E-Paper
Advertisement

Oppo A6X 5G Smartphone: బడ్జెట్ ధరలో కొత్తఫోన్ కావాలా నాయనా.. ఈ 5జీ ఫోన్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తెలిస్తే మతిపోద్ది!

Oppo A6X 5G Smartphone: బడ్జెట్ ధరలో కొత్తఫోన్ కావాలా నాయనా.. ఈ 5జీ ఫోన్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తెలిస్తే మతిపోద్ది!
Advertisement

Oppo A6X 5G Smartphone: ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న బ్రాండ్స్‌లో ఒప్పో ఒకటి. త్వరలో ఒప్పో నుంచి భారత‌ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. Oppo A6x 5G పేరుతో విడుదల కానున్న ఈ హ్యాండ్ సెట్ సామాన్యులు సైతం కొనేలా అందుబాటు ధరలోనే ఉండనుందని సంస్థ తెలిపింది. ఇప్పటికే లీకైన ఒప్పో A6X 5G స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ధర ఎంత ఉండవచ్చు?

ఈ ఒప్పో A6X 5G స్మార్ట్‌ఫోన్.. 4GB RAM+ 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,499 ధర పలకవచ్చు. 4GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.13,499 ఉంటుంది. 6GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం దాదాపు రూ.14,999 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇది ఊహించిన ధర మాత్రమే. ఈ ఫోన్ ధరపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Advertisement

Read Also: వారెవ్వా అనేలా హానర్ కొత్తఫోన్.. 200MP కెమెరా, 7200 mAh బ్యాటరీతో లాంచ్!

స్పెసిఫికేషన్లు:

ఈ హ్యాండ్ సెట్ వెనుక భాగంలో ఏఐ లెన్స్, సెకండరీ VGA సెన్సార్‌తో 13 MP మెయిన్ సెన్సార్‌ను, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 45W సూపర్ వూక్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో పెద్ద 6500mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌తో సాధారణ వినియోగంలో రెండ్రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను సులభంగా పొందవచ్చు.

Advertisement

Oppo A6X 5G స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌, రోజువారీ వినియోగం, భారీ గేమింగ్‌లో సున్నితమైన స్క్రోలింగ్‌ సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంటుందని, అలాగే 3.5 మి.మీ హెడ్‌ఫోన్ జాక్‌ ఉంటుందని అంచనా.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రానుంది. ఇది 4GB లేదా 6GB RAM, 64GB లేదా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. లేదా దీన్ని మరింత విస్తరించవచ్చు. ఒప్పో A6X 5G ఫోన్ కలర్ OS 15 కస్టమ్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 15లో రన్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read Also: రెడ్‌మీ ప్రియులకు క్రేజీ అప్డేట్.. బడ్జెట్ ధరలోనే కొత్తఫోన్ లాంచ్‌కు రంగం సిద్ధం!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×