E-Paper
Advertisement

OTT Movie : రాత్రయితే అమ్మాయిలను వేటాడి చంపే సైకో కిల్లర్… IMDbలో 7.3 రేటింగ్… క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : రాత్రయితే అమ్మాయిలను వేటాడి చంపే సైకో కిల్లర్… IMDbలో 7.3 రేటింగ్… క్షణక్షణం ఉత్కంఠ
Advertisement

OTT Movie : నవాజుద్దీన్ సిద్దీకీ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. అతని విలక్షణమైన నటనని చూడటానికే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తుంటారు. ఈ హీరో నటించిన సినిమాలు ఎక్కువగా క్రైమ్ స్టోరిలే ఉన్నాయి. అయితే వీటిలో మరింత భయంకరంగా ఉండే సినిమా
‘రామన్ రాఘవ్ 2.0’. ఈ సినిమా 1960ల నాటి ముంబైలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన నిజమైన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రామన్న పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సీరియల్ కిల్లర్ గా జీవించాడానే చెప్పాలి. ఇతనికి ధీటుగా పోలీసు అధికారిగా విక్కీ కౌశల్ పాత్ర కూడా ఉంటుంది. ఇక వీళ్ళు చేసే విన్యాసాలను ఈ సినిమాను చూసినోళ్ళకే తెలుస్తుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ సినిమాని చూడకపోతే మరో సారి ఓ లుక్ వేయండి. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘రామన్ రాఘవ్ 2.0’ (Raman Raghav 2.0) 2016లో రిలీజ్ అయిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇందులో నవాజుద్దీన్ సిద్దీకీ (రామన్న), విక్కీ కౌశల్ (రాఘవ్), సోభితా ధూలిపాల (సిమ్మీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కేన్స్ ఫెస్టివల్ లో 2016 మే లో ప్రీమియర్ అవ్వగా, ఆ తరువాత 2016 జూన్ 24న థియేట్రికల్ రిలీజ్ అయింది. 2 గంటల 13 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌, జీ 5 లో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

ఈ స్టోరీ ముంబై స్లమ్స్‌లో మొదలవుతుంది. రామన్న (నవాజ్) ఒక సైకో సీరియల్ కిల్లర్,రాత్రి టైమ్‌లో ఐరన్ రాడ్‌తో ఎవర్నైనా కొట్టి చంపేస్తుంటాడు. ఎక్కువగా మహిళలను టార్గెట్ చేస్తుంటాడు. అతను 1960ల్లోని రామన్ రాఘవ్‌ అనే పాత కిల్లర్ ని ఫాలో అవుతాడు. తనని “రామన్ రాఘవ్ 2.0” అని పిలుచుకుంటాడు. మరో వైపు రాఘవ్ (విక్కీ కౌశల్) అనే ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్ తన గర్ల్‌ఫ్రెండ్ సిమ్మీ (సోభితా)తో ఉంటాడు. అతను డ్రగ్స్ కి బానిస, చాలా వయోలెంట్ గా ఉంటాడు. సిటీలో మర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ప్రతి మర్డర్‌లో ఐరన్ రాడ్ ని యూస్ చేసి ఉంటాడు. రామన్న పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ, రాఘవన్‌ను ఇబ్బంది పెడుతుంటాడు.

Read Also : కోటి కట్టకపోతే ఇంట్లోంచి గెంటేస్తామని వార్నింగ్… ముసలావిడ మాస్టర్ ప్లాన్ కు హ్యాట్సాఫ్ భయ్యా

Advertisement

రామన్న తన హత్యల ద్వారా పోలీసు అధికారి రాఘవన్‌కు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఇద్దరి స్వభావాలు ఒకటేనని, కేవలం పాత్రలు మాత్రమే వేరని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. రాఘవన్ జీవితం కూడా వ్యక్తిగత సమస్యలు, మాదకద్రవ్యాల వ్యసనం, హింసతో ఉంటుంది. ఒక రోజు రాఘవ్ ఇంటికి వచ్చి సిమ్మీని రామన్న భయపెడతాడు. దీంతో రామన్నను రాఘవన్‌ ఎలాగైనా పట్టుకోవాలనుకుంటాడు. ఇక క్లైమాక్స్ లో స్టోరీ మరింత క్రూరంగా ఉంటుంది. చివరికి రాఘవన్ కి రామన్న చిక్కుతాడా ? హత్యలు ఆగుతాయా ? అనే విషయాలను, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్  సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×