E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Prema katha chitram promo: ప్రేమ భారం కాదు.. ఇద్దరినీ కలిపే తాళం.. హర్రర్ కామెడీగా ప్రేమ కథ చిత్రమ్

Prema katha chitram promo: ప్రేమ భారం కాదు.. ఇద్దరినీ కలిపే తాళం.. హర్రర్ కామెడీగా ప్రేమ కథ చిత్రమ్
Advertisement

Prema katha chitram: ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాలలో సినిమాలను మించిన కంటెంట్ వెబ్ సిరీస్ లలో ఉంటుంది అంటే ఆశ్చర్యం వ్యక్తం చేయక మానదు. ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు రాజ్ శివ తేజ (Raj siva teja)ఒకరు. రాజ్ శివతేజ సుమారు 400కు పైగా షార్ట్ ఫిలిమ్స్ చేసి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే త్వరలోనే రాజు శివ తేజ వీరాజిత (Virajitha)జంటగా నటించిన “ప్రేమ కథ చిత్రమ్ “(Prema Katha Chitram) అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ప్రేమ ఇద్దరికీ భారం కాదు..

తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే మాత్రం వెబ్ సిరీస్ భారీ రేంజ్ లో ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఈ ప్రోమో వీడియోలో భాగంగా ప్రేమ అనేది ఇద్దరు మధ్య భారం కాదు ఇద్దరిని కలిపే తాళం అవుతుంది అనే డైలాగ్ తో ప్రారంభమవుతుంది. విరాజిత లోకి దయ్యం ఆవహించి ఆమె వ్యవహరించే విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది . ఇక ఈ ప్రోమోలో వీరాజిత ఎన్నో రకాల ఆహార పదార్థాలను తింటున్న నేపథ్యంలో హీరో నువ్వు ప్రభాస్ ఫ్యానా అంటూ అడగడం అందరిని ఆకట్టుకుంది.

త్వరలోనే స్ట్రీమింగ్..

Advertisement

ఇలా హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదల చేసిన ప్రోమో వీడియో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక వెబ్ సిరీస్ కూడా ఇదే రేంజ్ లోనే ప్రేక్షకులకు కావాల్సిన ఫన్ ఇవ్వబోతుందని స్పష్టం అవుతుంది. అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే స్ట్రీమింగ్ కు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఈ కామెడీ హర్రర్ వెబ్ సిరీస్ కు వందన బండారు నిర్మాతగా వ్యవహరించగా,పవన్ సూరిబాబు దర్శకత్వం వహించారు.

Advertisement

ఇక రాజ్ శివ తేజ విషయానికి వస్తే.. యూట్యూబర్ గా షార్ట్ ఫిలిం హీరోగా తన కెరియర్ ప్రారంభించి ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. రాజ్ శివతేజ కామెడీ డైలాగులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. షణ్ముఖ్ జస్వంత్ నటించిన సూర్య వెబ్ సిరీస్ లో ఈయన తన స్నేహితుడి పాత్రలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ వెబ్ సిరీస్ తర్వాత రాజ్ శివతేజకు కూడా అదే స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల పలు సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని రాజ్ శివతేజ అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: Swayambu Overseas: భారీ ధరలకు నిఖిల్ స్వయంభు ఓవర్సీస్ రైట్స్.. ఆల్ టైం రికార్డ్!

Related News

విదేశాలకు వెళ్ళే వాళ్లే టార్గెట్… అవయవాల అక్రమ రవాణాతో హార్ట్ ఎటాక్ తెప్పించే సినిమా

చూడకూడని సీన్స్ లేవు… కడుపుబ్బా నవ్వించే కామెడీ… ఫ్యామిలీ ఆడియన్స్ కు మస్త్ మజా

పూర్వీకుల ఇంట్లో చిన్నారిని వెంటాడే పురాతన శాపం… మలయాళం ఫాంటసీ హారర్ థ్రిల్లర్

ముఖ్యమంత్రి పీఠం కోసం వరుస హత్యలు… కుక్కల సంరక్షకుడి ఎంట్రీతో అదిరే ట్విస్ట్

కంటికి కన్పించని అమ్మాయితో ప్రేమ పెళ్లి… ఖతర్నాక్ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

Maa Inti Bangaram OTT: సమంత ‘ మా ఇంటి బంగారం ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సరికొత్త ఫాంటసీ ట్విస్ట్‌తో ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’.. ఈసారి రచ్చ మామూలుగా లేదు!

అమ్మాయి వెంటపడే ఆగంతకులు… ఆమె చేసిన పని చూస్తే బుర్ర బ్లాస్ట్

Big Stories

×