E-Paper
Advertisement

అప్పుల్లో కూరుకుపోయి ఆత్మతో ఆటలు… చేతబడితో వణికించే డెడ్లీ డెత్ ట్రాప్

అప్పుల్లో కూరుకుపోయి ఆత్మతో ఆటలు… చేతబడితో వణికించే డెడ్లీ డెత్ ట్రాప్
Advertisement

Psychological horror movie OTT : మూఢనమ్మకాల వల్ల ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో గతంలో జరిగిన ఒక సంచలన కేసు (తల్లిదండ్రులే క్షుద్ర పూజల పేరుతో తమ పిల్లలను చంపుకున్న ఘటన) ఆధారంగా తెలుగులో ఒక సినిమాను రూపొందించారు. చదువుకున్న వాళ్ళు కూడా క్షుద్ర శక్తులపై ఆశతో ఎంతటి దారుణాలకు ఒడిగడతారో, మూఢనమ్మకాలు ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తాయో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇందులో నిజంగానే దెయ్యం ఉందా లేక మానసిక ప్రభావం వల్ల అలా జరుగుతుందా ? అనే సస్పెన్స్ ప్రేక్షకులను సినిమా చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తుంది. ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను బాగానే భయపెడుతోంది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సైకలాజికల్‌ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హనీ’ (Honey). ‘పలాస’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో నవీన్‌ చంద్ర, దివ్య పిళ్లై జయాని, రాజా రవీంద్ర నటించారు. ఇందులో నవీన్ చంద్ర తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఒక మామూలు తండ్రి క్షుద్ర పూజల వల్ల పిచ్చివాడిగా మారే క్రమంలో ఆయన చూపించిన వేరియేషన్స్ అద్భుతంగా ఉంటాయి. అలాగే చిన్నారి జయాని నటన సినిమాకు ప్రాణం పోసింది. దీనిని Amazon Prime Videoలో తెలుగు వెర్షన్ సబ్‌స్క్రిప్షన్‌తో చూడవచ్చు. Sun NXTలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.Airtel Xstream Playలో హిందీ, తమిళ వెర్షన్లు స్ట్రీమ్ అవుతున్నాయి. దీనిని ఒరిజినల్‌గా తెలుగులో తీసినప్పటికీ, దీనికి ఉన్న క్రేజ్ వల్ల తమిళం, హిందీ, కన్నడ భాషల్లోకి కూడా డబ్ చేశారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆనంద్ (నవీన్ చంద్ర) ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. తను చేసే వ్యాపారాల్లో నష్టాలు వచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. తనకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి ఎలాగైనా బయటపడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆ క్రమంలోనే అతనికి ఒక తాంత్రికుడు పరిచయమై, క్షుద్ర పూజలు చేస్తే అపారమైన ధనవంతుడివి అవుతావని నమ్మిస్తాడు. ఆ మాటలు నమ్మిన ఆనంద్, తన కష్టాలు తీరతాయనే ఆశతో గుడ్డిగా పిల్లి మాయ అనే తాంత్రిక విద్యల వైపు మళ్లుతాడు. అయితే ఈ పూజల కోసం ఆనంద్ తన భార్య లలిత, చిన్న కూతురు మీరాను కూడా బలవంతంగా ఆ క్షుద్ర పూజల్లో భాగం చేస్తాడు. తన ఇంట్లోనే వింత వింత ఆచారాలు చేస్తూ, తన భార్యను వేధిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే వాళ్ళ కూతురు మీరా ప్రవర్తన వింతగా మారుతుంది. తను ఎవరికీ కనిపించని ‘హనీ’ అనే ఒక అదృశ్య శక్తితో మాట్లాడుతున్నానని, అది తన స్నేహితురాలని చెప్పడంతో ఇంట్లో పరిస్థితులు మరింత భయంకరంగా మారుతాయి. అసలు మీరా మాట్లాడుతున్న ఆ ‘హనీ’ ఎవరు? ఆనంద్ చేస్తున్న పూజల వల్ల ఆ కుటుంబానికి పట్టిన గతి ఏంటి? అనేదే మిగిలిన కథ. మదనపల్లెలో గతంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా, సైకలాజికల్ డిజార్డర్స్ ఒక నిండు కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తాయనే విషయాన్ని ఈ సినిమాలో చాలా భయంకరంగా చూపించారు.

Advertisement

Read Also : క్లైమాక్స్ వరకు థ్రిల్ ఇచ్చే పక్కా మిస్టరీ తోపు సిరీస్ లు… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×