్నర సమయంలో రైలులో ప్యాంట్రీ కారు పక్కనేవున్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలమంచిలి సమీపంలో ఓ పాయింట్‌ వద్ద లోకో పైలట్ మంటలను గుర్తించాడు. క్షణాల్లో రైలుని నిలిపివేశాడు.

ఈ ఘటన గురించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చేలోపే రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. పూర్తిగా కాలిపోయాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు వ్యాపించడంలో ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. రైలు ఆపగానే ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి స్టేషన్‌లోకి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో B1 బోగీలోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్‌గా గుర్తించారు అధికారులు.

Advertisement

అనకాపల్లి సమీపంలో ఘటన.. నిలిచిపోయిన పలు రైళ్లు

దట్టమైన పొగ వ్యాపించడంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నార్మల్‌గా టాటా నుంచి వచ్చే చాలా రైళ్లు ఆలస్యంగా వస్తుంటాయి. రైట్ సమయానికి అనకాపల్లికి రావాల్సిన ఈ రైలు నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. నర్సింగబల్లి స్టేషన్ సమీపంలో బీ1 ఏసీ బోగీకి బ్రేక్‌లు పట్టేసినట్టుల తెలుస్తోంది.

ఈ క్రమంలో ఒక్కసారిగా అగ్నికీలలు మొదలైనట్టు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఎలమంచిలి రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి. రాజమండ్రి నుంచి విశాఖ వెళ్లే రైళ్లను ఎలమంచిలి, తుని రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు.

ALSO READ: రూ500 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి, ఇకపై 14 ఫ్లాట్ ఫారాలు

అటు విశాఖ నుంచి రాజమండ్రి వెళ్లే రైళ్లను విశాఖ పరిసర ప్రాంతాల్లో నిలిపివేశారు అధికారులు. మరోవైపు బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట స్టేషన్‌కు ఆర్టీసీ బస్సుల్లో తరలించారు అధికారులు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×