E-Paper
Advertisement

ప్రేమించుకున్నారు.. ఆపై పెళ్లి చేసుకున్నారు, వెంటాడిన భూతం.. కేవలం నెల రోజులకే

ప్రేమించుకున్నారు.. ఆపై పెళ్లి చేసుకున్నారు, వెంటాడిన భూతం.. కేవలం నెల రోజులకే
Advertisement

Siddipet:  వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలను అనుకున్నారు. ఒకరికి 21 ఏళ్లు.. మరొకరికి 23 ఏళ్లు.  ఏదో విధంగా పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. ప్రేమించుకునే సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకునేవారు.. వివాహం తర్వాత లైన్ తప్పింది. వీరిద్దరి మధ్యంలోకి అనుమానం అనే భూతం ఎంటరైంది. ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సిద్ధిపేట్‌ జిల్లాలో వెలుగుచూసింది.

సిద్ధిపేట్ జిల్లాలో దారుణం.. కొత్త దంపతులను వెంటాడిన అనుమానం భూతం

Advertisement

సిద్దిపేట్ జిల్లా కొండపాక గ్రామానికి చెందిన అంజలి దర్జీ పని చేసేది. ఆ జిల్లాలోని కొమురవెల్లి గ్రామానికి చెందిన వినయ్‌తో పరిచయం ఏర్పడింది. దాదాపు ఏడాదిపాటు ప్రేమించుకున్నారు. ఆ సమయంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేవారు. ప్రేమ విషయం ఇద్దరు తమతమ తల్లిదండ్రుల వద్ద చెప్పారు. చివరకు ఏప్రిల్ 9న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ఈ జంట కాపురంలోకి అనుమానం అనే భూతం ఎంటరైంది. వివాహం జరిగిన రెండువారాలకు అంజలి ఎవరితో ఫోన్‌లో మాట్లాడడం కనిపించింది. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానించాడు భర్త. చివరకు దంపతుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఫలితంగా మే 7న భార్యని పుట్టింటికి తీసుకెళ్లి అక్కడే వదిలిపెట్టాడు.

Advertisement

పెళ్లైన నెలరోజులకే ఈ లోకాన్ని విడిచిపెట్టిన దంపతులు

దూరంగా ఉన్న దంపతుల మధ్య పెరగాల్సిన అభిమానం కాస్త కోపంగా మారింది. భార్యకు పలుమార్లు ఫోన్‌ చేసినా పట్టించుకునేది కాదు. ఫోన్‌లో భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. భర్త వేధింపులు భరించలేదక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణం తీసుకుంది అంజలి.

పని నిమిత్తం హైదరాబాద్‌‌కి తిరిగి వస్తున్నాడు వినయ్. ఆ సమయంలో భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాక్ అయ్యాడు. కుకునూరుపల్లి మండలం రాయవరం గ్రామంలోని రాగానే వినయ్ తన తండ్రికి ఫోన్‌ చేశాడు. కోడలు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చెప్పినట్ట తెలుస్తోంది.

ALSO READ: సినీ పరిశ్రమలో విషాదం.. హీరో, కెమెరామెన్ దుర్మరణం!

మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఆపై ఫోన్ కట్ చేశాడు. తన ఫ్రెండ్స్‌కి ఉన్న లోకేషన్‌ షేర్ చేశాడు. సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు వినయ్‌. వెంటనే కుటుంబ సభ్యులు వెళ్లేసరికి చనిపోయాడు చనిపోయాడు వినయ్. పైవిషయాలు పోలీసులు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×