E-Paper
Advertisement

Kuwait: కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి, షాకైన పేరెంట్స్

Kuwait: కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి, షాకైన పేరెంట్స్
Advertisement

Kuwait: ఇరాన్‌‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం జఠిలమవుతోంది.  ఆయా దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకూ గల్ఫ్‌‌‌లో ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. దీంతో అక్కడున్న తెలుగువారు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే మిస్సైళ్లు ఎక్కడ పడతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మిస్సైళ్ల శబ్దాలకు ఏపీకి చెందిన ఓ యువకుడు అక్కడ మృతి చెందారు. అసలేం జరిగింది?

కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి

Advertisement

ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేని మృతితో ప్రతీకార దాడులకు తెగబడుతోంది ఇరాన్. దీంతో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడులకు దిగాయి. అటు ఇరాన్ కూడా ఆయా దేశాలపై ఎదురుదాడులకు దిగింది. ఫలితంగా గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైళ్ల దాడులు తీవ్రతరం చేసింది.

తాజాగా కువైట్‌లో బాంబుల మోతతో ఓ తెలుగు వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఏపీలోని పాలకొల్లు ప్రాంతానికి చెందినవాడు. మృతుడు రాజేష్‌గా గుర్తించారు. ఉపాది కోసం ఎనిమిది నెలల కిందట కువైట్ వెళ్లాడు రాజేష్. అక్కడికి వెళ్లిన నాలుగు నెలల తర్వాత అక్కడ ఉపాధి లభించింది.

Advertisement

మృతుడి సొంతూరు పాలకొల్లు.. కొడుకు డెడ్‌బాడీని రప్పించాలని  పేరెంట్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి

గడిచిన ఐదు రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాడు రాజేష్. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఉండలేనని, వచ్చేస్తానని చెప్పాడు. ఇప్పుడు రావడం మంచిదికాదని, యుద్ధం ముగిసిన తర్వాత రావాలని, ఈ విషయంలో కంగారు పడవద్దని రాజేష్‌కి తల్లిదండ్రులు సూచన చేశారు.

సరేనని అన్నాడు.. ఈలోగా మిస్సైళ్ల శబ్దాలతో రాజేష్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే సమీపంలోకి దగ్గర వ్యక్తులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికి రాజేష్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ విషయాన్ని అక్కడివారు రాజేష్ తల్లిదండ్రులకు తెలిపారు. ఈ వార్త విని ఒక్కసారిగా షాకయ్యారు.

ALSO READ: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఆ జిల్లాలకు అలర్ట్

రాజేష్ తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పాలకొల్లులో ఉండగా, రెండో కొడుకు ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మొదట నాలుగు నెలలు ఖాళీగా ఉన్నాడని, ఆ తర్వాత పని దొరికిందని చెప్పారు మృతుడి తల్లిదండ్రులు. బాంబు శబ్దాలకు భయపడి గుండెపోటుతో మరణించినట్టు తెలిపాడు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇక్కడకు రప్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు విజ్ఞప్తి చేశాడు. ఎలాగైనా మా కొడుకుని సొంతూరుకు రప్పించాలని కన్నీరుమున్నీరు అవుతున్నారు రాజేష్ తల్లిదండ్రులు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×