E-Paper
Advertisement

OTT Movie : బాట్లా హౌస్ నుండి 26/11 వరకు… ఉగ్రవాద దాడుల ఆధారంగా వచ్చిన ఈ సిరీస్ లు ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

OTT Movie : బాట్లా హౌస్ నుండి 26/11 వరకు… ఉగ్రవాద దాడుల ఆధారంగా వచ్చిన ఈ సిరీస్ లు ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
Advertisement

OTT Movie : భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీటిని ఆడియన్స్ ఎలా జరిగాయనే ఇంటెన్స్ తో చూస్తున్నారు. ముంబై దాడులవంటి సంఘటనల్లో ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాడుల తరువాత ఉగ్రవాదుల వేట, బాధితుల జీవితాలు, సైనికుల పోరాటాలు ఈ స్టోరీలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ రోజు మనం బాంబు పేలుళ్లు, ఉగ్రవాద దాడుల ఆధారంగా వచ్చిన సినిమాలు, సిరీస్ లు ఏ ఓటీటీలో ఉన్నాయి ?  వీటి వివారాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం.

‘బాట్లా హౌస్’ (Batla House)

2019 లో వచ్చిన ఈ సినిమాలో జాన్ అబ్రహం, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఢిల్లీ సీరియల్ బాంబు దాడుల తర్వాత కొద్దిసేపటికే జరిగిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

‘ముంబై మేరీ జాన్’ (Mumbai Meri Jaan)

Advertisement

2008లో విడుదలైన ఈ సినిమా, 2006 ముంబై రైలు బాంబు దాడుల ప్రభావం సాధారణ ప్రజలపై ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, ఇర్ఫాన్ ఖాన్, సోహా అలీ ఖాన్, పరేష్ రావల్, కే కే మీనన్ ఆనంద్ గొరాడియా నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

‘బ్లాక్ ఫ్రైడే’ (Black Friday)

ఈ చిత్రం 1993 బొంబాయి బాంబు దాడుల సంఘటనలు, ఆ తరువాత జరిగిన పోలీసు దర్యాప్తు ఆధారంగా రూపొందింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2004 లో విడుదలైంది. ఇందులో కే కే మీనన్, ఆదిత్య శ్రీవాస్తవ, పవన్ మల్హోత్రా విజయ్ మౌర్య నటించారు. యూట్యూబ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది.

‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ (The Attacks Of 26/11)

Advertisement

2013 లో విడుదలైన ఈ చిత్రం 2008 ముంబై ఉగ్రవాద దాడుల ఆధారంగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో సంజీవ్ జైస్వాల్, నానా పటేకర్, అతుల్ కులకర్ణి, ఆసిఫ్ బాస్రా, జితేంద్ర జోషి మరియు గణేష్ యాదవ్ కీలక పాత్రల్లో నటించారు. జియో హాట్‌స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ (The Hunt – The Rajiv Gandhi Assassination Case)

ఏడు ఎపిసోడ్‌ల సిరీస్ రాజీవ్ గాంధీ ఆత్మాహుతి బాంబు దాడిలో హత్యకు గురైన తర్వాత 90 రోజుల పాటు జరిగిన హంతకుల వేటను చూపిస్తుంది.  దీనికి దర్శకత్వం నగేష్ కుకునూర్ నిర్వహించాగా, అమిత్ సియాల్, సాహిల్ వైద్, బగవతి పెరుమాళ్ మరియు గిరీష్ శర్మ నటించారు ఈ సిరీస్ 2025 జూలై 4న SonyLIVలో విడుదలైంది.

Read Also : మిస్టీరియస్ గా మర్డర్ కేసులు… మదర్ సెంటిమెంట్ తో క్రేజీ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×