E-Paper
Advertisement

ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న మైండ్ బెండింగ్ సైకలాజికల్ హారర్… ఏ ఓటీటీలో ఉందంటే ?

ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న మైండ్ బెండింగ్ సైకలాజికల్ హారర్… ఏ ఓటీటీలో ఉందంటే ?
Advertisement

Psychological Horror Thriller: భర్తను కోల్పోయిన ఓ గర్భవతి… తన భర్త కుటుంబం ఆహ్వానం మేరకు వాళ్ల ఎస్టేట్‌ కు వెళ్తుంది. మొదట అక్కడ తనకు, పుట్టబోయే బిడ్డకు పూర్తి భద్రత ఉంటుందని అనుకుంటుంది. కానీ కొద్దిరోజుల్లోనే ఇంట్లో ఏదో తేడా ఉందని ఆమెకు అనిపించడం మొదలవుతుంది. తన బిడ్డపై ఆ కుటుంబానికి ఉన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతుంటే, అసలు వాళ్ల ఉద్దేశం ఏంటో అర్థం కాక భయపడుతుంది. బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా అదే ఇంట్లో చిక్కుకుపోయిన ఆమెకు ఒక్కో క్షణం ప్రాణాల మీదకు వస్తుంటే ? తాను చూస్తున్నది నిజమేనా, లేక భయంతో తనకే భ్రమలు కలుగుతున్నాయా ? ఇలాంటి మైండ్ బెండింగ్ సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ‘Confinement’ మూవీ ఇప్పుడు డిజిటల్‌ లోకి వచ్చింది. మరి ఆ ఇంట్లో దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి ? పుట్టబోయే బిడ్డను వాళ్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

స్టెల్లా భర్తను కోల్పోయిన గర్భవతి. పరిస్థితుల కారణంగా ఆమె తన భర్తకు దూరమైన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. వాళ్లు ఆమెను తమ గ్రామీణ ప్రాంతంలోని పెద్ద ఇంటికి తీసుకెళ్తారు. మొదట వాళ్ల ప్రవర్తనలో స్టెల్లాకు ఎలాంటి అనుమానం రాదు. తనకు, తన కడుపులోని బిడ్డకు వాళ్లు అండగా ఉంటారని భావిస్తుంది.

Advertisement

కానీ అక్కడ ఉన్న కొద్దీ వాతావరణం మారిపోతుంది. ఇంట్లోని ప్రతి గది, ప్రతి వ్యక్తి ప్రవర్తన ఆమెకు అనుమానాస్పదంగా కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా తన పుట్టబోయే బిడ్డ గురించి కుటుంబ సభ్యులు చూపించే ఆసక్తి ఆమెను మరింత కలవర పెడుతుంది. తాను ఆ ఇంట్లో అతిథిగా ఉన్నానా ? లేక ఏదో ప్లాన్‌ లో భాగంగా అక్కడికి తీసుకొచ్చారా ? అనే అనుమానం మొదలవుతుంది.

ఇంతలో ఇంట్లో జరిగే వింత సంఘటనలు ఆమె భయాన్ని మరింత పెంచుతాయి. బయటకు వెళ్లడానికి ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించవు. తన చుట్టూ ఉన్న వాళ్లను నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు తన బిడ్డను కాపాడుకోవాలి, మరోవైపు తాను కూడా ప్రాణాలతో బయటపడాలి. కానీ అసలు ప్రమాదం బయట ఉందా ? లేక తాను ఉంటున్న ఇంట్లోనే దాగి ఉందా ? ఆ కుటుంబం దాచిన రహస్యం ఏంటి ? స్టెల్లా బిడ్డపై వాళ్లకు అంత ఆసక్తి ఎందుకు ? ఆమెను అక్కడే ఉంచడానికి అసలు కారణం ఏంటి ? చివరికి తనకు, తన బిడ్డకు ఎదురయ్యే ప్రమాదం నుంచి స్టెల్లా ఎలా బయట పడుతుంది ? అనేదే ఈ హారర్ థ్రిల్లర్‌లో చూడాల్సిన అసలు ట్విస్ట్.

తెలుగులో అందుబాటులో ఉందా ?

Advertisement

పీటర్ హోవిట్ దర్శకత్వం వహించిన ‘కన్ఫైన్మెంట్’లో నథాలీ ఇమ్మాన్యుయేల్, బెన్ క్యూరా, ఎలోయిస్ లవెల్ ఆండర్సన్, క్లేర్ ఫోర్లానీ, చార్లీ హిస్కాక్ తదితరులు నటించారు. ఈ సినిమా సుమారు 89 నిమిషాల నిడివితో రూపొందిన హారర్, థ్రిల్లర్ మూవీ. 2026 సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. Prime Videoలో ఇది రెంట్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. సైకలాజికల్ హారర్, ఇంట్లోనే చిక్కుకుపోయిన పాత్ర, కుటుంబ రహస్యాలు, బిడ్డను కాపాడుకునే సర్వైవల్ డ్రామాతో ఇది ఒక మంచి సీట్ ఎడ్జ్ వాచ్ అవుతుంది.

Read Also: పగటిపూట సాధువులు, రాత్రికి సైకోలు… గూస్‌బంప్స్ తెప్పించే క్రైమ్ థ్రిల్లర్

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×