E-Paper
Advertisement

సమ్మర్ లో పిల్లలు మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 యానిమేషన్ మూవీస్

సమ్మర్ లో పిల్లలు మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 యానిమేషన్ మూవీస్
Advertisement

Best Animated Movies OTT : సమ్మర్ తో పాటు పిల్లలకు హాలిడేస్ కూడా వచ్చేశాయి. అయితే ఈసారి ఎండలు ఎక్కువగా ఉండడంతో బయట అడుగు పెట్టాలంటేనే జనాలు తెగ భయపడుతున్నారు. ఇక చిన్న పిల్లలు కూడా ఆరు బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో భగభగ మండుతున్న ఎండలకు చెక్ పెట్టి, కూల్ గా ఇంట్లోనే కొన్ని సినిమాలను చూస్తూ చిల్ అవ్వాలి అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్.

Puss in Boots (2011)

‘ష్రెక్’ సినిమాలో పరిచయమైన పిల్లి పాత్ర పుస్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. 2011లో విడుదలైన ఈ మూవీలో తాను పోగొట్టుకున్న పరువును తిరిగి సంపాదించుకోవడానికి బంగారు గుడ్లు పెట్టే బాతు కోసం పుస్ సాహసయాత్ర మొదలెడుతుంది. ‘పుస్ ఇన్ బూట్స్’ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

Shrek (2001)

Advertisement

‘ష్రెక్’ మూవీ రాక్షసుడి కథ. ఒక గాడిదతో కలిసి యువరాణి ఫియోనాను రక్షించే ఆ రాక్షసుడు చేసే ప్రయాణమే ఈ క్లాసిక్ కామెడీ. ‘ష్రెక్’ సినిమా ఇప్పుడు Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Hotel Transylvania (2012)

‘హోటల్ ట్రాన్సిల్వేనియా’ గురించి తెలియని యానిమేటెడ్ మూవీ లవర్స్ ఉండరేమో. కౌంట్ అనే డ్రాకులా తన కూతురితో పాటు రాక్షసుల కోసం మాత్రమే ఒక హోటల్ నడుపుతాడు. కానీ అక్కడికి జోనాథన్ అనే మనిషి రాకతో కథ అడ్డం తిరుగుతుంది.

The Good Dinosaur (2015)

Advertisement

డైనోసార్లు అంతరించిపోని ఒక ప్రపంచంలో ‘ద గుడ్ డైనోసార్’ కథ సాగుతుంది. అర్లో అనే భయస్తుడైన డైనోసార్ తప్పిపోతుంది. ఒక చిన్న పిల్లవాడితో స్నేహం చేసి అది ఇంటికి ఎలా చేరుకుంది అనే ఎమోషనల్ స్టోరీ ఇది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే… ఇందులో డైనోసార్ మనిషిలా బిహేవ్ చేస్తుంది. అలాగే మనిషి జాతికి చెందిన ఆ పిల్లాడు మాత్రం జంతువులా, ఒకరకంగా చెప్పాలంటే కుక్కలా బిహేవ్ చేస్తూ కన్పిస్తాడు. కానీ క్లైమాక్స్ మాత్రం కిరాక్ ఉంటది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం Netflixలోనే ఉన్నాయి.

Also Read : చిన్న పిల్లలను దారుణంగా చంపే సీరియల్ కిల్లర్… అడుగడుగునా సస్పెన్స్ తో కట్టిపడేస్తున్న స్టోరీ

Zootopia (2016)

అన్ని జాతుల జంతువులు కలిసి ఒకే చోట నివసించే ఒక ఆధునిక నగరమే ఈ జూటోపియా. అక్కడ జుడీ హాప్స్ అనే కుందేలు మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్ అవుతుంది. నిక్ వైల్డ్ అనే జిత్తులమారి నక్క సాయంతో నగరంలో జరుగుతున్న ఒక పెద్ద కుట్రను అది ఎలా ఛేదించిందో ఇందులో చూడొచ్చు. ఈ మూవీ JioHotstarలో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే సీక్వెల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ‘జూటోపియా’, ‘ష్రెక్’ మాత్రం ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం విశేషం.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×