E-Paper
Advertisement

Psychological horror thriller : ఎదుటివాడి మైండ్‌తో ఆడుకునే సైకో దెయ్యం… నవ్వుతూ చచ్చే మనుషులు… జడిపించే సీన్లు

Psychological horror thriller : ఎదుటివాడి మైండ్‌తో ఆడుకునే సైకో దెయ్యం… నవ్వుతూ చచ్చే మనుషులు… జడిపించే సీన్లు
Advertisement

Psychological horror thriller : థ్రిల్లర్ సినిమాలకి ఫ్యాన్స్ ఎక్కువే. ఏ భాషలో వచ్చినా కంటెంట్ బాగుంటే మాత్రం అసలు వదిలిపెట్టరు ప్రేక్షకులు. వీటిలో కొన్ని సినిమాలు సీట్ ఎడ్జ్ కు తీసుకెళ్తుంటాయి. అలాంటి కంటెంట్ సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాను చూస్తే బుర్ర ఖరాబ్ అవ్వడం ఖాయం. ఈ సినిమాలో ఒక స్మైలీ దెయ్యం ఉంటుంది. దీన్ని బారిన పడ్డవాళ్ళు ఒక స్మైల్ ఇస్తూ, ఏదో ఒక రూపంలో చచ్చిపోతుంటారు. ఈ సినిమాను రాత్రిపూట చూడకపోవడమే మంచిది. ఒకవేళ చూడాలనుకుంటే కొంచెం గుండె గట్టిగా పెట్టుకొని చూడండి.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ సైకలాజికల్ హారర్ చిత్రం పేరు ‘స్మైల్ 2’ (Smile 2). ఇందులో నవోమి స్కాట్ (ప్రధాన పాత్ర), రోజ్మేరీ డెవిట్, ల్యూకాస్ గేజ్ మరియు కైల్ గాల్నర్ నటించారు. దీనిని పార్కర్ ఫిన్ దర్శకత్వంలో పారామౌంట్ పిక్చర్స్ నిర్మించింది. ఇది 2024 అక్టోబర్ 18న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు $138 మిలియన్ల (దాదాపు ₹1,150 కోట్లు) వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇందులో నవోమి స్కాట్ నటనకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది Paramount+, Amazon Prime Video, Apple TV లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘స్మైల్ 3’ (Smile 3) కూడా ప్రస్తుతం చర్చల దశలో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

స్కై రిలే అనే ఒక యువతి పెద్ద సింగర్. ఆమె గతం కొంచెం ట్రాజెడీగా సాగింది. అయితే ఆ పాత గాయాల నుండి కోలుకుని మళ్ళీ షోలు చేద్దామని రెడీ అవుద్ది. కొంచం డ్రగ్స్ తీసుకుందామని, అదే టైమ్‌లో తన ఫ్రెండ్ లూయిస్ దగ్గరికి వెళ్తుంది. అయితే అతను డ్రగ్స్ మత్తులో ఉండి, సడన్‌గా దెయ్యం పట్టినట్టు ఒక వెర్రి నవ్వు నవ్వి, తన కళ్లముందే తల పచ్చడి చేసుకుని చచ్చిపోతాడు. ఆ చావును కళ్ళారా చూసినప్పటి నుండి ఈ పిల్లకి అసలు సినిమా మొదలవుద్ది. ఇక ఆ నవ్వు దెయ్యం లూయిస్ నుండి ఈ పిల్లకి అంటుకుంటుంది.

ఇక అక్కడి నుండి సింగర్ పాపకి ఎక్కడ చూసినా ఆ నవ్వు మొఖాలే కనిపిస్తాయి. స్టేజ్ మీద ఉన్నా, పబ్లిక్ లో ఉన్నా.. ఎవడో ఒకడు వింతగా నవ్వుతూ కనిపిస్తుంటే ఈమెకు పిచ్చెక్కిపోద్ది. అది దెయ్యమో లేక తన భ్రమనో అర్థం కాక, జనం ముందు పిచ్చి పిచ్చిగా వాగుతూ పరువు కూడా పోగొట్టుకుంటుంది. ఎవడికి చెప్పినా నమ్మరు, పైగా ఈమెకి మళ్ళీ మత్తు అలవాటు అయిందని అందరూ ఆడిపోసుకుంటారు. పాపం ఆ దెయ్యం పెట్టే టార్చర్ తో క్లైమాక్స్ మరింత ఘోరంగా మారుతుంది. చివరికి ఆ ఆమ్మాయి, నవ్వు దెయ్యం నుంచి తప్పించుకుంటుందా ? దానికే బలైపోతుందా ? అసలు ఆ దెయ్యం కాన్సెప్ట్ ఏమిటి ? అనే విషయాలను,ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న నానా పటేకర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×