E-Paper
Advertisement

Survival thriller OTT : దీవిలో చిక్కుకునే జంట… భయపెట్టే సర్వైవల్ థ్రిల్లర్

Survival thriller OTT : దీవిలో చిక్కుకునే జంట… భయపెట్టే సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival thriller OTT : థియేటర్లలో ఈ ఏడాది వచ్చిన ఒక సర్వైవల్ థ్రిల్లర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు, కామెడీ కూడా ఈ సినిమాలో పుష్కలంగా దొరుకుతుంది. ఒక నిర్మానుష్య ద్వీపంలో చిక్కుకున్న బాస్, అతని మహిళా ఉద్యోగిని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఓటీటీలోకి త్వరలో రాబోతోంది. మరి ఇది ఏ ఓటీటీలోకి రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే…

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సర్వైవల్ థ్రిల్లర్‌గా మూవీ పేరు ‘సెండ్ హెల్ప్’ (Send Help). దీనికి సామ్ రైమి దర్శకత్వం వహించారు. ఇందులో రాచెల్ మెక్ ఆడమ్స్, డైలాన్ ఓ’బ్రియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2026 జనవరి 30న యునైటెడ్ స్టేట్స్‌లో 20 సెంచరీ స్టూడియోస్ ద్వారా విడుదలైంది. $40 మిలియన్ల బడ్జెట్‌తో ఇది $91.5 మిలియన్లు వసూలు చేసి మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఇక ఈ సినిమా Jio hotstar లో వచ్చే నెల వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే లిండా (రాచెల్) అనే అమ్మాయిని, ఆమె పొగరుబోతు బాస్ బ్రాడ్లీ (డైలాన్) ఒక పని మీద ప్లేన్‌లో తీసుకెళ్తుంటాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో వీళ్ళ ప్లేన్ క్రాష్ అయ్యి సముద్రం మధ్యలో ఒక దీవిలో పడిపోతుంది. అదృష్టం కొద్దీ వీళ్ళు ప్రాణాలతో బయటపడతారు. అక్కడ మనుషులు ఉండరు, తినడానికి తిండి ఉండదు. అప్పటిదాకా ఆఫీసులో లిండాను తక్కువ చేసి చూసిన ఆ బాస్, తీరా అక్కడకు వెళ్ళాక పిల్లిలా మారిపోతాడు. లిండాకు సర్వైవల్ టెక్నిక్స్ బాగా తెలియడంతో, అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలంటే ఆమె కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి అతనికి వస్తుంది.

కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ దీవిలో భయంకరమైన వింత శక్తులు వీళ్ళని వేటాడటం మొదలుపెడతాయి. ఓ వైపు ఉత్కంఠంగా,మరోవైపు మధ్య మధ్యలో నవ్వు తెప్పించే కామెడీ సీన్లతో సినిమా మొత్తం ఒక రేంజ్‌లో ఉంటుంది. చివరికి వీళ్ళు ఆ దీవి నుంచి బయటపడతారా ? ఆ దీవిలో ఉన్న వింత శక్తులు ఏమిటి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : మొగుళ్ళకి తెలీకుండా తప్పుడు పని… మర్డర్ తో మైండ్ బ్లాక్ ట్విస్ట్… క్లైమాక్స్ కెవ్వు కేక

Related News

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

Big Stories

Advertisement
×