Bank Fraud: స్వేచ్ఛ బ్యూరో: దేవరకొండ(ఎస్ బీఐ) అగ్రికల్చర్ కమర్షియల్ బ్రాంచ్ కాంట్రాక్ట్ బేసిక్ హౌస్ కీపింగ్ ఉద్యోగి.. ఇదే శాఖలో సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ కలసి ఇన్ యాక్టివ్ ఖాతాలను గుర్తించి కేవైసీ అప్డేట్ చేసి అక్రమంగా నగదు బదిలీ చేసి ఘరాన మోసానికి తెర తీసిన బ్యాంకు మేనేజర్, మరో కాంట్రాక్టు ఉద్యోగి సహా నలుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నల్గొండ జిల్లా ఎస్పీ మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలను వెల్లడించారు. దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఎస్ బీ ఐ లో గడిచిన ఐదేళ్లుగా లెండల చక్రపాణి కాంట్రాక్ట్ బేసిక్ హౌస్ కీపింగ్ ఉద్యోగిగా చేస్తున్నట్లు చెప్పారు.
సదరు చక్రపానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో బ్యాంకు ఖాతాల నిర్వహణపై అవగాహన రాగా సూర్యాపేట బ్రాంచ్ ఎస్ బీఐలో మేనేజర్ గా ఉన్నటువంటి పుట్ట వెంకట రామాంజనేయులు తో కలిసి.. ఇన్ యాక్టివ్ గా ఉన్న 10 బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఆ ఖాతాదారులపేరు, చిరునామ, ఆధార్, పాస్ ఫోటో, సంతకాలను సేకరించారు. రేఖ ప్రింట్, ఇంప్రొ సైట్ తో ఫేక్ ఆధార్, పాన్ కార్డులను తయారు చేసిండ్రు. బ్రాంచ్ ఉద్యోగులు లాగిన్ తీరును గమనించారు. వివిధ బ్యాంకు లావాదేవీల బిజీలో ఉన్న టైంలో ఉద్యోగుల కంప్యూటర్లలో లాగిన్ చేసి ఆ ఖాతాలకు కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసినట్లు చెప్పారు. యోనో యాప్ ద్వార కొత్త యూజర్ ఐడీ, పాస్వర్డ్, పిన్ సృష్టించినట్లు చెప్పారు. ఇన్ ఆక్టివ్ ఖాతాలను జనరేట్ చేసిన నిందితులు పలువురికి చెందిన ఎస్ బీఐ ఖాతాల నుంచి దశలవారీగా రూ. 2.65 కోట్ల నగదును పరిచయమున్న వ్యక్తుల ఖాతాలకు ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ చేసినట్లు చెప్పారు.
Also Read: Photos of the deceased: మరణించిన వారి ఫోటోలు ఇంట్లో పెడితే అరిష్టా… అదృష్టమా..?
నిందితులు ఇన్ యాక్టివ్ ఖాతాలను అప్డేట్ చేసి అక్రమంగా నగదు బదిలీ వేళ ఎస్ బీఐ బ్రాంచ్ కి చెందిన పల్లటి నరేందర్ అనే కస్టమర్ కేవైసీ అప్డేట్ చేసిన వేళ ఆ ఖాతాదారునికి ఈ మెయిల్ కు అలర్ట్ మెసేజ్ వెళ్లింది. దీంతో దేవరకొండ, సూర్యాపేట ఎస్ బీఐ కేంద్రాలుగా సాగుతున్న అక్రమ నగదు బదిలీల బాగోతం బయటపడింది. దేవరకొండ బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవపూడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దేవరకొండ పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టి సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ పుట్టా వెంకట రామాంజనేయులు, దేవరకొండ బ్రాంచ్ కాంట్రాక్టు ఉద్యోగి లెండల చక్రపాణి, సహకరించిన కేతావత్ రామ్ లాల్ మారేపల్లి శివను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు చెప్పారు. నిందితులనుంచి రూ. 2.42 కోట్ల నగదు, ఆర్ సెల్ ఫోన్లు లాప్ ట్యా ప్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దేవరకొండ డిఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.
Also read: తెలంగాణకు గుడ్ న్యూస్, 8 కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్!