E-Paper
Advertisement

ఏం సినిమా సామి… కిల్లర్ ఎవరో క్లైమాక్స్ వరకు తెలీదు… ప్రతి మలుపులో షాక్ ఇచ్చే ట్విస్టులు

ఏం సినిమా సామి… కిల్లర్ ఎవరో క్లైమాక్స్ వరకు తెలీదు… ప్రతి మలుపులో షాక్ ఇచ్చే ట్విస్టులు
Advertisement

Psychological crime thriller OTT: ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తోంది ఓటీటీలో. తక్కువ బడ్జెట్, తక్కువ మంది నటీనటులతో ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌ను తెరకెక్కించడంతో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఇది రొటీన్ క్రైమ్ సినిమాల కంటే చాలా భిన్నంగా ఉండి, గ్లోబల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ హాలీవుడ్ సినిమాలో రొమాన్స్ కంటే రాక్షసత్వం ఎక్కువ కనిపిస్తుంది. మీరు రొటీన్ సినిమాలకి బోర్ కొట్టి, ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

2023 లో వచ్చిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘స్ట్రేంజ్ డార్లింగ్’ (Strange Darling). జె.టి. మోల్నర్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ వెనుక ఉన్న అతిపెద్ద విశేషం దీని విజువల్ స్టైల్. హాలీవుడ్ నటుడు జియోవాని రిబిసి ఈ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా మారి, సినిమా మొత్తాన్ని పాత కాలపు 35mm ఫిలింపై తీశారు. అలాగే కథను వరుస క్రమంలో కాకుండా ఆరు చాప్టర్లుగా అటు ఇటు మార్చి చెప్పడం వల్ల, చివరి వరకు అసలు ఏం జరుగుతుందో ఊహించడం ప్రేక్షకులకు ఒక సవాల్‌గా మారుతుంది. అంతేకాదు హీరోయిన్ విల్లా ఫిట్జ్‌గెరాల్డ్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. క్లైమాక్స్ సీన్లలో ఆమె ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రేక్షకులను స్టన్ చేస్తాయి. ప్రస్తుతం ఈ సినిమాను జియో హాట్ స్టార్ (JioHotstar) ఉచితంగా చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video): సబ్‌స్క్రిప్షన్ ద్వారా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సినిమా క్లైమాక్స్ నుండి ప్రారంభమై నాన్-లీనియర్ శైలిలో నడుస్తుంది. ఆరు ఛాప్టర్లతో సాగే ఈ కథనం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ కథ ఒక అడవిలో ఒక రాత్రి మాత్రమే సరదాగా గడపాలనుకునే జంటతో మొదలవుతుంది. కథ మొదలవ్వగానే ఒంటినిండా రక్తంతో ఒక అమ్మాయి ప్రాణభయం తో పరిగెడుతుంటే, చేతిలో తుపాకీ పట్టుకుని ఒక వ్యక్తి ఆమెను వేటాడుతుంటాడు. వీళ్ళిద్దరికీ అసలు ఏంటి సంబంధం? ఒక హోటల్ రూమ్‌లో ఎంజాయ్ చేయడానికి కలిసిన ఈ జంట మధ్య గొడవ ఎందుకు మొదలైంది? అసలు ఆ అబ్బాయి ఒక సీరియల్ కిల్లరా లేక ఆ అమ్మాయే అతడిని ఏదైనా ఇరికించిందా? అనే పాయింట్స్ చస్తున్నవాళ్ళకి వస్తూనే ఉంటాయి.

ఇక ఈ సినిమాలో అసలైన మజా ఇందులో వచ్చే ట్విస్టుల్లోనే ఉంటుంది. ఈ కథను వరుసగా కాకుండా, ముక్కలు ముక్కలుగా చూపిస్తారు. మనం మొదట ఒకరిని బాధితుడు అని, ఇంకొకరిని విలన్ అని అనుకుంటాం. కానీ ఒక్కో చాప్టర్ ఓపెన్ అయ్యేకొద్దీ అసలు కథ రివర్స్ అవుతుంది. మనం ఊహించిన దానికి పూర్తి ఉల్టాగా సీన్లు మారుతుంటాయి. ఆఖరికి ఎవరు ఎవరిని ట్రాప్ లో పడేసారు ? చావు తప్పించుకుని ఎవరు గెలిచారు ? అనేది మైండ్ పోయేలా ఉంటుంది.

Advertisement

Read Also : నమ్మినోల్లే నట్టేట ముంచే ఘోరమైన మోసం… మత్తులో ఉన్న అమ్మాయితో… చిన్న పిల్లలు చూడకూడని సినిమా

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×