E-Paper
Advertisement

psychological Thriller Movie : గతం మరిచిపోయే భార్య… భర్త ఇచ్చే షాకింగ్ ట్విస్టులు… ఊహించని మలుపులతో చెమటలు పట్టించే స్టోరీ

psychological Thriller Movie : గతం మరిచిపోయే భార్య… భర్త ఇచ్చే షాకింగ్ ట్విస్టులు… ఊహించని మలుపులతో చెమటలు పట్టించే స్టోరీ
Advertisement

psychological Thriller Movie : క్లైమాక్స్ వరకు కన్ఫ్యూజ్ చేసే సినిమాలలో సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీలు ముందు వరసలో ఉంటాయి. ఈ సినిమాలు ఇచ్చే ట్విస్ట్లు కూడా మామూలుగా ఉండవు. సస్పెన్స్ తో ఆడియన్స్ బుర్ర పాడు చేస్తుంటాయి కూడా. ఇక రీసెంట్ గా ఓటీటీలోకి ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఊహించని ట్విస్ట్లు ఇందులోచాలానే ఉన్నాయి. ఓ జంట చుట్టూ స్టోరీ ఉంటుంది. ఒక ఘోరమైన కారు ప్రమాదం తర్వాత కోమాలోకి వెళ్లి జ్ఞాపకశక్తి కోల్పోయిన డయానా అనే మహిళతో ఈ కథ మొదలవుతుంది. ఆమె భర్త ఇచ్చే షాకింగ్ ట్విస్టులతో స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హనీ బంచ్’ (Honey Bunch). 2025లో విడుదలైన ఈ థ్రిల్లర్ సినిమా మేడ్లిన్ సిమ్స్-ఫీవర్, డస్టీ మాన్సినెల్లి కలసి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గ్రేస్ గ్లోవిక్కి, బెన్ పెట్రీ, జాసన్ ఐజాక్స్, కేట్ డిక్కీ, ఇండియా బ్రౌన్ నటించారు. ఈ చిత్రం బెర్లినేల్ స్పెషల్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2025 ఫిబ్రవరి 18న 75వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఇది 2026 ఫిబ్రవరి 13 నుండి Shudder ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డయానా అనే మహిళ ఒక పెద్ద కారు ప్రమాదం తర్వాత కోమాలోకి వెళ్లిపోతుంది. స్పృహ వచ్చాక ఆమెకు గతం ఏమీ గుర్తుండదు. కనీసం తన భర్త హోమర్‌ని కూడా గుర్తుపట్టలేదు. హోమర్ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ, జ్ఞాపకశక్తి తిరిగి రావడానికి అడవిలో ఉన్న ఒక వింతైన హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్లు ఇచ్చే ట్రీట్‌మెంట్ చాలా వింతగా, భయంకరంగా ఉంటుంది. ఆ ట్రీట్‌మెంట్ జరుగుతున్న కొద్దీ డయానాకు వింత వింత కలలు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి.

అయితే ఆ హాస్పిటల్‌లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే క్రమంలో డయానాకు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. తన భర్త అని చెప్పుకుంటున్న వ్యక్తి నిజంగా తను అనుకుంటున్నంత మంచోడు కాదని, ఆ హాస్పిటల్‌కి తనని తీసుకురావడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అర్థమవుతుంది. తన గతాన్ని తవ్వే కొద్దీ తన పెళ్లి వెనుక ఉన్న భయంకరమైన రహస్యాలు బయటపడతాయి. చివరికి ఆమె ఆ మాయాజాలం నుండి ఎలా బయటపడింది ? భర్త అసలు రూపం ఏమిటి ? డయానా తెలుసుకున్న సీక్రెట్స్ ఏమిటి ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఒళ్లు గగుర్పొడిచే నిజాలతో బెంగాలీ థ్రిల్లర్ సిరీస్… రిలీజ్ డేట్ వాయిదా… అందుబాటులోకి వచ్చేది అప్పుడే

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×