E-Paper
Advertisement

Smartphone Comparison: పోకో C85 vs రియల్‌మి C85 vs రెడ్‌మి 15C.. రూ.12000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: పోకో C85 vs రియల్‌మి C85 vs రెడ్‌మి 15C.. రూ.12000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

Poco C85 vs Redmi 15C vs Realme C85 5G Comparison| పోకో కంపెనీ ఇండియాలో కొత్తగా పోకో C85 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఫోన్‌కు రెడ్‌మి 15C 5G, రియల్‌మీ C85 5Gతో తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ మూడు ఫోన్లు కూడా బడ్జెట్ 5G కస్టమర్స్‌ కోసమే రూపొందించబడ్డాయి. మూడింటిలో కూడా ప్రాసెసర్ ఒకేలా ఉంది కానీ డిస్‌ప్లే, బ్యాటరీ, ధర లో తేడాలు ఉన్నాయి. కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే బడ్జెట్ జీవులు ఏది ఎంచుకోవాలో ఒకసారి వాటి ఫీచర్లు పోల్చి చూద్దాం.

ధర, స్టోరేజ్ ఆప్షన్లు

మూడు ఫోన్లలో పోకో C85 5Gకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బేస్ మోడల్ 4GB/128GB ధర రూ.11,999. రెడ్‌మి 15C 5G బేస్ మోడల్ అదే వేరియంట్ ధర రూ.12,499. రియల్‌మీ C85 5G అత్యధిక ధర కలిగినది. దీని 4GB/128GB వేరియంట్ ధర రూ.14,999 నుంచి ప్రారంభ ధరలో ఉంది.

డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు

Advertisement

పోకో, రెడ్‌మి ఫోన్లలో ఒకేలాంటి డిస్‌ప్లే ఉంది. రెండింట్లో కూడా 6.9 అంగుళాల HD+ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. రియల్‌మీ C85లో కొద్దిగా చిన్న డిస్‌ప్లే అంటే 6.8 అంగుళాల సైజులో ఉంది. కానీ ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్

పోకో C85, రెడ్‌మి 15Cలో 6000mAh బ్యాటరీ ఉంది. రెండూ 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. పోకోలో అదనంగా 10W రివర్స్ చార్జింగ్ ఉంది. రియల్‌మీ C85లో అతి పెద్ద 7000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్

Advertisement

మూడు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతాయి. పోకో C85లో హైపర్ OS 2.2 ఉంది. రెడ్‌మి 15Cలో హైపర్ OS 2 ఉంది. రియల్‌మీ C85లో రియల్‌మీ UI 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ని కస్టమైజ్డ్ చేశారు.

ప్రాసెసర్ పెర్ఫామెన్స్

మూడు మోడళ్లలో ఒకే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ చిప్ ఉంది. ఇది రోజువారీ పనులు, గేమింగ్‌లో సమాన పెర్ఫామెన్స్ ఇస్తుంది. ఇంత తక్కువ ధరలో ఇది చాలా మంచి ప్రాసెసర్.

కెమెరా సామర్థ్యాలు

ఈ లో బడ్జెట్ రేంజ్‌ మూడు ఫోన్లలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. పోకో, రెడ్‌మిలో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మీలో సోనీ IMX852 సెన్సార్ ఉపయోగించారు. కెమెరా క్వాలిటీలో చిన్న తేడాలు ఉంటాయి కానీ బేసిక్ ఫోటోగ్రఫీకి సరిపోతాయి.

కనెక్టివిటీ పోర్ట్స్

మూడు ఫోన్లు 5G నెట్‌వర్క్ సపోర్ట్ చేస్తాయి. అన్నింట్లో USB టైప్-C పోర్ట్ ఉంది. పోకో, రెడ్‌మిలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది. రియల్‌మీలో ఈ జాక్ లేదు.

Also Read: గూగుల్ ఫ్రీ రిపేర్ ఆఫర్.. పిక్సెల్ ఫోన్లలో సమస్య ఉంటే కొత్త ఫోన్ ఉచితం

మీకు ఏది బెస్ట్?

తక్కువ ధర కావాలంటే పోకో C85 తీసుకోండి. MIUI ఎక్స్‌పీరియన్స్ కావాలంటే రెడ్‌మి 15C ఎంచుకోండి. పెద్ద బ్యాటరీ కావాలంటే రియల్‌మీ C85 తీసుకోండి. మీ బడ్జెట్, బ్యాటరీ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోండి. మూడు ఫోన్లు కూడా తక్కువ ధరలో మంచి 5G వాల్యూ ఇస్తాయి.

Also Read: ఆండ్రాయిడ్ లో ఐఫోన్ ఫీచర్స్.. 15 ఏళ్ల ఇండియన్ కుర్రాడి అద్భుత సృష్టి

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×