E-Paper
Advertisement

Psychological mystery thriller OTT: టెన్షన్ పెట్టే వింత కలలు… కన్ఫ్యూజ్ చేసే ఖతర్నాక్ మిస్టరీ… దిమ్మతిరిగే క్లైమాక్స్

Psychological mystery thriller OTT: టెన్షన్ పెట్టే వింత కలలు… కన్ఫ్యూజ్ చేసే ఖతర్నాక్ మిస్టరీ… దిమ్మతిరిగే క్లైమాక్స్
Advertisement

Psychological mystery thriller OTT : మలయాళం ఇండస్ట్రీ నుంచి థ్రిల్లర్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అక్కడ దర్శకులు కూడా డిఫరెంట్ స్టోరీలను తీసుకొచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మనం చెప్పబోయే మూవీ వచ్చింది. ఈ సినిమా టైంలూప్ నేపథ్యంలో సాగుతుంది. మలయాళ సినిమాలో ఇదొక కొత్త తరహా ప్రయత్నమని విమర్శకులు ప్రశంసించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కథ మామూలు జనాలకు అయితే అర్థం కాదు. కొంచెం బుర్ర ఉంటేనే ఈ సినిమాను చూడటం మంచిది.

సైనా ప్లే లో స్ట్రీమింగ్

ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘పెండ్యులమ్’ (Pendulum). దీనికి రెజిన్ ఎస్. బాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్ బాబు డాక్టర్ మహేష్ నారాయణ్ పాత్రలో నటించగా, రమేష్ పిషారోడి , అనుమోల్ , ప్రకాష్ బేర్ , ఇంద్రన్స్ , శోభి తిలకన్, నీనా కురుప్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 జూన్ 16 థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా Youtube, Saina Play ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డాక్టర్ మహేష్ నారాయణ్ తన పెళ్ళాం పిల్లలతో కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్తాడు. అక్కడ అడవిలో ఒక పాత బంగళా కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్ళిన మహేష్‌కి కొన్ని వింత వింత సంఘటనలు ఎదురవుతాయి. సడన్‌గా స్పృహ తప్పి పడిపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి, అసలు తనకి ఏమైందో అర్థం కాదు. తన కలలకి, నిజ జీవితానికి మధ్య ఏదో తేడా కొడుతున్నట్లు అతనికి అనుమానం మొదలవుతుంది.

తనకి వస్తున్న కలల్లో అమీర్, ఏంజిల్ అనే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తుంటారు. అసలు వాళ్ళెవరో, తనతో వాళ్ళకి సంబంధం ఏంటో మహేష్‌కి అస్సలు అర్థం కాదు. ఇక ‘లూసిడ్ డ్రీమింగ్’ (అంటే కలలో ఉన్నామని మనకు తెలిసే స్థితి) ద్వారానే తన గతాన్ని తెలుసు కోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక టైమ్ లూప్‌లో ఇరుక్కుపోయినట్లు, ఒకే సంఘటన మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్లు అతనికి అనిపిస్తుంది. ఆ గందరగోళం నుండి బయటపడటానికి పిచ్చిగా ప్రయత్నిస్తాడు.

Advertisement

చివరికి తను చేసిన చిన్న పొరపాటు వల్ల ఒక పెద్ద ప్రమాదం జరిగిందని, దాని వల్లే తన జీవితం ఇలా తలకిందులైందని తెలుసుకుంటాడు. అతను చేసిన పొరపాటు ఏమిటి ? ఆ టైమ్ లూప్‌ నుంచి అతను ఎలా బయట పడతాడు ? అనే మైండ్ బెండింగ్ క్లైమాక్స్ ను తెలుసుకోవాలనుకుంటే , ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ప్రేమించిన ప్రతి ఒక్కడికి యమపురికి టిక్కెట్టు … డిటెక్టివ్ కే మెంటలెక్కించే కేసు… ఉక్కిరి బిక్కిరి చేసే మలుపులు

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×