E-Paper
Advertisement

Psychological horror movie OTT: అమ్మాయికి నరకం చూపించే అత్త… రాత్రయితే మరీ దారుణం… ఇది పెద్దలకు మాత్రమే

Psychological horror movie OTT: అమ్మాయికి నరకం చూపించే అత్త… రాత్రయితే మరీ దారుణం… ఇది పెద్దలకు మాత్రమే
Advertisement

Psychological horror movie OTT : కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు దెయ్యాల సినిమాలు కూడా దిగుదుడుపే అనిపిస్తుంది. ఈ సినిమాలలో హింస అంత దారుణంగా ఉంటుంది మరి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ లో హింసను చూస్తే, మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అనిపిస్తుంది. రియల్ సంఘటనల ఆధారంగా తరికెక్కిన ఈ సినిమాలో ఒక అమ్మాయిని వేధించే సీన్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఇది 1965లో నిజంగా జరిగిన సిల్వియా లైకెన్స్ అనే అమ్మాయి కేసు ఆధారంగా తీశారు. ఈ సినిమాను ఒంటరిగానే చూడడం మంచిది. చూడకపోతే మరీ మంచిది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్  

ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘ది గర్ల్ నెక్స్ట్ డోర్’ (The Girl Next Door). గ్రెగొరీ M. విల్సన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది 1965లో సిల్వియా లైకెన్స్‌ అనే అమ్మాయి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందింది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన నేరాలలో ఒకటి. ఇందులో బ్లైత్ ఆఫర్థ్ (మెగ్ పాత్రలో), బ్లాంచే బేకర్ (రూత్ పాత్రలో) అద్భుతంగా నటించారు. ఇందులోని హింస మరీ ఎక్కువగా ఉండటం వల్ల విమర్శలు కూడా మూట గట్టుకుంది ఈ మూవీ. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. 1958లో మేగ్, ఆమె చెల్లెలు సుసాన్ అనే ఇద్దరు అమ్మాయిలు ఒక యాక్సిడెంట్‌లో పేరెంట్స్‌ని కోల్పోతారు. దాంతో వాళ్ళు తమ అత్త రూత్ చాండ్లర్ దగ్గరికి వస్తారు. రూత్‌కు ముగ్గురు కొడుకులు. ఆమెకు ఆడపిల్లలు అంటే అస్సలు నచ్చదు, ముఖ్యంగా మేగ్ అందంగా, బుద్ధిగా ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది. మెల్లగా మేగ్ మీద కోపం పెంచుకుని, ఆమెను ఇంటి కింద ఉండే బేస్‌మెంట్‌లో బంధించేస్తుంది.

ఇక అక్కడి నుంచి అసలైన నరకం మొదలవుతుంది. రూత్ ఒక రాక్షసిలా మారి మేగ్‌ను విపరీతంగా కొడుతుంది. అంతటితో ఆగకుండా, తన కొడుకులను, పక్కింటి పిల్లలను కూడా పిలిచి, మేగ్‌ను మీకు నచ్చినట్లు హింసించండని ఎంకరేజ్ చేస్తుంది కూడా. ఆ పిల్లలు కూడా చిన్నవయసు అని చూడకుండా రూత్ మాటలు విని మేగ్‌ను చాలా దారుణంగా వేధిస్తారు. పక్కింటి అబ్బాయి డేవిడ్ ఇదంతా చూసి షాక్ అవుతాడు. మేగ్ పడుతున్న బాధను చూసి అతనికి ఏడుపు వస్తుంది. కాపాడాలని ఉన్నా రూత్ అంటే భయంతో ఏమీ చేయలేకపోతాడు. ఆ హింస కూడ భరించలేనంత స్థాయికి వెళ్తుంది. చివరికి మేగ్ ఆ నరకం నుంచి బయటపడుతుందా ? ఆ దారుణాలకు బలైపోతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : అమెజాన్ అడవుల్లో హడలెత్తించే అడ్వెంచర్… ప్రాణాలు అరచేతిలో… ఉత్కంఠ రేపే ప్రతీ సీన్

Related News

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

Big Stories

Advertisement
×