E-Paper
Advertisement

కొరియన్ సినిమాలోనే మాస్టర్ పీస్ ఈ యాక్షన్ థ్రిల్లర్… ఏ ఓటీటీలో ఉందంటే ?

కొరియన్ సినిమాలోనే మాస్టర్ పీస్ ఈ యాక్షన్ థ్రిల్లర్… ఏ ఓటీటీలో ఉందంటే ?
Advertisement

Korean Action Thriller OTT : మీరు ఒంటరి వాళ్లా ? గతాన్ని తలుచుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నారా ? అయితే అనుకోకుండా మీ లైఫ్‌లోకి ఒక అమ్మాయి వచ్చి మీ జీవితాన్నే మార్చేస్తే ఎలా ఉంటుంది ? ఆలోచిస్తే థ్రిల్లింగ్‌ గా ఉంది కదా.. అదే థ్రిల్‌ టీవీ స్క్రీన్‌ పై లేదా మొబైల్‌ స్క్రీన్‌ పై చూడాలనిపిస్తుందా ? అయితే ‘ది మ్యాన్ ఫ్రమ్‌ నోవేర్‌’ (The Man from Nowhere) సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఒక అమ్మాయి అతడి జీవితంలో ఎలా మార్పు తీసుకొచ్చిందనే అంశాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఎమోషన్, యాక్షన్, ప్రతీకారం కలిసిన కథగా ఇది ప్రేక్షకుడిని ప్రారంభం నుంచే ఆకట్టుకునే విధంగా సాగుతుంది.

ఎక్కడ చూడాలి ?

2010లో విడుదలైన ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమ్‌ అవుతోంది. ఈ సినిమాకు లీ జియాంగ్ బియోమ్ దర్శకత్వం వహించారు. వోన్ బిన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కామ్‌ అండ్‌ కంపోజ్డ్‌గా ఉన్నా, అవసరమైనప్పుడు అగ్రెసీవ్‌ గా కూడా మారుతుంది. యాక్షన్ సన్నివేశాలు సహజంగా ఉండటం, కథలో అనవసరమైన సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన బలం. తక్కువ డైలాగ్స్‌ తోనే ఎక్కువ ఎమోషన్‌ను చూపించడం ఈ సినిమా స్పెషాలిటీ.

స్టోరీ ఏంటంటే ?

Advertisement

చా తే శిక్ అనే వ్యక్తి ఒక చిన్న పావన్ షాప్ నడుపుతూ ఒంటరిగా జీవిస్తుంటాడు. అతను ఎవరితోనూ ఎక్కువగా కలవడు. అతని గతం గురించి ఎవరికి తెలియదు. పక్కింట్లో ఉండే సోమీ అనే చిన్న అమ్మాయితో మాత్రమే అతనికి అనుబంధం ఉంటుంది. ఆమెతో మాట్లాడటం అతని జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకొస్తుంది. ఒక రోజు సోమీ తల్లి డ్ర*గ్ మాఫియాతో సంబంధం వల్ల సమస్యల్లో పడుతుంది. ఆమెను వెంబడించిన వారు సోమీని కూడా అపహరిస్తారు. ఈ ఘటనతో తే శిక్ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న అతను ఒక్కసారిగా యాక్షన్‌లోకి దిగుతాడు. సోమీని కాపాడటానికి అతను నేర ప్రపంచంలోకి అడుగుపెడతాడు.

Also Read : గడప దాటి లోపలికి వస్తే శవంగా బయటకు… ఈ ఆత్మల కొంప క్లైమాక్స్ మామూలుగా ఉండదు

Advertisement

అక్కడి నుంచి కథ వేగంగా పరిగెడుతుంది. అతను ఒక్కొక్కరిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు. ఈ క్రమంలో అతని గతం బయటపడుతుంది. అతను సాధారణ వ్యక్తి కాదని, ప్రత్యేక శిక్షణ పొందిన వ్యక్తి అని తెలుస్తుంది. చివరికి సోమీని కాపాడటానికి తే శిక్ చేసే పోరాటం క్లైమాక్స్‌లో సూపర్బ్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఒక చిన్న అమ్మాయి కోసం ఒక వ్యక్తి ఎంతవరకు పోరాడగలడో ఈ సినిమా చూపిస్తుంది. ఇలా ఎమోషన్‌, యాక్షన్‌ కలగలిపిన ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూసేసి మీరు కూడా థ్రిల్ అవ్వండి.

Tags

Related News

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×