E-Paper
Advertisement

క్లైమాక్స్ వరకు థ్రిల్ ఇచ్చే పక్కా మిస్టరీ తోపు సిరీస్ లు… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

క్లైమాక్స్ వరకు థ్రిల్ ఇచ్చే పక్కా మిస్టరీ తోపు సిరీస్ లు… ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Best Mystery Thriller Series : వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఓటీటీని ఏలుతున్న సంగతి తెలిసిందే. ఇక వీటిలో థ్రిల్లర్ కంటెంట్ ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే వీటిలో కూడా కొన్ని క్లైమాక్స్ వరకు ఊపిరి బిగబట్టేలా చేసే మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని కుర్చీలకు కట్టిపడేసేలా ఉంటాయి అవి. అలాంటి ఆరు సిరీస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఓటీటీని షేక్ చేసినవే. వాటి పేర్లు ? అవి ఏ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

1. బ్రాడ్‌చర్చ్ (Broadchurch: 2013–2017)

ఒక ప్రశాంతమైన ఊరిలో ఒక పిల్లాడు చనిపోతే, ఆ ఊర్లో వాళ్లందరూ ఒకరినొకరు ఎలా అనుమానించుకున్నారు అన్నదే ఈ కథ. ఇందులో ఇన్వెస్టిగేషన్ చేసే ఇద్దరు ఆఫీసర్ల మధ్య వచ్చే సీన్లు, ఆ ఊరి జనాల సీక్రెట్స్ బయటపడుతుంటే వచ్చే ట్విస్టులు మైండ్ బ్లోయింగ్ అయ్యేలా ఉంటాయి. ఇక క్లైమాక్స్‌లో హంతకుడు ఎవరో తెలిశాక మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఇది స్ట్రీమింగ్ లో ఉంది.

2. మైండ్‌హంటర్ (Mindhunter: 2017–2019)

Advertisement

ఇది మిగతా క్రైమ్ సిరీస్‌ల లాగా ఉండదు. ఇందులో ఇద్దరు ఎఫ్‌బిఐ ఆఫీసర్లు జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్లను కలిసి ఇంటర్వ్యూలు చేస్తారు. వాళ్లు అసలు హత్యలు ఎందుకు చేశారు? ఆ టైంలో వాళ్ల ఫీలింగ్ ఏంటి? అని రీసెర్చ్ చేస్తారు. కిల్లర్ల సైకాలజీని అర్థం చేసుకోవడం ఇందులో మెయిన్ థ్రిల్. డైలాగ్స్ తోనే టెన్షన్ పుట్టిస్తారు ఇందులో. ఇది యాక్షన్ కంటే కూడా సైకలాజికల్ థ్రిల్‌ను ఎక్కువగా ఇస్తుంది. Netflixలో ఇది అందుబాటులో ఉంది.

3. లాస్ట్ (Lost: 2004–2010)

ఒక విమానం ఒక వింత ద్వీపంలో కూలిపోతుంది. బ్రతికి ఉన్న ప్రయాణీకులు ఆ ద్వీపం నుండి ఎలా బయటపడ్డారు అనేదే కథ. కానీ ఆ ద్వీపంలో దాగున్న మిస్టరీలు, టైం ట్రావెల్ ఎలిమెంట్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. Jio Hotstarలో ఇది అందుబాటులో ఉంది.

4. ట్రూ డిటెక్టివ్ (True Detective: 2014)

Advertisement

మీరు సీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడితే ఇది బెస్ట్ ఛాయిస్. ఒక వింతైన హత్యను ఇన్వెస్టిగేట్ చేసే ఇద్దరు పోలీసుల కథ ఇది. కథ 17 ఏళ్ల కాలంలో సాగుతుంది. ఇందులో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా డార్క్‌గా ఉండి మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మాథ్యూ మెక్కోనాఘే యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంటుంది. థ్రిల్లర్ సిరీస్ లలో ఇదొక మాస్టర్ పీస్. Jio hotstarలో ఇది అందుబాటులో ఉంది.

5. సెవెరెన్స్ (Severance: 2022)

ఇది ఒక యునిక్ కాన్సెప్ట్. ఒక కంపెనీలో పని చేసే వాళ్ల మెమరీని సర్జరీతో మార్చేస్తారు. అంటే మీరు ఆఫీసులోకి వెళ్ళగానే ఇంటి విషయాలు ఏవీ గుర్తుండవు, మళ్ళీ ఆఫీస్ నుంచి బయటకు రాగానే ఆఫీసులో ఏం జరిగిందో గుర్తుండదు. అసలు ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? లోపల ఏం జరుగుతోంది? అన్నది సెకండ్ సెకండ్ కి సస్పెన్స్. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. Apple TV+లో ఇది అందుబాటులో ఉంది.

6. డార్క్ (Dark: 2017–2020)

మిస్టరీ సిరీస్‌లలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ను ఇంత అద్భుతంగా మరే సిరీస్ చూపించలేదు. మూడు తరాల కుటుంబాల మధ్య ఉన్న సంబంధం, ఒక చిన్నారి అదృశ్యం చుట్టూ సాగే ఈ జర్మన్ సిరీస్ మీ బుర్ర పాడు చేస్తుంది. ఇది చూస్తున్నప్పుడు మీరు ఒక పేపర్, పెన్ను పట్టుకుని రిలేషన్స్ రాసుకోవాల్సిందే. క్లైమాక్స్ చూశాక మీరు ఒక రెండు రోజులు ఆ షాక్ నుంచి బయటకు రాలేరు. నెట్‌ఫ్లిక్స్ లో ఇది అందుబాటులో ఉంది.

Read Also : ఇంట్లో ఉండి విసుగు వస్తోందా ? IMDbలో అదిరిపోయే రేటింగ్‌ ఉన్న ఈ సినిమాలు సిరీస్‌లపై ఒక లుక్కేయండి

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×