E-Paper
Advertisement

సముద్రపు అలల మధ్య టైమ్ లూప్ డెత్ ట్రాప్… మీ బుర్రను పిండి పిప్పి చేసే మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

సముద్రపు అలల మధ్య టైమ్ లూప్ డెత్ ట్రాప్… మీ బుర్రను పిండి పిప్పి చేసే మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Psychological horror thriller on OTT : టైమ్ లూప్ కాన్సెప్ట్ అంటేనే చాలా క్రేజీగా ఉంటుంది. మరి ఇలాంటి కంటెంట్ లో మైండ్ బెండ్ అయ్యే ట్విస్టులు ఉంటే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలాంటి సినిమా చూడాలను కుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. ఇది మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది మీ బుర్రను పిండి పిప్పి చేసే మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్. మొదట ఇది ఒక నార్మల్ హారర్ సినిమా లాగా స్టార్ట్ అయినా, వెళ్లేకొద్దీ టైమ్ లూప్ మిస్టరీగా మారుతుంది. అంటే ఒకే సంఘటన పదే పదే జరుగుతూ, అందులో హీరోయిన్ చిక్కుకుపోవడం ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇది చూస్తున్నప్పుడు మనకు క్యూరియాసిటీ ప్రతి నిమిషం పెరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ‘పజిల్’ లాంటి సినిమా. ఒక్క సారి చూస్తే అంత ఈజీగా మారిచిపోలేరు ఈ మూవీని.

ఎక్కడ చూడచ్చు అంటే

మైండ్ బెండింగ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ట్రయాంగిల్’ (Triangle). 2009లో వచ్చిన ఈ టైమ్ లూప్ కాన్సెప్ట్ కు క్రిస్టోఫర్ స్మిత్ దర్శకత్వం వహించారు. ఇందులో మెలిస్సా జార్జ్ (జెస్ పాత్రలో)లియామ్ హెమ్స్‌వర్త్ (విక్టర్ పాత్రలో)మైఖేల్ డోర్మన్ (గ్రెగ్ పాత్రలో) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా తెలివిగా రాశారు. ఒకే ఘటన పదే పదే జరిగినప్పటికీ, ప్రతిసారీ కొత్త విషయాలు బయటపడుతుంటాయి. కథానాయికగా మెలిస్సా తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో విక్టర్ పాత్రలో నటించిన లియామ్ హెమ్స్‌వర్త్ అప్పట్లో కొత్త నటుడు, ఆ తర్వాతే ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇక దర్శకుడు క్రిస్టోఫర్ స్మిత్ ఈ కథను గ్రీకు పురాణాలలోని ‘సిసిఫస్’ కథ ఆధారంగా రూపొందించారు. Google Play Movies మీరు ఈ సినిమాను అద్దెకు తీసుకోవచ్చు.  అయితే ఇది కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జెస్ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్‌తో కలిసి సముద్రంలో ఎంజాయ్ చేద్దామని ఒక బోటు వేసుకుని వెళ్తుంది. కానీ సీన్ కట్ చేస్తే, సముద్రంలో సడన్‌గా తుఫాను వచ్చి వీళ్ళ బోటు పల్టీ కొడుతుంది. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండగా, అటుగా వెళ్తున్న ఒక పెద్ద పాత షిప్ కనిపిస్తుంది. ఇక వేరే దారి లేక అందరూ ఆ షిప్ ఎక్కుతారు. కానీ ఆ షిప్ లోపల ఒక్క మనిషి కూడా ఉండడు, అంతా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంటుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ షిప్ ఎక్కిన కాసేపటికే ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి వీళ్ళని చంపడం మొదలుపెడతాడు. జెస్ ప్రాణాలు కాపాడుకోవడానికి చూస్తుంటే, ఒక వింత జరుగుతుంది. అదే షిప్ మీదకి మళ్ళీ తన ఫ్రెండ్స్, తనూ కొత్తగా ఎక్కుతున్నట్టు కనిపిస్తుంది.

అంటే జరిగిన సీనే మళ్ళీ మళ్ళీ జరుగుతుందన్నమాట. అరేయ్.. నేను ఇక్కడే ఉన్నాను కదా, మళ్ళీ అక్కడ ఎలా ఉన్నాను? అని జెస్‌కి పిచ్చెక్కుతుంది. అక్కడే ఆమెకు తాను ఒక టైమ్ లూప్‌ లో చిక్కుకున్నానని అర్థమవుతుంది. చివరికి జెస్ ఆ లూప్ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంటుంది. కానీ అక్కడ ఇంకో షాకింగ్ సీన్ చూస్తుంది. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నది కూడా తానే! అక్కడ తన పాత వెర్షన్ చేసే పనులు నచ్చక, తనని తానే చంపేసి తన బాబుని తీసుకుని కార్లో పారిపోతుంది. ఆ క్రమంలో యాక్సిడెంట్ జరిగి బాబు చనిపోతాడు. ఆ బాధలో ఉన్న జెస్‌కి మళ్ళీ పాత ఫ్రెండ్స్ కలుస్తారు, మళ్ళీ సముద్ర ప్రయాణం మొదలవుతుంది. అంటే జెస్ మళ్ళీ మళ్ళీ అదే టైమ్ లూప్ ని అనుభవిస్తూనే ఉంటుందన్నమాట.

Advertisement

Read Also : కొరియన్ సినిమాలోనే మాస్టర్ పీస్ ఈ యాక్షన్ థ్రిల్లర్… ఏ ఓటీటీలో ఉందంటే ?

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×