Psychological Thriller : థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే కిక్కు మిగతా సినిమాలతో పోలిస్తే వేరే ఉంటుంది. వీటిలో కూడా కొన్ని సినిమాలు యమ క్రేజీగా ఉంటాయి. మనం ఇప్పుడు ఒక హై-వోల్టేజ్ ఛేజింగ్ థ్రిల్లర్ సినిమా గురించి చెప్పుకోవాలి. ఇది ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. స్టోరీ కూడా చాలా ఇంటెన్స్ గాఉంటుంది. ఒక సైకో గాడి చేతిలో చెవిటి, మూగ ఉన్న అమ్మాయి చిక్కుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. సినిమాలో కిల్లర్ గాడు గల్లీల వెంబడి హీరోయిన్‌ని పరిగెత్తిస్తుంటే మనకు కూడా చెమటలు పట్టేస్తాయి. క్లైమాక్స్ వరకు మనల్ని కుర్చీ అంచున కూర్చోబెడుతుంది ఈ సినిమా.
ఈ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘మిడ్ నైట్’ (Midnight). 2021లో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రశంసలు అందుకుంది. యూకేలో జరిగిన Grimmfest లో ఈ సినిమాకు “బెస్ట్ ఫీచర్ ఫిల్మ్” అవార్డు వచ్చింది. అలాగే Fantasia Film Festival లో సిల్వర్ ఆడియన్స్ అవార్డును గెలుచుకుంది. ప్రముఖ వెబ్‌సైట్ Rotten Tomatoes లో దీనికి 100% రేటింగ్ రావడం విశేషం. ఇది ఒక కొరియన్ సినిమాకు దక్కడం చాలా అరుదైన విషయం. అందుకే దీన్ని ఒక మాస్టర్ పీస్ థ్రిల్లర్‌గా చెప్పుకుంటారు. ఇందులో హీరోయిన్ జిన్ కీ-జూ చెవిటి మూగ పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక ‘స్క్విడ్ గేమ్’ స్టార్ వై హా-జూన్ ఆ సైకో కిల్లర్ పాత్రలో వెన్నులో వణుకు పుట్టించేలా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో Amazon Prime Video లో అందుబాటులో ఉంది.
ఈ కథ క్యోంగ్-మీ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. పాపం ఆమెకు చెవుడు, మూగ కూడా. ఒకరోజు నైట్ డ్యూటీ ముగించుకుని వాళ్ళ అమ్మతో కలిసి ఇంటికి వెళ్తూ ఉంటుంది. చీకటిగా ఉండే ఒక సందులో దో-సిక్ అనే ఒక సైకో, ఒక అమ్మాయిని దారుణంగా పొడిచేయడం ఆమె చూస్తుంది. అసలే వాడు సైకో, జనాన్ని చంపి ఎంజాయ్ చేసే రకం. వాడు చేస్తున్న పనిని ఈ అమ్మాయి చూసేసరికి, ఇప్పుడు ఆమెను వేటాడటం మొదలు పెడతాడు. ఆ సైకో మామూలు తెలివైనోడు కాదు. బయటకి చాలా డీసెంట్ గా, మంచివాడిలా కనిపిస్తూ అందరినీ నమ్మిస్తాడు.
పోలీసులు వచ్చినా సరే, తనే బాధితుడిలా కలరింగ్ ఇచ్చి వాళ్ళ కళ్ళు కప్పుతాడు. పాపం ఆ అమ్మాయికి మాట రాదు, వినపడదు కాబట్టి వాడు తనను ఎంత వేధించినా ఎవరికీ చెప్పుకోలేక నరకం చూస్తుంది. వాడు ఆ అమ్మాయిని చంపడానికి ఊరంతా పరిగెత్తిస్తాడు. ఆ సందుల్లో వాడు వెంటపడుతుంటే, అమ్మాయి ప్రాణాలు కాపాడుకోవడానికి పడే తపన చూస్తే మనకు గుండె ఆగినంత పని అవుతుంది. చివరికి ఆ కిల్లర్ నుంచి ఆ అమ్మాయి తప్పించుకుందా ? వాడి చేతుల్లో బలైపోయిందా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : తప్పకుండా చూడాల్సిన ఇండియన్ థ్రిల్లర్ సినిమాలు… ఇవి ఇచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాక్