E-Paper
Advertisement

Jallikattu: జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఏకంగా 54 మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం

Jallikattu: జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఏకంగా 54 మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం
Advertisement

Jallikattu: సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేవి కోడిపందెలు, గుండాట. తమిళనాడులో అయితే జల్లికట్టు పోటీలు.  ఏపీలో కోడిపందేలు ఏ విధంగా జరుగుతాయో తమిళనాట జల్లికట్టు కూడా అంతే. గురువారం జరిగిన పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. ఎద్దులతో ఆపడానికి చేసే ప్రయత్నాల్లో ఏకంగా 54 మంది గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉంది.

మదురై జల్లికట్టు పోటీల్లో అపశృతి

Advertisement

తమిళనాడులోని జల్లికట్టు పోటీలు అంబరాన్ని తాకాయి. మదురైలో జరుగుతున్న ఈ పోటీల్లో రంకెలు వేస్తున్న గిత్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు యువకులు. వీటిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి భారీగా తరలివస్తున్నారు. ఇదిలావుండగా అవనియాపురంలో జల్లి కట్టు ప్రారంభంలో అపశృతి చోటు చేసుకుంది.

వందలాది ఎద్దులు ఒక్కసారిగా బరిలోకి దూసుకొచ్చాయి. వాటిని లొంగ దీసుకోవడానికి నానా తంటాలు పడ్డారు యువకులు. ఈ క్రమంలో 54 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో దాదాపు డజను మంది వరకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో పోరాట యోధులు 27 ఉన్నారు. బుల్ యజమానులు 20 వరకు ఉన్నారని చెబుతున్నారు.

Advertisement

54 మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం

గాయపడినవారిలో ప్రేక్షకులు ఉన్నారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కొందరు కోలుకుంటున్నారని, మరికొందరు ఇంకా రికవరీ కావాల్సివుందని వైద్యులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి ట్రీట్ మెంట్ అందిస్తున్నామని చెప్పారు. కొద్ది గంటలు గడిస్తేనే గానీ చెప్పడం కష్టమని అంటున్నారు.

ఘటన జరిగినా పోటీలు ఆపేది లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే పోటీలను ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు. శుక్రవారం పోటీలకు కొత్త టీమ్‌లు రెడీ అయ్యాయి. అయితే లైట్‌గా గాయాలు పాలైనవారు కూడా శుక్రవారం జరగనున్న పోటీలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: రిపబ్లిక్ డే పరేడ్.. వాటి కోసం 1275 కేజీల బోన్‌లెస్ చికెన్ 

తమిళనాట జల్లికట్టు పోటీలు తరతరాలుగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది జనవరిలో మకర సంక్రాంతి పండుగ రోజు ఈ పోటీలు జరుగుతాయి. మధురై, పుదుక్కోట్టై, తిరుచి, తేని వంటి జిల్లాల్లో వీటిని వైభవంగా నిర్వహిస్తారు. జల్లికట్టు పోటీలను చూసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రజలు అక్కడికి భారీగా తరలివెళ్లారు.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×